వైసీపీ చక్కదిద్దుకోలేకపోతే చిక్కులే..!

jagan
Spread the love

ఏపీ రాజకీయాల్లో నంద్యాలకు ముందు..ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. నంద్యాల ఫలితాల ప్రభావంతో కాకినాడలో ఉన్న బలాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిన వైసీపీ శ్రేణులు కొంత ఢీలా పడ్డాయి. అదే సమయంలో రాష్ట్రమంతా చంద్రబాబు సర్కారు తీరు మీద పెరుగుతున్న వ్యతిరేకత ఆపార్టీకి ఊరటగా కనిపిస్తోంది. ఎన్నికల ఊపుతో చెలరేగిపోదామని చంద్రబాబు ఆశిస్తే..సినిమా వాళ్లతో చేస్తున్న ప్రయత్నాలు అసలుకే ఎసరు తెస్తున్నాయి. దాంతో టీడీపీకి నంద్యాల తీర్పు నమ్మకం కలిగిస్తుందని భావించినోళ్లు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వ్యవహారం మీద మాత్రం విశ్వాసం కలగడం లేదని చెబుతున్నారు.

దానికి కారణాలు కూడా లేకపోలేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇప్పుడు వైసీపీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టింది. కమిటీలంటూ హడావిడి చేసినా అవి ఆచరణలో కార్యరూపం దాల్చడం లేదు. దాంతో కిందిస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిపక్షానికి మరలడం మీద అనుమానాలు కనిపిస్తున్నాయి. ఓటర్లున్నప్పటికీ ఓటు వేయించేవారెవరనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ విషయంలో జగన్ కసరత్తులు చేసినా ఇప్పటికే కాలం గడిచిపోయిందని చెప్పవచ్చు.

షెడ్యూల్ ప్రకారం మరో నెలరోజుల్లో జగన్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. అంటే ఇక ఆ తర్వాత కేవలం ప్రచారం, నిత్యం ఆరోపణలు, కౌంటర్లు ఇలా కాలం గడిచిపోతుంది. పాదయాత్ర ముగిసేనాటికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. ఆతర్వాత ఎన్నికల వాతావరణం. ఈ నేపథ్యంలో వైసీపీ నిర్మాణ వ్యవహారాలకు సమయం లేదనే చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి ప్రజల్లో అభిమానం ఉన్నప్పటికీ దానిని సొమ్ము చేసుకోవడం ఎలా అనే సమస్య ఎదురవుతోంది. అయితే ఓసారి పాలకపక్షాన్ని మట్టి కరిపించాలని ప్రజలు నిర్ణయించుకుంటే మాత్రం పోటీపక్షంలో ఎవరు, వారి బలాలేమిటనే విషయంలో పెద్దగా పట్టింపులుండవని గత చరిత్ర చెబుతోంది. అలాంటి పరిస్థితి ఉంటుందా అన్నది చూడాలి.

అదే సమయంలో జగన్ తన అనుచరుల్లో చొరవ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రాయలసీమ, ప్రకాశం , నెల్లూరు జిల్లాలు కలుపుకుని సుమారు 40 సీట్లు, మిగిలిన రాష్ట్రమంతా కలిపి మరో 40 స్థానాల్లో మాత్రమే నాయకుల విషయంలో స్పష్టత ఉంది. దాంతో చాలామంది చివరి వరకూ ఆచితూచి అడుగులేయాలని భావిస్తున్నారు. సర్వేలు, ఇతర వ్యవహారాల పేరుతో చివరి నిమిషంలో తేడా వస్తే చేతులు కాల్చుకోవాల్సి వస్తుందనే అంచనాలో ఉన్నారు. ఈ తరుణంలో కనీసం పాదయాత్ర నాటికైనా మూడొంతుల సీట్ల విషయంలో స్పష్టత కోసం ప్రయత్నించాల్సి ఉంటుంది. ఆతర్వాత చిన్న చిన్న మార్పులు జరిగినప్పటికీ దాదాపుగా నిర్ణయం మాదిరిగా కనిపిస్తే తద్వారా వైసీపీలో గందరగోళం కొంత తొలగడానికి తోడ్పడుతుంది. మరి నిర్మాణం విషయంలో నిర్లక్ష్యం వీడని వైసీపీ నేతలు ఇలాంటి అంశాలపై ఏమేరకు ద్రుష్టి సారిస్తారో చూడాల్సి ఉంది.


Related News

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the loveఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa-768x512

జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..

Spread the loveఏపీకి ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారం రాజ‌కీయ పార్టీల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రాష్ట్రానికి హోదా వ‌స్తుందా రాదా అన్న‌దిRead More

 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • చంద్రబాబు సీట్లు కథకి చెక్ పెట్టిన షా
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *