జ‌గ‌న్, విజ‌య‌సాయి పంచేసుకున్నారు..!

jagan-vijaya-645-06-1486361225-06-1499360204
Spread the love

వాళ్లిద్ద‌రూ చిర‌కాల స‌న్నిహితులు. వైసీపీకి కీల‌క నేత‌లు. ఒక‌రు పార్టీ అధ్య‌క్షుడ‌యితే మ‌రొక‌రు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి. ఒక‌రు అసెంబ్లీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉంటే , రెండోవారు పార్ల‌మెంట్ పెద్ద‌ల స‌భ‌లో పార్టీ ప్ర‌తినిధిగా ఉన్నారు. కానీ పార్టీ వ్య‌వ‌హారాల విష‌యంలో ప‌క్కా ప్రణాళికా బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ప‌ద‌వుల‌తో సంబంధం లేకుండా ప‌నిపంపిణీతో ముందుకెళుతున్నారు. తాజాగా ఏక‌కాలంలో రెండు ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో ఇద్ద‌రూ చెరోవైపు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నిక‌ల బాధ్య‌త‌ను జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అక్క‌డే మ‌కాం వేసి మొత్తం వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుతున్నారు. శిల్పా విజ‌యం కోసం చెమ‌టోడుస్తున్నారు. బ‌హిరంగ‌స‌భ విజ‌యవంతం కావ‌డం, తాజాగా రోడ్ షోకి మంచి స్పంద‌న వ‌స్తుండ‌డంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపిస్తోంది. సామాజికంగానూ క‌లిసొచ్చే త‌ర‌గ‌తులు మెజార్టీగా ఉండ‌డ‌మే కాకుండా, ప్రాంతీయంగా సీమ‌లో బాబు మీద వ్య‌తిరేక‌తే కాకుండా, జ‌గ‌న్ మీద ఉన్న సానుభూతి కూడా తోడ్ప‌తుంద‌ని భావిస్తున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీలో విబేధాలు కూడా వైసీపీకి తోడ్ప‌డే అంశాలుగా ఉన్నాయి. దాంతో నంద్యాల విష‌యంలో వైసీపీ ఆశ‌లు చిగురులు దాలుస్తున్నాయి.

అదే స‌మ‌యంలో కాకినాడ ఎన్నిక‌లు కూడా ముందుకొచ్చాయి. కోర్ట్ నిర్ణ‌యంతో అనివార్యంగా ముందుకొచ్చిన ఎన్నిక‌లు స్థానిక సంస్థ‌కే అయిన‌ప్ప‌టికీ పార్టీ ప్ర‌భావం చూప‌డం అత్య‌వ‌స‌రంగా మారింది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో గోదావ‌రి జిల్లాల్లో చేతులు కాల్చుకున్న త‌ర్వాత జ‌గ‌న్ అక్క‌డ ప‌ట్టుకోసం తీవ్రంగా శ్ర‌మించారు. కీల‌క‌నేత‌లు ప‌లువురిని పార్టీలో చేర్చుకున్నారు. కాకినాడ‌లో కూడా మాజీమంత్రి ముత్తా కుటుంబం, మాజీ ఎమ్మెల్యే క‌న్న‌బాబు వంటి వారు వైసీపీలో చేర‌డం కొంత బ‌లం పెంచింది. దాంతో కాకినాడ ఎన్నిక‌ల్లో పాగా వేయాల‌ని వైసీపీ ఆశిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే జ‌గ‌న్ నంద్యాల‌లో ఊపిరిస‌ల‌ప‌కుండా ఉన్న నేప‌థ్యంలో కాకినాడ బాధ్య‌త‌ల‌ను విజ‌యసాయిరెడ్డి భుజాన వేసుకున్నారు. వ్యూహాలు ర‌చించ‌డంలో ఆరితేరిన ఈ ఆడిట‌ర్ దానికి త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు. ముఖ్యంగా పార్టీలో పెద్ద‌స్థాయిలో క‌నిపించిన కోఆర్డినేట‌ర్ల మ‌ధ్య విబేధాల‌ను చ‌ల్లార్చ‌డంలో విజ‌య‌సాయి స‌క్సెస్ అయిన‌ట్టు చెబుతున్నారు. అది జ‌రిగితే న‌గ‌రంలో వైసీపీ బ‌లం రెట్టింప‌యిన‌ట్టేగానే భావించాల్సి ఉంటుంద‌ని అంటున్నారు. అందుకే దానికి త‌గ్గ‌ట్టుగా చ‌ర్చ‌లు జ‌రిపిన విజ‌య‌సాయి ఇరువ‌ర్గాల‌ను సంతృప్తి ప‌రిచేలా నిర్ణ‌యం తీసుకోవ‌డంతో కాకినాడ వైసీపీలో ఐక్య‌త‌కు బీజాలు ప‌డ్డాయ‌ని చెబుతున్నారు.

దాంతో నంద్యాల‌ను జ‌గ‌న్, కాకినాడ‌ను విజ‌య‌సాయిరెడ్డి వ్యూహాత్మ‌కంగా న‌డిపిస్తుండ‌డం విప‌క్షానికి తోడ్ప‌డుతుంద‌నే అంచ‌నాలున్నాయి. అదే స‌మ‌యంలో టీడీపీలో అధ్య‌క్షుడిగా ఉన్న చంద్ర‌బాబే రెండు ఎన్నిక‌ల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవాల్సి రావ‌డం విశేషం. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న ఆయ‌న వార‌సుడు మంత్రి నారా లోకేష్ ని మాత్రం దాదాపుగా దూరం పెట్టేశారు. దాంతో చంద్రబాబు ఆరోగ్యం అంత‌గా స‌హ‌క‌రించిక‌పోయినా పార్టీ కోసం చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌డం లేదు. వైసీపీ లో ఇద్ద‌రు నేత‌లు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో అడుగులేస్తుండ‌గా, టీడీపీ శిబిరంలో అన్నింటికీ అధినేత‌వైపు చూడాల్సి రావ‌డం క్యాడ‌ర్ స‌మ‌న్వ‌యంలో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. మొత్తంగా ఏపీ వైసీపీకి జ‌గ‌న్ కి త‌గ్గ స‌హ‌చ‌రుడిగా విజ‌య‌సాయి రెడ్డి మారుతుండ‌డం విశేషం. అటు స‌భ‌లోనూ, బ‌య‌టే కాకుండా, ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కూ విజ‌య‌సాయిరెడ్డి నేరుగా ఎన్నిక‌ల స‌మ‌రంలోనూ స్కెచ్ లు వేస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌మే. ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల అనుభ‌వ‌మే లేని విజ‌య‌సాయి నేతృత్వం ప్ర‌స్తుతానికి ఫ‌లితాల‌నిస్తున్న‌ట్టే ఉంది. కానీ చివ‌ర‌కు తుది ప‌లితాలు ఎలా ఉంటాయ‌న్న దానిని బ‌ట్టి ఆయ‌న సార‌ధ్యం మీద క్యాడ‌ర్ లో మ‌రింత విశ్వాసం పెర‌గ‌డ‌మా, త‌గ్గ‌డ‌మా అన్న‌ది ఆధార‌ప‌డి ఉంటుంది.


Related News

Screen-Shot-2018-05-25-at-7.42.41-PM-630x378

గ‌డ్డిక‌రిచిన మీడియా: స్ట్రింగ్ తో బుక్కయిన బడా సంస్థలు

Spread the love16Sharesస‌హజంగా మీడియా సంస్థ‌లు స్ట్రింగ్ ఆప‌రేష‌న్ చేస్తాయి. కానీ తాజాగా జ‌రిగిన స్ట్రింగ్ లో బ‌డా మీడియాRead More

chandrababu naidu - PTI_1

తెగే వరకూ లాగితే చిరిగిపోతుంది బాబూ..!

Spread the loveకొన్ని వ్యవహారాలు అంతే. కక్కాలేక మింగాలేకా అన్నట్టుగా ఉంటాయి. తాజాగా టీటీడీ వివాదం కూడా అంతే. చంద్రబాబుRead More

 • బీజేపీకి ఒక నీతి, టీడీపీ, వైసీపీ మరో రీతి..
 • బీజేపీ చారిత్రక తప్పిదం…!
 • చంద్రబాబు వెనకడుగు
 • బాబుకి మంట పెడుతున్న బీజేపీ
 • చంద్రబాబుకి శిక్ష తప్పదా..?
 • అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్
 • అయోమయమా..అవగాహనా లోపమా?
 • చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *