Main Menu

త‌ప్పు స‌రిచేసుకుంటున్న వైఎస్ జ‌గ‌న్!

Spread the love

వైసీపీ అధినేత వ్యూహం మార్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా అధికార పార్టీ దూకుడుకి అనుగుణంగా కొత్త పంథాలో సాగుతున్నారు. చాలాకాలంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ ఇప్పుడు జ‌నంతో మ‌మేకం అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. పాద‌యాత్ర ద్వారా సుదీర్ఘ‌కాలం ప్ర‌జ‌ల్లో ఉన్న జ‌గ‌న్, తాజాగా పార్టీ శ్రేణులు, త‌ట‌స్థుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అంద‌రి స‌ల‌హాలు, అభిప్రాయాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. స‌భ‌ల్లో ర్యాంప్ ద్వారా జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం, జ‌నం రాసిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పే య‌త్నం మంచి నిర్ణ‌యంగా క‌నిపిస్తోంది. త‌ట‌స్థుల పేరుతో నిర్వ‌హిస్తున్న స‌మావేశాల్లో కూడా ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అందుకు అనుగుణంగా బాబు సంక్షేమ మంత్రానికి విరుగుడుగా మ‌రిన్ని తాయిలాలు సిద్ధం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. స‌మ‌ర‌శంఖారావం తొలినాడే పెన్ష‌న్లు పెంచుతున్న‌ట్టు ప్ర‌క‌టించి సంచ‌ల‌నంగా మారారు. వాస్త‌వానికి ఈ విష‌యాన్ని ఈఏడాదిన్న‌ర క్రిత‌మే జ‌గ‌న్ చెప్పారు. త‌న ప్ర‌క‌ట‌న చూసి చంద్ర‌బాబు పెన్ష‌న్లు పెంచితే, దానిని తాను 3వేలు చేస్తాన‌ని పార్టీ ఆవిర్భావ‌దినం సంద‌ర్భంగా ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల‌లోనే ప్ర‌క‌టించారు. ఇక మ‌రోసారి అవ్వ‌లు, తాత‌య్య‌ల‌కు పెంచుతూ పోతానూ అంటూ చెప్ప‌డం ద్వారా ఆస‌క్తిక‌రంగా మారారు.

అదే స‌మ‌యంలో రాజ‌కీయంగా జ‌గ‌న్ న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నారు. ముఖ్యంగా ఏపీలో గ‌డిచిన ఏడాది కాలంగా బీజేపీ గ్రాఫ్ అమాంతంగా ప‌డిపోతూ వ‌స్తోంది. మోడీ ఇమేజ్ దాదాపుగా డ్యామేజ్ అయ్యింది. అమిత్ షా బ‌హిరంగ‌స‌భ‌కు జ‌నాలు లేని ప‌రిస్థితి క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో బీజేపీని, మోడీని ప‌ల్లెత్తుమాట అనుకుండా త‌న‌ను జ‌నం విశ్వ‌సించ‌ర‌నే విష‌యాన్ని జ‌గ‌న్ ఆల‌శ్యంగా గ్ర‌హించిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే త‌న‌ను మోడీ మిత్రుడిగా ముద్ర వేస్తున్న‌ప్ప‌టికీ మౌనంతో అంగీకారం తెలిపిన జ‌గ‌న్ తాజాగా స్వ‌రం మార్చారు. మోడీని, బీజేపీని నేరుగా విమ‌ర్శించారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన స‌హా అంద‌రూ ఏపీకి ద‌గా చేశార‌ని, మోడీ మాట ఇచ్చి మోసం చేశార‌ని మండిప‌డ్డారు.

త‌ద్వారా తాను ఒంట‌రిపోరున‌కు సిద్ధంగా ఉన్న‌ట్టు సంకేతాలు ఇచ్చిన జ‌గ‌న్ త‌న‌పై మోడీ అనుకూల ముద్ర తొల‌గించుకునే య‌త్నంలో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇది రాజ‌కీయంగా జ‌గ‌న్ సానుకూల వ‌ర్గాలు ముఖ్యంగా ఎస్సీలు, మైనార్టీల‌లో పెరుగుతున్న అప‌న‌మ్మ‌కం త‌గ్గించేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. ఏపీలో ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్థితుల్లో మోడీని ఎంత బ‌లంగా విమ‌ర్శిస్తే అంతగా సానుకూల‌త ద‌క్కే అవ‌కాశం ఉంద‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. దానికి కార‌ణాలు వేరుగా ఉండ‌వ‌చ్చు గానీ ఈ విష‌యంలో జ‌గ‌న్ మీన‌మేషాలు లెక్క‌పెడితే మాత్రం మునిగిపోతారు. అందుకు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు హామీల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌ల్లోనూ జాగ్ర‌త్త‌లు పాటించాల్సిన అవ‌స‌రం ఆపార్టీకి కనిపిస్తోంది. ఇన్నాళ్లుగా ఈవిష‌యాన్ని విస్మ‌రించి విమ‌ర్శ‌ల‌కు గుర‌యిన జ‌గ‌న్ ఇక‌నైనా జాగ్ర‌త్త‌లు పాటిస్తే త‌ప్పు స‌రిచేసుకున్న‌ట్టే అవుతుంది.


Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the love8Sharesఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *