గేరు మార్చిన జగన్

jagan
Spread the love

ఏపీలో సాగుతున్న రాజకీయాల్లో వైసీపీ ఓ అడుగు ముందుకేసింది. పాలక కూటమి టీడీపీ, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. అదే సమయంలో జనసేన కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వెనుకబడుతోందనే ప్రచారం సాగుతోంది.ఈ నేపథ్యంలో ఆలశ్యంగా నష్టాన్ని గుర్తించిన జగన్ ఓ అడుగు ముందుకేశారు. రాజీనామాలకు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 6ని డెడ్ లైన్ గా ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం గతంలోనే రాజీనామాలకు సిద్దమని ప్రకటించిన జగన్ ఈసారి బడ్జెట్ సమావేశాలు ముగియగానే రాజీనామాకి సై అనడం చర్చనీయాంశంగా మారింది. గత రెండు వారాలుగా రసవత్తరంగా సాగుతున్న రాజకీయ నాటకంలో ఇప్పుడు జగన్ గేరు మార్చడం విశేషంగా మారింది.

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఏప్రిల్‌ 6వ తేదీన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలచేత రాజీనామా చేయిస్తానని జగన్ తాజాగా ప్రకటించడం రాజకీయంగా సంచలనంగా మారబోతోంది. వచ్చే నెల మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన జగన్, తాజాగా రాజీనామాల గురించి కూడా ప్రస్తావించడం టీడీపీ మీద కొంత ఒత్తిడి పెంచబోతోంది. పాలక టీడీపీకి ఇది ఇరకాటంలో పెట్టే అంశంగానే భావించాలి.

వాస్తవానికి టీడీపీ ప్రత్యేక హోదా విషయాన్నే ప్రస్తావించడంద లేదు. ప్యాకేజీ పేరుతో డీలిమిటేషన్ కోసం ఒత్తిడి చేస్తోందనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైసీసీ నిజంగానే రాజీనామా అస్త్రాలు సందిస్తే తెలుగుదేశాన్ని మరింత ఇరకాటంలో నెడుతుంది. ఏపీ కోసం త్యాగం చేసిన పార్టీగా వైసీపీ కి సానుభూతి పెరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ఢిల్లీలో ధర్నాకి వైసీపీ సిద్ధమవుతుండడం ఆపార్టీ దూకుడు పెంచిన తీరుకి అద్దంపడుతుంది. దీనికి తగ్గట్టుగా టీడీపీ ఎలాంటి వ్యూహరచన చేస్తుందన్నది ఆసక్తిదాయకం.


Related News

tdp mps meeting

టీడీపీలో రాజ్య‌స‌భ లొల్లి…

Spread the loveఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం మూడు సీట్లు ఖాళీRead More

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the loveఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

 • జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..
 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *