Main Menu

జగన్ ఇరుక్కుంటున్నట్టే

Spread the love

ఏపీ రాజకీయాల్లో విపక్షానికి ఎటూ పాలుపోని పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు బీజేపీ పెద్దలతో ఢీ కొట్టలేక, మరోవైపు ప్రజల్లో పెరుగుతున్న అసంత్రుప్తిని సొమ్ము చేసుకోలేక సతమతం అవుతోంది. చివరకు బడ్జెట్ తర్వాతి పరిణామాలతో ఆ పార్టీ కొంత వెనుకబడి కనిపిస్తోంది. అటు విపక్షం, ఇటు పాలకపక్షం అన్నట్టుగా టీడీపీ, బీజేపీ వ్యవహరిస్తుంటే ప్రధాన ప్రతిపక్షం మాత్రం తన స్థాయికి తగ్గట్టుగా కదలలేకపోవడం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. చివరకు సీపీఎం వంటి పార్టీలు బంద్ కి పిలుపునిస్తే కాంగ్రెస్ కూడా మద్ధతు ప్రకటించింది. కానీ వైసీపీ మాత్రం ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. అది జగన్ ని కొంత సందిగ్ధ వాతావరణంలోకి నెట్టే పరిస్థితిగా భావిస్తున్నారు.

వాస్తవానికి ఏపీకి అన్యాయం జరుగుతుందనే సెంటిమెంట్ ఇప్పుడు రాజుకుంటోంది. దానికి టీడీపీ తోడ్పడుతోంది. తెలుగు వారి సెంటిమెంట్ ను రెచ్చగొట్టడానికి ఆపార్టీ అనుకూల మీడియా. శ్రేణులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బీజేపీ తీరు కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. దాంతో ఏపీ ప్రజలంతా కేంద్రం తీరు మీద తీవ్రంగా మండిపడుతున్నారు. తద్వారా తన తప్పులు మాసిపోతాయని టీడీపీ ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగానే వ్యవహారం నడుస్తోంది. ఈ సమయంలో వైసీపీ జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉన్నప్పటికీ తాత్సార్యంతో తానే బోనులో నిలబడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంటోంది. పార్లమెంట్ లో ఓ వైపు కాంగ్రెస్, మరోవైపు టీడీపీ ఆందోళనలు చేస్తుంటే వైసీపీ మాత్రం సైలెంట్ గా ఉండిపోవడం చివరకు ఆ పార్టీ శ్రేణులకు కూడా మింగుడుపడడం లేదు. మిత్రపక్షంగా ఉన్నోళ్లే నిరసనలు చేపడితే ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ప్రజల్లోకి వెళ్లలేకపోవడం వైఫల్యంగా భావిస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు బంద్ కి పిలుపునిచ్చాయి. 8వతేదీన ఏపీ బంద్ కి కాంగ్రెస్ కూడా మద్ధతిస్తోంది. కానీ వైసీపీ మాత్రం నేటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అదే సమయంలో జగన్ కూడా జనంలో ఉన్న నేపథ్యంలో బంద్ లో పాల్గొంటారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఏపీకి న్యాయం చేయాలంటూ బంద్ సాగిస్తుంటే ఏపీ ప్రతిపక్ష నేత దానికి దూరంగా ఉండడం సామాన్యుల్లో సందేహాలు పెంచుతుంది. బంద్ జరుగుతుంటే ఆయన పాదయాత్ర చేపట్టడం రాజకీయంగా నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది. తద్వారా టీడీపీ ఆశిస్తున్నట్టు వైసీపీ మరింత ఇరుక్కుంటుంది. అదే సమయంలో ఈపరిస్థితుల్లో బంద్ కి మద్ధతు ప్రకటించడం అంటే కాబోయే తన మిత్రపక్షాన్ని తప్పుబట్టమే అన్నట్టుగా వైసీపీ నేతలు కొందరు భావిస్తున్నారు. దాంతో కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్న చందంగా జగన్ పరిస్థితి తయారయ్యింది. అయితే అన్నింటికీ మించి బీజేపీ కోసం ప్రజల్లో అనవసర అపోహలు పెంచుకునే ఎత్తుగడలు వేస్తే చివరకు జగన్ మరోసారి చేయి కాల్చుకోవాల్సి వస్తుందనడంలో సందేహం లేదు. దాంతో ఇప్పుడు జగన్ ఇరుక్కుపోయినట్టా..లేక టీడీపీ వ్యూహాల నుంచి గట్టెక్కుతారా అన్నది ఆసక్తి గా మారింది.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *