Main Menu

వైసీపీ వ్యూహాలు..టీడీపీలో లుక‌లుక‌లు

Spread the love

ఎన్నిక‌ల ముందు రాజ‌కీయాల్లో క‌ప్ప‌దాట్లు చాలా స‌హ‌జం. చాలాకాలంగా చూస్తున్న విష‌యం. టికెట్ రాని నేత‌లు పార్టీ మార‌తార‌న‌డంలో పెద్ద వింత‌, విశేషం లేదు. కానీ ఈసారి అలా కాదు. టీడీపీ టికెట్ ఖాయం చేసుకున్న త‌ర్వాత కూడా కొంద‌రు నేత‌లు జంప్ అవుతున్నారు. తెలుగుదేశం త‌రుపున ప్ర‌చారం ప్రారంభించిన త‌ర్వాత కూడా గోడ దూకేస్తున్నారు. ఇంకొంద‌రి కోసం చంద్ర‌బాబు కండువా ప‌ట్టుకుని సిద్ధంగా ఉన్న స‌మ‌యంలో మొఖం చాటేస్తున్నారు. మ‌రికొంద‌రు చంద్ర‌బాబుని క‌లిసి వ‌చ్చిన త‌ర్వాత లోట‌స్ పాండ్ కి ప్ర‌యాణం క‌డుతున్నారు. ఇలాంటి వింత‌లు విశేషాలు ఈసారి విప‌రీతంగా సాగుతుండ‌డం వెనుక వైసీపీ వ్యూహాత్మ‌క చ‌తుర‌త క‌నిపిస్తోంది. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న నాయ‌కుడిని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది

వాస్త‌వానికి తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నేత‌లు వైసీపీ వైపు చూస్తున్న విష‌యంలో మూడేళ్లుగా ప్ర‌చారంలో ఉంది. అయితే వైసీపీ నుంచి వ‌రుస‌గా ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిన త‌రుణంలో ఈ ప‌రిణామాల‌కు ఆటంకం ఏర్ప‌డింది. వైసీపీ వెనుక‌ప‌ట్టు ప‌ట్టింది. జ‌గ‌న్ తీవ్ర ఒత్తిడి కి లోన‌య్యారు. ఇంటా బ‌య‌టా విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. జ‌గ‌న్ వ్య‌వ‌హార‌శైలి మీద తీవ్ర వ్యాఖ్య‌లు కూడా వినిపించాయి.

అన్నింటినీ అధిగ‌మిస్తూ ఆసాధార‌ణ పాద‌యాత్ర‌తో అనుకున్న‌ది సాధించే దిశ‌లో ఆయ‌న ప‌య‌నం సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించే విష‌యంలో జ‌గ‌న్ చివ‌రి నిమిషంలో గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం ద్వారా ప‌లువురు నేత‌ల‌ను త‌న వైపు తిప్పికుంటున్నారు. ప్ర‌త్య‌ర్థి పార్టీని ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. ఇప్ప‌టికే న‌ర్సాపురం ఎంపీ రేసులో ప్ర‌చారం చేసుకుంటూ మ‌ధ్య‌లో వైసీపీ గూటికి చేరిన క‌నుమూరి రఘురామ‌రాజు వ్య‌వ‌హారం, టీడీపీలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకుని లోట‌స్ పాండ్ లో మ‌ళ్లీ అడుగుపెడుతున్న కొణ‌తాల రామ‌కృష్ణ వంటి వారి వ్య‌వ‌హారం జ‌గ‌న్ ఎత్తుల‌ను చాటుతున్నాయి.

ఈ ప‌రిణామాలే ఇప్పుడు ఏపీలో వైసీపీ ఫ్యాన్ గాలి మ‌రింత పెంచ‌డానికి దోహ‌ద‌ప‌డుతున్నాయి. సామాన్య ప్ర‌జ‌లు, న్యూట్ర‌ల్ జ‌నాల్లో ఈసారి మార్పు రావాల్సిందే అన‌డానికి దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాన‌సిక స్థైర్యాన్నిదెబ్బ‌తీస్తోంది. మోడీ, కేసీఆర్ స‌హా ఎవ‌రిని భూతంలా చూపించ‌డానికి య‌త్నించినా జ‌నం విశ్వ‌సించే అవ‌కాశం క‌నిపించ‌డం లేద‌నే అభిప్రాయం టీడీపీ నేత‌ల్లో వినిపించ‌డం విశేషంగానే చూడాలి. టికెట్ ఖాయం చేసుకున్న కొంద‌రు మంత్రులు కూడా మునిగిపోతామ‌నే భ‌యంతో వైసీపీ నేత‌ల‌కు ట‌చ్ లో వెళ్లేందుకు త‌యారుచేస్తోంది. ఏమ‌యినా ఈ ప‌రిస్థితి ఏపీలో కొత్త త‌ర‌హా రాజ‌కీయాల‌కు కేంద్రంగా మారుతుండ‌గా, అధికార పార్టీ అవ‌స్థ‌లు మ‌రింత పెంచుతున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.


Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *