Main Menu

జ‌గ‌న్ కేసుల్లో ఏం జ‌రుగుతోంది..?

jagan
Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో వైఎస్ జ‌గ‌న్ ఓ సంచ‌ల‌నంగానే భావించాలి. చాలామంది మాజీ సీఎం త‌న‌యులు చేయ‌లేని ప‌నిని జ‌గ‌న్ చేశారు. అదే స‌మ‌యంలో త‌న తండ్రి కూడా ఎదురించిన నేత‌ల‌తో ఢీకొట్టారు. రాజ‌కీయంగా దెబ్బ‌కొట్ట‌డానికి కేసుల రూపంలో సీబీఐ, ఈడీ విరుచుకుప‌డినా వెన‌క్కి త‌గ్గ‌లేదు. రాజ‌కీయంగానే ఎదురుకోవాల‌ని ఆయ‌న త‌ల‌చిన‌ప్ప‌టికీ మొన్న‌టి ఎన్నిక‌ల్లో చివ‌రి నిమిషంలో జ‌రిగిన త‌ప్పిదాలు జ‌గ‌న్ ఆశ‌ల‌ను నీరుగార్చేశాయి. అయినా పెద్ద‌గా ఖాత‌రు చేయ‌లేదు. ఓవైపు చంద్ర‌బాబు ప‌దే ప‌దే హ‌స్తిన వెళ్లిన ప్ర‌తీసారి జ‌గ‌న్ కేసుల వ్య‌వ‌హారం గురించి ఆరా తీస్తూ ఒత్తిడి తెస్తున్నా జ‌గ‌న్ చ‌లించ‌లేదు. పైగా ఓ వ‌ర్గం మీడియా దుమ్మెత్తిపోస్తున్నా, దాదాపుగా మ‌ధ్య త‌ర‌గ‌తిలో జ‌గ‌న్ అవినీతి మీద బ‌ల‌మైన ముద్ర‌వేయ‌గలిగినా జ‌గ‌న్ తీరు మార‌లేదు. కానీ అనూహ్యంగా మోడీ పిలుపందుకుని, బేష‌రుతుగా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో బీజేపీకి మ‌ద్ధ‌తివ్వ‌డం, ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాలు చేస్తామ‌న్న మాటను అమ‌లు చేయ‌క‌పోవ‌డం జ‌గ‌న్ జీవితంలో కీల‌క‌మ‌లుపులుగానే భావించాలి.

ఈ నేప‌థ్యంలోనే తాజాగా జ‌గ‌న్ కేసుల్లో ప‌లు కీల‌క మార్పులు క‌నిపిస్తున్నాయి. దాదాపు ఆరేడుళ్లుగా సాగుతున్న అక్ర‌మాస్తుల కేసుల విష‌యంలో ఒక్కొక్క‌టిగా వీగిపోతున్నాయి. జ‌గ‌న్ మీద అభాండాలు, ఆరోప‌ణ‌లు చేసిన వారి వాద‌న‌లు న్యాయ‌స్థానాల ముందు నిల‌వ‌డం లేదు. ముఖ్యంగా జ‌గ‌న్ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని కేసులు వేసింది కూడా కాంగ్రెస్ నేత శంక‌ర్రావు, టీడీపీ నాయ‌కుడు ఎర్ర‌నాయుడు కావ‌డం విశేషం. ఈ రెండు పార్టీల నేత‌లు చేసిన ఆరోప‌ణ‌ల ప్ర‌కారం జ‌గ‌న్ ఆస్తులు ల‌క్ష కోట్లు. కానీ సీబీఐ అభియోగాలు మోపింది 12వేల కోట్లు మాత్ర‌మే. అంటే ఆరోప‌ణ‌ల‌కు అస‌లు లెక్క‌ల‌కు పొంత‌నే లేదు. ఇక చివ‌ర‌కి ఇప్పుడు సీబీఐ చెప్పిన లెక్క‌ల‌కు కూడా కోర్టులో నిల‌బ‌డ‌డం లేదు. వ‌రుస‌గా ప‌లు కేసులు కొట్టివేస్తున్న తీరు గ‌మ‌నిస్తే జ‌గ‌న్ మీద ప‌డిన ముద్ర‌కు ముగింపు ప‌డుతున్న‌ట్టేనా అన్న అభిప్రాయం క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ మీద ఆరోప‌ణ‌ల‌కు ఆధారం ఏపీ ప్ర‌భుత్వం నుంచి క్విడ్ ప్రో కో రూపంలో ప‌లువురు ప్ర‌యోజ‌నాలు పొంద‌డ‌మే. వారంతా జ‌గ‌న్ కంపెనీల్లో వాటాదారులు కావ‌డ‌మే. దానికి ప‌లువురు మంత్రులు, ఐఏఎస్ అధికారులు వంత‌పాడ‌డ‌మే. అలాంటి ఆరోప‌ణ‌ల‌తోనే కొంద‌రు జైలు పాల‌య్యారు. శ్రీల‌క్ష్మి లాంంటి వారు తీవ్రంగా మ‌నోవేధ‌న‌తో అనారోగ్యం పాల‌య్యారు. కానీ ఇప్పుడు తీరా చూస్తే 16 నెల‌ల జైలు జీవితం గ‌డిపిన జ‌గ‌న్ తో పాటు వివిధ ఐఏఎస్ అధికారుల త‌ప్పిదాలు క‌నిపించ‌డం లేద‌ని న్యాయ‌స్థానాలు తీర్పులిస్తున్నాయి. ఇప్ప‌టికే 11 ఛార్జిషీట్ల‌కు గానూ 9 కేసులు కొట్టివేశారు. వ‌రుస‌గా ఐఏఎస్ లు బి.పి ఆచార్య, మహంతి, రత్న ప్రభ, ఆధిత్యనాద్ దాస్, శ్యాం బాబ్ , శ్రీలక్ష్మీ వారికి క్లీన్ చిట్ ద‌క్కింది. వారి త‌ప్పిదం లేద‌ని నిర్థార‌ణ‌కు వ‌చ్చిన కోర్టులో ఆయా అభియోగాల‌ను కొట్టివేస్తున్నారు. దాంతో ఇక మిగిలింది మ‌రో రెండు కేసులు మాత్ర‌మే క‌నిపిస్తున్నాయి.

ఒక‌సారి ఐఏఎస్ ల‌కు క్లీన్ చిట్ ద‌క్కిన త‌ర్వాత ప్ర‌భుత్వంలో భాగ‌స్వామ్యం లేని జ‌గ‌న్ కి రాచ‌మార్గం ఏర్ప‌డిన‌ట్టే. అలాంటి స‌మ‌యంలో ఈ కేసు విష‌యంలో జ‌గ‌న్ కి ఆటంకాలు తొలగిపోయిన‌ట్టే. కాబ‌ట్టి 9 కేసుల‌ను కోర్టులో నిరూపించ‌లేక‌పోయిన సీబీఐ మిగిలిన రెండు కేసుల‌ను నిల‌బెట్టుకోగ‌ల‌దా అనే అనుమానాలు క‌నిపిస్తున్నాయి. అలా జ‌రిగితే ఇక జ‌గ‌న్ మీద ఆరోప‌ణ‌ల‌కు అర్థం ఉండ‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే తాజాగా శాంబాబు కేసు త‌ప్ప మిగిలిన‌వ‌న్నీ మోడీని క‌ల‌వ‌కముందే కోర్టులు తీర్పులిచ్చిన సంగ‌తి గ‌మ‌నార్హం. అసెంబ్లీలోనూ, బ‌యటా నిత్యం జైలుకెళ్లొచ్చిన నేత‌, ల‌క్ష కోట్ల అవినీతి స‌హా వివిధ ఆరోప‌ణ‌ల‌తో హోరెత్తించిన నేత‌ల‌కు ఈ ప‌రిణామాలు మింగుడుప‌డే అవ‌కాశం లేదు. కానీ మారుతున్న రాజ‌కీయాల్లో జ‌గ‌న్ కి అతి పెద్ద ఆటంక‌మైన అవినీతి ఆరోప‌ణ‌ల విష‌యంలో ఆ రెండు కేసుల్లోనూ క్లారిటీ వ‌చ్చేస్తే దాదాపు అన్ని అడ్డంకులు తొల‌గిన‌ట్టే అని భావించాలి. కానీ న్యాయ‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు అంత త్వ‌ర‌గా వీడిపోయే అవ‌కాశం ఉండ‌దు. అయినా మూడొంతులకు పైగా కేసులు తొల‌గిపోవ‌డం జ‌గ‌న్ కి అతిపెద్ద ఊర‌డింపుగానే చెప్పాలి. ఇటీవ‌ల రెట్టించిన ఉత్సాహంతో దాడికి పాల్ప‌డుతున్న జ‌గ‌న్ నైతిక సామ‌ర్థ్యానికి ఈ ప‌రిణామాలే దోహ‌దం చేస్తున్న‌ట్టు అర్థం చేసుకోవాలి. అదే స‌మ‌యంలో ఈ ప‌రిణామాల‌న్నీ చంద్ర‌బాబుకి ఏమాత్రం రుచించే అవ‌కాశం లేదు. అయినా న్యాయ‌స్థానాల నిర్ణ‌యం కాద‌న‌లేరు క‌దా..!


Related News

cbn

కోరి క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్దు బాబూ..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఓ వైపు ఆయ‌న్ని వీరుడూ, శూరుడూ అంటూ ఓ వ‌ర్గం మీడియాRead More

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *