బాబుకి పరీక్ష పెట్టిన జ‌గ‌న్

jagan-ysrcp-tdp
Spread the love

చంద్ర‌బాబు కి ప‌రీక్షాకాలం ఆరంభ‌మ‌య్యింది. నైతిక‌త మూలాలు ఇప్పుడు ఆయ‌న చిత్త‌శుద్ధికి నిద‌ర్శ‌నంగా మారాయి. ఒక్క శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామా ద్వారా 21 మంది ఫిరాయింపుల విష‌యంలో చంద్ర‌బాబుని ఇర‌కాటంలోకి నెట్ట‌డంలో జ‌గ‌న్ విజ‌యం సాధించారు. ఫిరాయింపుల వ్య‌వ‌హారంలో 21 మంది ఎమ్మెల్యేల‌కు తోడు ఎమ్మెల్సీలు స‌హా అనేక‌మందికి టీడీపీలో కండువాలు క‌ప్పి బాబు ఆహ్వానించారు. కానీ జ‌గ‌న్ మాత్రం త‌న పార్టీలో చేరాలంటే ముందు టీడీపీ ద్వారా సంపాదించిన ప‌ద‌విని రాజీనామా చేయాల‌ని చెప్ప‌డంతో తాను చేస్తున్నాన‌ని బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌క‌టించిన శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి తీరు వైసీపీకి నైతికంగా విజ‌యాన్ని సాధించిపెట్టింది. తెలుగుదేశం పార్టీని ఇబ్బందిల్లోకి నెట్టింది.

రెండేళ్లుగా రాజీనామాలు చేయాలంటూ ప‌ట్టుబ‌డుతూ అటు అసెంబ్లీనూ, ఇటు న్యాయ‌స్థానంలోనూ పోరాడుతున్న వైఎస్ జ‌గ‌న్ త‌న వ్య‌వ‌హార‌శైలిలో మార్పు ఉండ‌ద‌ని నిరూపించుకోవ‌డం ద్వారా చంద్ర‌బాబు కి స‌మ‌స్య‌గా మారారు. శిల్పా చ‌క్రపాణి రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యి ఇంకా వంద‌రోజులు కాలేదు. అయినా ప‌ద‌వీ త్యాగం చేయ‌డం అసాధార‌ణం. త‌మ‌కు ద‌క్కిన ప‌ద‌విని వ‌ద‌ల‌డానికి ఈరోజుల్లో నేత‌లెవ‌రూ అంగీక‌రించ‌రు. అందులోనూ అధికారం నుంచి విప‌క్షంలో చేరుతున్న‌ప్పుడు అస‌లు వ‌దులుకోరు. అదే స‌మ‌యంలో అధికారం కోసం ఎలాంటి గ‌డ్డి క‌ర‌వ‌డానికైనా సిద్ధ‌ప‌డే నేత‌లున్న రోజుల్లో హోరాహోరీ పోరులో గ‌ట్టెక్కిన శిల్పా చాలా సులువుగా రాజీనామా లేఖ స‌మ‌ర్పించ‌డం సంచ‌ల‌నం అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేత‌లు నోరుమెద‌ప‌లేని స్థితిలోకి నెట్టింది. ఇప్ప‌టికే హైకోర్ట్ కూడా నలుగురు పిరాయింపు మంత్రుల‌కు నోటీసులిచ్చింది. అయినా రాజీనామాలు చేయ‌కుండా ప‌ద‌వులు ప‌ట్టుకుని వేలాడుతున్నార‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లోకి పంపించ‌డం ద్వారా శిల్పా ద్వారా జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు.

ఆట మొద‌లయ్యింద‌ని శిల్పా ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ నిజానికి ఆట మొద‌లెట్టింది వైఎస్ జ‌గ‌న్. అందుకే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో తెలుగుదేశం తిప్ప‌లు ప‌డుతోంది. అధికారం చేతుల్లో ఉండి గ‌ట్టెక్క‌డ‌మెలానో తెలియ‌క క‌ల‌వ‌ర‌ప‌డుతోంది. శిల్పా బ్ర‌ద‌ర్స్ చేరిక‌తో చెల‌రేగిపోతున్న వైసీపీకి అడ్డుక‌ట్ట వేయ‌లేమా అన్న ఆందోళ‌న‌తో స‌త‌మ‌తం అవుతోంది. రాజ‌కీయ అనుభ‌వం గురించి ప‌దే ప‌దే చెప్పుకునే చంద్ర‌బాబుకి నిండా ప‌దేళ్ల రాజ‌కీయ జీవితం కూడా లేని జ‌గ‌న్ పెట్టిన ప‌రీక్ష‌తో గుక్క‌తిప్పుకునే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర‌మంతా ఉప ఎన్నిక‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తే ఇక టీడీపీకి గుండె గుబిల్లు మంటుంది. త‌ల‌కుమించిన భారం అవుతుంది. సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందే ప‌రాజ‌యం కోలుకోని దెబ్బ‌కొడుతుంది. అందుకే చంద్ర‌బాబు రాజీనామాలు చేయ‌కుండా ఇన్నాళ్లుగా ఫిరాయింపుల‌ను త‌న వెంట పెట్టుకున్నార‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. కానీ ఇప్పుడు నిప్పు లాంటి బాబుకి నైతిక ప‌రీక్ష పెట్టిన జ‌గ‌న్ వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది. ప్ర‌జ‌లు ఫిరాయింపు నేత‌ల‌ను కూడా నిల‌దీయాల‌ని పిలుపు ఇవ్వ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.. మొత్తంగా జ‌గ‌న్ ఈ వ్య‌వ‌హారం ఓ అడుగు ముందే ఉన్నారు. చంద్ర‌బాబు ఎప్ప‌టికీ చేరువ కాగ‌ల‌ర‌న్న‌ది ఆయ‌న చేతుల్లోనే ఉంది.


Related News

vijayasai

దూకుడు పెంచిన విజ‌య‌సాయిరెడ్డి

Spread the loveవైసీపీ రూటు మారుస్తోంది. గేరు మార్చి ఎదురుదాడికి దిగుతోంది. ముఖ్యంగా ఆపార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఇప్ప‌టికే స్పీడ్Read More

9173_ysrcp-3

వైసీపీకి అది చేటు చేస్తుందా?

Spread the love1Shareఏపీలో ప్ర‌తిప‌క్షం తీరు ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్షం మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌నే ఆధారంగా చేసుకుని ఆపార్టీ సాగుతున్నRead More

 • టాలీవుడ్ లో వైఎస్ జ‌గ‌న్ యాత్ర‌..!
 • బీజేపీకి విశ్వాసం లేదా?
 • మోడీ, జ‌గ‌న్ కి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అత‌డే…!
 • జ‌న‌సేన రూటు ఎటు?
 • టీడీపీ పోస్ట్ మార్ట‌మ్..!
 • జ‌న‌సైనికుల్లో జోష్ నింపిన ప‌వ‌న్!
 • ఫిరాయింపులపై చర్యలుంటాయా?
 • జ‌న‌సేన‌లో పెను మార్పులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *