Main Menu

ప్ర‌జారాజ్యం దారిలో వైసీపీ

chiranjeevi_0
Spread the love

రాజ‌కీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉంటేనే అక్క‌డ నిల‌బ‌డ‌గ‌లుగుతారు. దానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలాంటి పార్టీ అయినా క‌ష్టాలు కొనితెచ్చుకున్న‌ట్టే అవుతుంది. ఈ విష‌యంలో ప్ర‌జారాజ్యం తీరు వ‌ర్త‌మాన రాజ‌కీయ నేత‌లంద‌రికీ ఓ పెద్ద అనుభ‌వం. దాని నుంచి పాఠాలు నేర్చుకుంటేనే వైఎస్ జ‌గ‌న్ లాంటి యువ ప్రాంతీయ పార్టీల నేత‌ల‌కు మనుగ‌డ ఉంటుంది. ముఖ్యంగా రాజ‌కీయ ఎత్తుల విష‌యంలో అనేక గుణ‌పాఠాల‌ను చిరంజీవి అందించారు. త‌న మీద విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు వాటికి స‌మాధానం చెప్ప‌డంలో చిరంజీవి అవ‌లంభించిన తీరు చివ‌ర‌కు ఆయ‌న కొంప‌ముంచింది. రాజ‌కీయంగానూ, నైతికంగానూ దాడి చేయ‌డ‌మే కాకుండా వ్య‌క్తిత్వం మీద కూడా నిత్యం ప్ర‌త్య‌ర్థులు దాడి చేస్తుంటారు. వాటిని కాచుకోవ‌డం , ఎదురించి నిల‌వ‌డం నాయ‌కుడికి, పార్టీకి అవ‌స‌రం. కానీ చిరంజీవి ఈ విష‌యంలో ఏమ‌రుపాటు ప్ర‌ద‌ర్శించ‌డం జెండా పీకేసే వ‌ర‌కూ వ‌చ్చేసిందన్న‌ది కాద‌న‌లేని స‌త్యం.

తాజాగా నంద్యాల ఘ‌ట‌న‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే నంద్యాల‌లో వైసీపీ బ‌హిరంగ‌స‌భ ప్ర‌త్య‌ర్థుల‌ను మూడు చెరువుల నీళ్లు తాగించే దిశ‌లో సాగింది. శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి రాజీనామా వ్య‌వ‌హారం రాష్ట్రంలో ఫిరాయింపుదారుల గుండెళ్లో రైళ్లు ప‌రుగులెట్టించింది. కానీ ఒకే ఒక్క మాట‌తో జ‌గ‌న్ ఆ స‌భ విజ‌యవంత‌మ‌యిన తీరును అనుభ‌వించ‌కుండా చేసింది. మంచి ఫ‌లితాన్ని ఆస్వాదించాల్సిన చోట త‌న పార్టీ డిఫెన్స్ లో ప‌డేలా చేసింది. దానిని ఉప‌యోగించుకుని తెలుగుదేశం ఎదురుదాడికి దిగింది. ఊరూవాడ దిష్టిబొమ్మ‌ల‌తో హ‌ల్ చ‌ల్ చేసింది. మీడియా వంత‌పాడింది. బాబుని కాపాడేమార్గం కోసం కాచుకుని కూర్చున్న వారికి మంచి అవ‌కాశం ద‌క్కిన‌ట్ట‌య్యింది. దాంతో మొత్తం వ్య‌వ‌హారం చేజేతులా ఛాన్స్ మిస్స‌య్యింద‌ని వైసీపీ శ్రేణులు వాపోవాల్సి వ‌చ్చింది.

స‌రిగ్గా ఇక్క‌డే ప్ర‌జారాజ్యం ప‌ద్ధ‌తిలో వైసీపీ వ్య‌వ‌హ‌రించింది. సహ‌జంగా ఎంత‌టి సీనియ‌ర్ నాయ‌కుడైనా నోరు జార‌డంలో చిత్ర‌మేమీ లేదు. ఎస్సీలుగా పుట్టాల‌ని ఎవ‌రు కోర‌కుంటారంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదు చేయాల్సిన స్థాయిలో ఉన్నాయి. కానీ వాటి ప్ర‌భావం క‌నిపించ‌లేదు. ఇంకా చాలా వ్యాఖ్య‌లు ఇలాంటి వివాదాల‌కు మూలంగా ఉన్నాయి. అయినా వాటిని జ‌నంలోకి వెళ్ల‌కుండా చేయ‌డంలో చంద్ర‌బాబు జాగ్ర‌త్త‌లు పాటించారు. మీడియా చేతిలో ఉండ‌డం కొంత తోడ్ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ అదే స‌మ‌యంలో దాని మీద ర‌చ్చ‌చేయ‌డంలో వైసీపీ విఫ‌లం కావ‌డం చంద్ర‌బాబుకి తోడ‌య్యింది. కానీ జ‌గ‌న్ విష‌యంలో దానికి భిన్నంగా ఆయ‌న పార్టీ వ్య‌వ‌హ‌రించింది. పూర్తి డిఫెన్స్ వ్యూహం అనుస‌రించి స‌మ‌స్య‌లు కొనితెచ్చుకుంది. నంద్యాల స‌భ‌లో చెప్పిన మాట‌ల ఆధారంగా చంద్ర‌బాబుని జ‌గ‌న్ కాల్చేయాల‌నుకుంటున్నార‌ట క‌దా..అంటూ రాష్ట్ర‌మంతా మాట్లాడుకునే ప‌రిస్థితి తెచ్చుకుంది.

జ‌గ‌న్ వ్యాఖ్య‌ల మీద టీడీపీ దాడి చేస్తున్న‌ప్పుడు రంగంలో దిగాల్సిన వైసీపీ హ‌డావిడి ప్రెస్ మీట్ల‌తో వాటిని ఖండించ‌డ‌మే త‌ప్ప జ‌గ‌న్ ని గ‌ట్టిగా బ‌ల‌ప‌ర‌చ‌లేక‌పోయింది. మూడు రోజులు త‌ర్వాత బొత్సా లాంటి వాళ్లు జ‌గ‌న్ మాటల్లో త‌ప్పేంటి అని ప్ర‌శ్నించిన త‌ర్వాత టీడీపీ నుంచి స‌మాధానం రాలేదన్న‌ది గ్ర‌హిస్తే మొద‌టి రోజే వైసీపీ యావ‌త్తు జ‌గ‌న్ కామెంట్స్ ని స‌మ‌ర్థిస్తూ బ‌లంగా త‌న వాద‌న వినిపించి ఉంటే ప‌రిస్థితి భిన్నంగా ఉండేది. అంతేగాకుండా ఏదైనా స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి చంద్ర‌బాబు మ‌రో అంశాన్ని తెర‌మీద‌కు తెచ్చే వ్యూహంలో సిద్ధ‌హ‌స్తుడు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా వైసీపీ మాత్రం డిపెన్స్ వ్యూహంతో గంద‌ర‌గోళం నుంచి గ‌ట్టెక్క‌లేక స‌మ‌స్య‌లు కొనితెచ్చుకుంది. ఏమైనా ఇలాంటి అనుభ‌వాల త‌ర్వాత వైసీపీ లో మార్పు వ‌స్తేనే మేలు జ‌రుగుతుంది. లేకుండా రాబోయే రోజుల్లో మీడియా సాయంతో పాల‌క‌ప‌క్షం మ‌రిన్ని రూపాల్లో దాడి చేయ‌డం ఖాయం. ముఖ్యంగా జ‌గ‌న్ వ్య‌క్తిత్వం మీద గురిపెట్టి విమ‌ర్శ‌లు సాగించ‌డం ఖాయం. కాబట్టి గ‌త అనుభ‌వాల‌ను గుర్తించుకోలేక‌పోతే జ‌గ‌న్ సైన్యం ఫ‌లితాన్ని అనుభ‌వించాల్సి వ‌స్తుంది.


Related News

parliament211

టీడీపీకి అవిశ్వాస చిక్కులు

Spread the love5Sharesపార్ల‌మెంట్ లో అవిశ్వాసం రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. హ‌ఠాత్తుగా కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అవిశ్వాసంపై చ‌ర్చ‌, ఓటింగ్Read More

BJP-AP

బీజేపీని వీడాల‌నే త‌హ‌త‌హ‌లో…

Spread the loveగ‌డిచిన ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీ ఊపు చూసి చాలామంది కాషాయ కండువాలు క‌ప్పుకున్నారు. కానీ ఇప్పుడా పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *