Main Menu

అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్

Spread the love

ఏపీలో ప్రతిపక్ష నేతకు ఓ అలవాటు ఉంది. చివరి వరకూ ఆయనదే హవాగా కనిపిస్తుంది. ఇంకేముంది ప్రత్యర్థులు బోల్తా పడినట్టేననే భావన కలుగుతుంది. కానీ చివరకు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో వైసీపీ విఫలమవుతూ ఉంటుంది. గతంలో అదే జరిగింది. మళ్లీ అదే జరుగుతుందా అన్న సందేహం కలుుగతోంది. దానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ పట్ల జగన్ వైఖరి గమనిస్తే దానికి సాక్ష్యంగా ఉంది. ఏపీలో తన పార్టీ బలోపేతం కావడానికి ప్రస్తుతం జగన్ కు అనేక అవకాశాలు వస్తున్నాయి. రెండు చేతులా అందిపుచ్చుకుంటే తిరిగులేని స్థానానికి వెళ్లవచ్చు. కానీ టీడీపీ నుంచి వచ్చిన నేతలకు తప్ప బీజేపీ నుంచి వచ్చిన వారికి వైసీపీలో చోటు లేదనే ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగానే జగన్ నిర్ణయాలుండడం గమనిస్తుంటే చేజేతులా ఛాన్సులు మిస్ చేసుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.

ఇప్పటికే కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో జగన్ బద్నాం అయ్యారు. బీజేపీ అధినేత ఫోన్ కాల్ తో కన్నా చేరిక వాయిదా పడింది. బీజేపీలో కీలక నేతగా ఉన్న సీనియర్ రాజకీయ నాయకుడు ఏకంగా ముహూర్తం పెట్టుకున్న తర్వాత వెనకడుగు వేయాల్సిన పరిస్థితికి జగన్ కారకుడయ్యారు. గుంటూరు జిల్లాలో కీలకమైన కాపు సామాజికవర్గం నుంచి కన్నా వచ్చి చేరితో రాజకీయ పరిణామాల్లో అనేక మార్పులు వస్తాయి. అయినా కండువా కప్పడానికి జగన్ వెనకాడడం విస్మయకరంగా మారింది. బీజేపీ చెబితే జగన్ తలొగ్గడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. తద్వారా కన్నాతో ఏకంగా టీడీపీ నేతలు చర్చలు జరపడానికి అవకాశం ఇచ్చినట్టయ్యింది.

అదే సమయంలో రఘురామక్రుష్ణరాజు వ్యవహారం కూడా అందుకు కొనసాగింపుగా కనిపిస్తోంది. గతంలో జగన్ తీరు నచ్చలేదంటూ బీజేపీలో చేరిన, కేవీపీ వియ్యంకుడు మరోసారి వైసీపీలో చేరాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ జగన్ ని కలవడానికి కమలాధిపతులు విధించిన ఆంక్షలు అడ్డువచ్చాయి. దాంతో రఘురామక్రుష్ణం రాజుని చేర్చుకునే అవకాశాన్ని జగన్ కోల్పోయారు. చివరకు ఆయన వెళ్లి చంద్రబాబుతో చేతులు కలిపారు. వచ్చే ఎన్నికల్లో నర్సాపురం నుంచి బలమైన అభ్యర్థిగా సిద్ధమయ్యారు. జగన్ బలహీనతలు మరో కీలక నేతను కోల్పోవడానికి కారణం అయినట్టు కనిపిస్తోంది.

ఈ పరిణామాలు గమనించిన కావూరి, పురందేశ్వరి సహా పలువురు బీజేపీ నేతలు తమ భవిష్యత్ విషయంలో సందిగ్ధంగా ఉన్నారని సమాచారం. అదే సమయంలో బీజేపీ బ్రేకులు వేస్తుంటే జగన్ దానికనుగుణంగా సాగడం అనేకమందిని అనుమానాలకు గురిచేస్తోంది. టీడీపీ విమర్శలకు తగ్గట్టుగా ఉంది. జగన్ కి మద్దతుగా నిలుస్తున్న కొన్ని సామాజికవర్గాల్లో సందేహాలు రేకెత్తిస్తోంది. పెద్ద సమస్యగా మారే ప్రమాదం కనిపిస్తోంది. అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఓవైపు ప్రత్యర్థి చంద్రబాబు కాచుకుని కూర్చుంటే. జగన్ మాత్రం చేజేతులా వాటిని వదులుకుంటున్న తీరు ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసేలా కనిపిస్తోంది.






Related News

చంద్ర‌బాబు ముంద‌స్తు స‌న్నాహాలు

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణ ముంచుకొస్తోంది. అన్ని పార్టీలు స‌న్నాహాల్లో క‌నిపిస్తున్నాయి. తెలంగాణాలో ఏకంగా అసెంబ్లీ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలున్నాయంటూRead More

టీడీపీకి చిక్కులు తప్పవా..?

Spread the loveఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి అవస్థలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *