Main Menu

నిత్య యాత్రికుడి న‌యా చ‌రిత్ర‌

Spread the love

జ‌గ‌న్..ఓ సంచ‌లనం… ఓ చ‌రిత్ర‌… ఓ రికార్డ్.. యువ‌త‌కు ఉత్సాహం…భ‌విత‌కు సంకేతం.. ఉప్పొంగే జ‌న‌ప్ర‌వాహ‌పు కెర‌టం.. న‌వ‌వ‌సంతం కోసం వేచి చూస్తున్న న‌యా స్వ‌రం. అందుకే వ‌ర్త‌మాన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఎవ‌రికీ సాధ్యం కాని స్థాయిలో ఉంటుంది ఆయ‌న వ్య‌వ‌హారం. 14 నెల‌ల సుదీర్ఘ‌కాలం క్రితం ఇడుపుల‌పాయ‌లో ప్రారంభ‌మ‌యిన ప్ర‌జా సంక‌ల్పం ఇచ్ఛాపురం లో విజ‌య సంక‌ల్పంతో ముగిపోయ‌బోతున్న వేళ అంద‌రి దృష్టి ఇప్పుడు అటు మ‌ళ్ళింది.

నిజానికి జ‌గ‌న్ నిత్య యాత్రికుడు. తండ్రి మ‌ర‌ణం త‌ర్వాత ఓదార్పుయాత్ర‌తో రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభిస్తే, తండ్రి బాట‌లోనే ‘ప్ర‌జా ప్ర‌స్థానం’ స్థాయిని మించి పాద‌యాత్ర‌తో అపూర్వ ఘ‌న‌త సాధించారు. జ‌గ‌న్ యాత్రల మీద భిన్నాభిప్రాయాలు ఉండ‌వ‌చ్చు గానీ, సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకుంటూ ఇంత సుదీర్ఘ‌కాలం పాటు అధికారంతో సంబంధం లేకుండా ప్రజ‌ల మ‌ధ్య నిల‌బెట్ట‌డం చిన్న విష‌యం కాదు. ప్ర‌జాద‌ర‌ణ‌లో తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనే అతి పెద్ద క్రౌడ్ ఫుల్ల‌ర్ గా నిల‌వ‌డం సాధార‌ణ అంశం కాదు.

జ‌గన్ ద‌గ్గ‌ర చంద్ర‌బాబు మాదిరి అధికారం లేదు..కేసీఆర్ మాదిరి మాట‌ల‌తో మంత్ర ముగ్దులు చేయ‌లేరు…ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌ర‌హాలో సినీ గ్లామ‌ర్ లేదు. అయినా అన్నింటికీ మించిన తండ్రి ఇమేజ్ ఉంది. సొంతంగా సంపాదించుకున్న పేరుంది. ఆ క్ర‌మంలో అనేక ఆటు పోట్లు, అవాంత‌రాలు అధిగ‌మించాల్సి వ‌చ్చింది. స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో చివ‌ర‌కు జైలులో ఏకంగా 16 నెల‌ల పాటు గ‌డ‌పాల్సి వ‌చ్చింది. అయినా మొక్క‌వోని ధైర్యం ముంద‌డుగు వేసింది. అనుభ‌వ‌లేమితో తొలి ఎన్నిక‌ల్లో తృటిలో ప‌ద‌వీయోగ్యం కోల్పోయినా ప‌ట్టువిడ‌వ‌కుండా సాగింది. అదే ప్ర‌జాసంక‌ల్పంగా మారి, ప్ర‌జ‌ల ముందు పోరాట యోధుడిగా మిగిల్చింది.కోడిక‌త్తితో దాడి జ‌రిగినా ఖంగుతిన‌కుండా క‌దిలిన తీరు జ‌నం మ‌ర‌చిపోలేని ఘ‌ట‌న‌గా మిగులుతుంది.

చుట్టూ ఉన్న‌వాళ్ల‌లో కొంద‌రు చేజారిపోయారు. అయిన‌వాళ్ల‌నుకున్న‌వాళ్లే హ్యండిచ్చారు. అధికారంతో పాటుగా, మీడియాతోనూ యుద్ధం అనివార్యం అయిన వేళ కూడా వెన్ను చూప‌లేదు. త‌న తండ్రిని కూడా స‌హించ‌ని రామోజీరావుతో భేటీని కూడా దాచ‌లేదు. త‌న ప్ర‌తీ అడుగులోనూ ప్ర‌జ‌ల ప‌క్ష‌మే అన్న‌ది మ‌ర‌వ‌లేదు. అందుకే ప‌ట్టున్న రాయ‌ల‌సీమ‌లోనే కాదు, ఆయ‌న పార్టీ పేల‌వంగా ఉంద‌ని నేటికీ భావిస్తున్న ప్రాంతాల్లో కూడా పాద‌యాత్ర‌కు జ‌న‌ప్ర‌వాహం త‌ర‌లివ‌చ్చింది. ఉప్పొంగిన జ‌న‌కెరటాల‌తో రాయ‌ల‌సీమను మించి కోస్తాలో క‌దం తొక్కారు. గోదావ‌రి జిల్లాల్లో గ‌డ‌గ‌డ‌లాడించారు. ఉత్త‌రాంధ్ర‌ని ఊపేశారు. అంతెందుకు ఆఖ‌రికి కుప్పంలో కూడా జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు పాతిక‌వేల మంది త‌ర‌లిరావ‌డం అధికార‌ప‌క్షంలోనే అల‌జ‌డి రేపింది. అక్క‌డా ఇక్క‌డా అని కాకుండా అన్ని చోట్లా అదే రీతిలో సాగిన ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర ముగుస్తున్న వేళ జ‌గ‌న్ అడుగులు ఎటుప‌డ‌తాయ‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.

అనుభ‌వంతో రాటుదేలుతున్న‌ట్టు మాట‌ల్లో చాటుతున్న జ‌గ‌న్, చేత‌ల్లో కూడా అదే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తే చిర‌కాల వాంఛ సిద్ధించేందుకు మార్గం సుగ‌మం అవుతుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌రో యాత్ర‌కు బ‌స్సులో బ‌య‌లుదేరాల‌ని భావిస్తున్న జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహాలు ఏమేర‌కు ఫ‌లితాల‌ను సాధిస్తాయో చూడాలి. సుదీర్ఘ‌కాలం, సుదూరం పాటు పాద‌యాత్ర‌తో మ‌రో చ‌రిత్ర‌కు నాంది ప‌లికిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత ప‌య‌నం త‌డ‌బాటు లేకుండా సాగితే అందలం అంద‌డానికి ఆస్కారం ఏర్ప‌డుతుంది.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *