వైసీపీ విఫలమవుతోంది..

ysrcp
Spread the love

ఏపీలో ప్రభుత్వ తీరుతో ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. అనేక చోట్ల సామాన్యులు తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. కీలక ప్రాజెక్టులు పడకేయడం, ప్రజా సంక్షేమం గాలికొదిలేయడంతో చంద్రబాబు తీరు మీద సా మాన్యుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మధ్యతరగతిలో మంట రాజుకుంటోంది. రైతాంగం రగిలిపోతోంది. మొత్తంగా ఏపీ పాలకపక్షం తీరు ప్రజలను తీవ్రంగా నిరాశపరుస్తోంది.

అయితే అదే సమయంలో విపక్షం కూడా ప్రభుత్వ వైఫల్యాలను సొమ్ము చేసుకోలేని స్థితిలో ఉండడం విస్మయం కలిగిస్తోంది. మీడియా సహకారం లోకపోవడం కొంత లోటుగానే భావించాల్సి ఉన్నప్పటికీ ప్రజల సమస్యల మీద నిలబడి పోరాడితే సహజంగా సామాన్యుల్లో ఆదరణ లభిస్తుంది. నెల్లూరు ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ నిర్వహించిన ఇళ్ల స్థలాల పోరాటం, మరోఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమాలకు లభిస్తున్న ఆదరణ దానికి నిదర్శనం. అయితే మిగిలిన ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు సమర్థవంతంగా స్పందించలేకపోతున్నారు. స్థానిక సమస్యలే కాకుండా రాష్ట్రమంతా ప్రభావితం చేసే అంశాలను కూడా చేజేతులా వదులుకుంటున్నారు.

ఉదాహరణకు పోలవరం వంటి ప్రధానాంశంలో ప్రతిపక్ష వైసీపీ తీరు పేలవంగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకపోవడం, చివరకు ట్రాన్స్ ట్రాయ్ దివాళా దశలో ఉండడంతో ప్రభుత్వం మీద విపక్షం తీవ్రస్థాయిలో ఉద్యమించాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఓ పర్యటన పేరుతో చేతులు దులుపుకున్నారు. నిత్యం మీడియాలో మాట్లాడితే చాలనుకునే రీతిలో కనిపిస్తోంది. గోదావరి జిల్లా రైతాంగాన్ని కదిలించి ఆందోళన చేపట్టాల్సిన పార్టీ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేకపోయింది. అంతేగాకుండా పురుషోత్తపట్నం వంటి లిఫ్ట్ స్కీముల పేరుతో ప్రభుత్వం నడుపుతున్న ప్రచార మాయను బట్టబయలు చేస్తూ కనీసం ఒక పర్యటన కూడా చేయలేకపోయింది. వాస్తవాలను ప్రజలకు చాటుతూ ముఖ్యమంత్రి ప్రారంభించిన స్కీమ్ నుంచి ఒక్క చుక్క నీరు కూడా రైతులకు చేరలేదనే వాస్తవాన్ని నిరూపించలేకపోయింది.

ఈ పరిణామాలతో చంద్రబాబు పట్ల ఆగ్రహంగా ఉన్న వారిలో కూడా వైసీపీ తీరు మీద విశ్వాసం కలగడం లేదు. కేవలం జగన్ పాదయాత్రతోనే తమకు పదవులు వచ్చేస్తాయనే అభిప్రాయం ఆపార్టీలో పేరుకుపోయింది. రచ్చబండ వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అవి తూతూమంత్రంగానే సాగుతున్నాయి. ఫలితాలు ఇచ్చే దిశలో వైసీపీ పనితీరు కనిపించడం లేదు. దాంతో విపక్షం విఫలమవుతుందనే ప్రచారం ఊపందుకుంటోంది. అదే మరోసారి చంద్రబాబుకి అదనపు బలంగా మారే అవకాశం ఉందనే అంచనాలు కూడా వినిపిస్తున్నాయి.


Related News

1515322707_mahesh-kathi-poonam-kaur-pawan-kalyan

కత్తి కథతో ఇరకాటంలో కాటమరాయుడు

Spread the loveఓ సినిమా క్రిటిక్ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించిన తీరు చివరకు చినికి చినికి గాలివానలా మారింది.Read More

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766

కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి షాకిచ్చిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం పార్టీ షాకిచ్చింది. మోడీకి గట్టి ఝలక్ ఇచ్చింది. దాంతో కమలదళం కుతకుతలాడుతోంది. కాంగ్రెస్ తో చేతులుRead More

 • మళ్లీ పాత నినాదం అందుకుంటున్న టీడీపీ
 • జగన్ జీవితంలో కీలకంగా మారబోతున్న ఏడాది
 • రజనీకాంత్ రాణిస్తాడా?
 • వైసీపీ విఫలమవుతోంది..
 • బాబుకి బ్రేకప్ చెప్పాలనే తపనలో బీజేపీ
 • బాబు ఆశలపై గుజరాత్ ఎఫెక్ట్
 • బాబుపై కేటీఆర్: వెల్ కమ్ కాంబినేషన్
 • బాబుని మారిస్తేనే మోడీ కరుణ!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *