Main Menu

జ‌గ‌న్ కి ఇదే అస‌లైన ప‌రీక్ష‌

Spread the love

వైఎస్ జ‌గ‌న్. ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌. అంతేకాదు ఈకాలంలో అంద‌రిక‌న్నా ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉన్న నాయ‌కుడు. ముఖ్యంగా గ‌డిచిన 103 రోజులుగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ఆయ‌న పాద‌యాత్ర సాగిస్తూ ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తున్నారు. మీడియా ప్ర‌చారం విష‌యం ప‌క్క‌న పెట్టినా విశేష ప్ర‌జా స్పంద‌న ల‌భిస్తోంది. ఆయ‌న పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రుస్తోంది. సాధ‌ర‌ణ ప్ర‌జ‌ల‌ను ఆలోచింప చేస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. అయితే జ‌గ‌న్ స‌భ‌ల‌కు వ‌చ్చిన జ‌నాలంద‌రినీ ఓట్లుగా మ‌లుచుకోవ‌డంలో వైసీపీకున్న బ‌ల‌హీన‌త‌లు తమ‌కు మేలు చేస్తాయ‌నే ధృఢ‌విశ్వాసం నేటికీ కొంద‌రిలో ఉంది.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో ఇప్ప‌టికే ఆరు జిల్లాలు పూర్తికావ‌స్తున్నాయి. అయితే ఈ జిల్లాలన్నీ జ‌గ‌న్ కి ప‌ట్టుకొమ్మ‌లు లాంటివి. వైసీపీకి మంచి ప‌ట్టున్న ప్రాంతాలు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో కూడా ఆపార్టీని బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షంగా నిల‌బెట్టాయి. ఒక్క అనంత‌పురం మిన‌హా అన్ని జిల్లాల్లోనూ వైసీపీకే మెజార్టీ స్థానాలు ద‌క్కాయి. సామాజిక స‌మీక‌ర‌ణ‌లు స‌హా అనేక కార‌ణాల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా జగ‌న్ కి తిరుగుండ‌క‌పోవ‌చ్చ‌నే అంచ‌నాలున్నాయి. దాంతో అవ‌న్నీ ఒక ఎత్తు. కానీ ఇప్పుడు మిగిలిన ఏడు జిల్లాల్లో జ‌గ‌న్ యాత్ర ప్రారంభంకావాల్సి ఉంది. ఆ జిల్లాలు మ‌రో వంతు. ఇంకా చెప్పాలంటే జ‌గ‌న్ కి నిజ‌మైన ప‌రీక్ష పెట్టే జిల్లాలు.

ప్ర‌కాశం జిల్లా త‌ర్వాత జ‌గ‌న్ గుంటూరులో కాలిడ‌బోతున్నారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో కొంత గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాలే ఈ జిల్లాలో ద‌క్కాయి. కానీ ఇప్పుడు రాజ‌ధాని జిల్లా కావ‌డం, స‌మీక‌ర‌ణాల్లో మార్పులు రావ‌డంతో గుంటూరులో నిల‌దొక్కుకోవ‌డానికి జ‌గ‌న్ ఏం చేస్తార‌న్న‌ది చూడాలి. పాద‌యాత్ర సంద‌ర్భంగా అనేక కీల‌క నిర్ణ‌యాలు ప్ర‌క‌టిస్తున్నారు. కొంత మంది అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించేశారు. ఈ నేప‌థ్యంలో గుంటూరులో ఏం చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. గుంటూరు ప్ర‌జ‌ల‌ను ఎలా త‌న‌వైపు తిప్పుకుంటార‌న‌న‌ది ఆస‌క్తిగా మారింది. అదే స‌మ‌యంలో కృష్ణా, గోదావ‌రి జిల్లాల్లో జ‌గ‌న్ కి మ‌రింత సంక్లిష్ట స్థితి ఉంది. ఓవైపు ప‌వ‌న్ పుణ్యాన మెజార్టీగా ఉన్న కాపు సామాజిక‌వ‌ర్గం ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందోన‌నే బెంగ క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో పార్టీ పునాదుల విష‌యంలో ప‌లు సందేహాలున్నాయి. పార్టీ నిర్మాణం, నాయ‌క‌త్వ వ్య‌వ‌హారం ఆయా జిల్లాల్లో చాలా పేల‌వంగా ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. దాంతో అలాంటి స్థితిని చ‌క్క‌దిద్దుతూ ముందుకు సాగ‌డంలో ఈ పాద‌యాత్ర ద్వారా ఏమేర‌కు స‌క్సెస్ అవుతార‌న్న‌ది చూడాలి.

దానికి త‌గ్గ‌ట్టుగా జ‌గ‌న్ యాత్ర ప్ర‌ణాళిక‌లో మార్పు అవ‌స‌రం. బ‌ల‌మైన చోట అనుస‌రించిన ప‌ద్ధ‌తినే బ‌ల‌హీనంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అమ‌లుచేయ‌డం శ్రేయ‌స్క‌రం కాదు. కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టుగా త్వ‌ర‌లో యాత్ర సాగించ‌బోతున్న జిల్లాల్లో పార్టీ ని ప‌టిష్టం చేయ‌డానికి త‌గ్గ‌ట్టుగా యాత్ర‌లో అనేక మార్పులు అవ‌స‌రం. నాయ‌క‌త్వంలో స‌మ‌న్వ‌యం పెంచ‌డానికి ప‌లు చ‌ర్య‌లు అవ‌స‌రం. వాట‌న్నింటినీ గ‌మ‌నంలో ఉంచుకుని ముంద‌డుగు వేస్తేనే ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఆశించిన ఫ‌లితం ద‌క్కుతుందని చెప్ప‌వ‌చ్చు. దానికి భిన్నంగా సాగితే మాత్రం యాత్ర ప్ర‌భావం ఏమేర‌కు అన్న‌ది చెప్ప‌డం క‌ష్ట‌మే.


Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *