Main Menu

వైసీపీకి వారిద్దరూ భారమా?

Spread the love

రాజకీయాల్లో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం అత్యుత్తమం అనే నానుడి ఉంది. అందుకే కాలికి పోయే దానిని నెత్తికి తెచ్చుకోవడం అంత తెలివిమాలిన పని మరోటి ఉండదని చెప్పవచ్చు. కానీ వైసీపీ నేతలకు అవి పట్టినట్టుగా లేదు. తమకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటూ కొన్ని అంశాలను తమ నెత్తిన పెట్టుకుంటున్నారు. స్పందించాల్సిన అంశాలలో మాట్లాడకుండా మరింత అనుమానాలు పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సరిగ్గా ఇదే జరుగుతోంది.

దాంతో కేంద్రంలో మోడీ విషయంలోనూ, తెలంగాణాలో కేసీఆర్ పట్ల వైసీపీ శ్రేణుల వైఖరి ప్రజల్లో అపోహలు పెంచుతోంది. టీడీపీ నేతలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం జనాన్ని విశ్వసించేలా మారుస్తోంది. దాంతో బీజేపీ చెప్పినట్టు ఆడుతున్నారన్న జగన్ దానికి తగ్గట్టుగానే తెలంగాణా ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారంటూ ప్రచారం మొదలయ్యింది. తాజాగా కూకట్ పల్లిలో నందమూరి సుహాసినికి వ్యతిరేకంగా వైసీపీ పేరుతో కొన్ని లేఖలు స్రుష్టించారు. టీఆర్ఎస్ కి ఓటేసి నందమూరి సుహాసినిని ఓడించాలని జగన్ పిలుపునిచ్చినట్టుగా ఆయా లేఖల్లో ఉంది. తద్వారా కేసీఆర్ తో జగన్ కుమ్మక్కయ్యారని టీడీపీ, కేసీఆర్ అంటే జగన్ కి భయమని పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆరోపణలకు తగ్గట్టుగా ఈ పరిణామాలున్నాయి.

అదే సమయంలో మోడీ పట్ల ఏపీలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. కీలకమైన మైనార్టీ వర్గాల్లో దేశమంతటా వ్యతిరేకత కనిపిస్తుండగా, ఏపీలో అదనంగా హోదా సెంటిమెంట్ తో మోడీని మరింత చీదరించుకుంటున్నారు. అలాంటి సమయంలో మోడీ పట్ల మౌనం వైసీపీకి తలనొప్పిగా మారుతోంది. ప్రజల్లో అనుమానాలు పెంచి, చివరకు అవి బలపడేలా చేస్తోంది. మొత్తంగా అటు కేసీఆర్, ఇటు మోడీ పట్ల వైసీపీ శ్రేణులు అవలంభిస్తున్న ధోరణి ఆఖరికి ఆపార్టీ కి భారంగా మారుతున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల సోషల్ మీడియాలో పలువురు వైసీపీ కార్యకర్తలు మోడీ తీరుని సమర్థిస్తూ, కేసీఆర్ ని బలపరుస్తూ పోస్టింగ్స్ కూడా ప్రారంభించారు. అవసరం లేకున్నా ఈ విషయాల్లో జోక్యం చేసుకోవడం ద్వారా వైసీపీకి బీజేపీకి ఉన్న బంధాన్ని మరింత బలపరిచేలా ఈ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. దాంతో గత ఎన్నికల్లో జగన్ ని బలపరిచిన కొన్ని వర్గాలు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీతో తమకు సంబంధం లేదని జగన్ ఎన్ని మార్లు చెప్పినా జనం విశ్వసించే అవకాశం లేకుండా ఈ చర్యలు చాటుతున్నాయి. దాంతో మోడీ పట్ల ఏపీలో ఉన్న వ్యతిరేకత, కేసీఆర్ పట్ల కొనసాగుతున్న ఆగ్రహం కలిసి అసలుకే ఎసరు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నది పలువురు పరిశీలకుల అభిప్రాయం.


Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *