Main Menu

వైసీపీ అభ్య‌ర్థుల తొలి జాబితా ఇదే..

Spread the love

వైఎస్ జ‌గ‌న్ అనూహ్య నిర్ణ‌యం తీసుకున్నారు. ఇడుపులపాయ‌లో అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేస్తార‌ని తొలుత ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అనూహ్యంగా హైద‌రాబాద్ లోనే తొలి జాబితా విడుద‌ల చేశారు. ఈ లిస్టుని వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఆ జాబితా ఇలా ఉంది. విశాఖ పీఠాధిప‌తి స్వ‌రూపానంద ఆదేశాల ప్ర‌కారం మంచి ముహూర్తం కావ‌డంతో ఈ జాబితా విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు

అర‌కు- గొడ్డేటి రాధిక‌
అమ‌లాపురం- చింతా అనురాధ‌
క‌డ‌ప వైఎస్ అవినాష్ రెడ్డి
అనంత‌పురం- రంగ‌య్య‌
బాప‌ట్ల‌- నందిగామ‌సురేష్
క‌ర్నూల్- డాక్ట‌ర్ సంజీవ్ కుమార్
చిత్తూరు- న‌ల్ల‌కొండ‌రెడ్డి రెడ్డ‌ప్ప‌
హిందూపురం- మాధ‌వ్
రాజంపేట – మిదున్ రెడ్డి

అసెంబ్లీకి సంబంధించిన 175 మందితో పాటు మిగిలిన 16 ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థుల జాబితా రేపు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలిపారు. ఈ జాబితాలో కేవ‌లం ఇద్ద‌రు మిన‌హా మిగిలిన వారంతా కొత్త వారే కావ‌డం విశేషం. మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి మాత్ర‌మే గ‌త ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగి సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు.

తాజాగా ప్ర‌క‌టించిన జాబితాలో గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిన నాలుగు సీట్లు ఉన్నాయి. అందులో ఇద్ద‌రికీ ఈసారి కూడా అవ‌కాశం ద‌క్క‌గా అర‌కు, క‌ర్నూలు స్థానాల‌లో కొత్త అభ్య‌ర్థుల‌ను రంగంలో దింపుతున్నారు. ముఖ్యంగా గ‌త ఎన్నిక‌ల్లో క‌ర్నూలు నుంచి గెలిచిన బుట్టా రేణుక కొద్ది నెల‌ల క్రితం వైసీపీని వీడి సైకిలెక్క‌గా, తాజాగా మ‌ళ్లీ జ‌గ‌న్ స‌మ‌క్షంలో కండువా క‌ప్పుకున్నారు. అయినా ఆమె స్థానంలో డాక్ట‌ర్ సంజీవ్ కుమార్ కి ఛాన్స్ ద‌క్కింది ఇక అర‌కు ఎంపీ సీటు నుంచి గెలిచిన కొత్త‌ప‌ల్లి గీత ఫిరాయించ‌గా ఆమె స్థానాంలో కూడా ఈసారి మ‌హిళ‌కు అవ‌కాశం క‌ల్పించారు. ఈసారి మాధ‌వి కి ఛాన్స్ రావ‌డం విశేషం.

మిగిలిన స్థానాల్లో కొత్త నేత‌ల‌ను ఎంపిక చేశారు. అనంత‌పురంలోని రెండు సీట్లు బీసీల‌కు కేటాయించారు. సీఐగా ప‌నిచేసిన గోరంట్ల మాధ‌వ్ కి హిందూపురంలో అవ‌కాశం ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా చెప్ప‌వ‌చ్చు. అంతేగాకుండా బాపట్ల నుంచి నందిగామ సురేష్ కి అవ‌కాశం ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా క‌నిపిస్తోంది. ఏపీ రాజ‌ధానిలో ప‌రిస్థితుల మీద మొద‌టి నుంచి సురేష్ వివిధ రూపాల్లో ఉద్య‌మాలు చేస్తున్నారు. అలాంటి సురేష్ కి ఛాన్స్ ఇవ్వ‌డం ప‌ట్ల ప‌లువురు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

చిత్తూరు నుంచి బ‌రిలో దిగుతున్న రెడ్డ‌ప్ప గ‌తంలో లిడ్ క్యాప్ చైర్మ‌న్ గా ప‌నిచేశారు. క‌ర్నూలు నుంచి సంజీవిని హాస్పిట‌ల్స్ అధినేత‌కు అవ‌కాశం క‌ల్పించారు. సామాజికంగా చూస్తే రెండు సీట్లు రెడ్ల‌కు ద‌క్క‌గా ఒక‌టి ఎస్టీ, మూడు బీసీ, మూడు ఎస్సీల‌కు టికెట్లు కేటాయించారు.


Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *