Main Menu

వైసీపీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌కు ముహూర్తం ఖ‌రారు

Spread the love

వైసీపీ మ‌రో అడుగు ముందుకేస్తోంది. సంక్రాంతి త‌ర్వాత అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న చేయ‌బోతున్న‌ట్టు అధికార పార్టీ ప్ర‌క‌టించ‌గా, అంత‌కుముందే సంక్రాంతి లోగానే అభ్య‌ర్థులను ప్ర‌క‌టించేందుకు విప‌క్ష నేత జ‌గ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అసెంబ్లీ స్థానాల‌తో పాటు మెజార్టీ ఎంపీ సీట్ల‌కు కూడా అభ్య‌ర్థుల పేర్లు ప్ర‌క‌టించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌స్తుంద‌నే అంచ‌నాలున్నాయి. ఇక ఏప్రిల్ నెల‌లో ఎన్నిక‌లు జరుగబోతున్న తరుణంలో తమ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించేందుకు వైసిపి క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చేనెల‌ 9న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని అక్కడే అభ్యర్ధుల తొలి జాబితాను ఆయన వెల్లడించనున్నారని సమాచారం.

ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందుగా అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసి కేసీఆర్ స‌క్సెస్ కొట్టారు. దాంతో ముంద‌స్తు అభ్య‌ర్థుల ఖ‌రారు ప్ర‌క్రియ‌ను అన్ని పార్టీలు ఆశ్ర‌యిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగా జ‌గ‌న్ మ‌రింత ముందుగా లిస్టు ప్ర‌క‌టించ‌డానికి క‌స‌ర‌త్తులు చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగుతుండ‌డం విశేషంగా మారింది. వైసీపీ నేత‌ల్లో ఉత్కంఠ క‌లిగిస్తోంది. ఫ‌స్ట్ లిస్టులో త‌మ పేర్లు చూసుకోవాల‌ని ప‌లువురు ఆశావాహులు ఎదురుచూస్తున్నారు.

తొ లి జాబితాలో 100 నుంచి 150 మంది పేర్లను ప్రకటించే అకాశాలున్నాయ‌ని స‌మాచారం. ఎపిలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్న దృష్ట్యా ఇచ్ఛాపురంలో విడుదల చేసే తొలి జాబితాలో 10 నుంచి 15 మంది ఎంపి అభ్యర్ధులను సైతం ప్రకటించనున్నారని వైసిపి వర్గాలు వెల్లడించాయి. పాదయాత్ర ముగింపు రోజున ఇచ్ఛాపురానికి పార్టీ సీనియర్లతో పాటు అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల కన్వీనర్లనందరినీ రావాలని ఇప్పటికే జగన్‌ ఆదేశించారని సమాచారం. మొదటి జాబితాలో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోగజకవర్గాలన్నింటా వైసిపి అభ్యర్ధులను ఖరారు చేస్తారనే ప్ర‌చారం ఆస‌క్తిగా మారుతోంది.. అలాగే వైసిపి నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లోనూ అభ్యర్ధులను తొలి జాబితాలోనే వెల్లడిస్తారని సమాచారం. దాంతో ఈ విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.






Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *