Main Menu

బాబుని మారిస్తేనే మోడీ కరుణ!

Spread the love

ప్రధానమంత్రి మోడీ తీరు చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన తన ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు. చివరకు ఎన్నికల రోజు పార్టీ జెండాలతో రోడ్ షో నిర్వహించడం కూడా ఆయనకే సాధ్యం. ఓ వైపు పోలింగ్ జరుగుతుంటే మరోవైపు రోడ్డు మీద ప్రధానమంత్రి స్థాయి నేత ప్రదర్శనలు చేయడం విడ్డూరమే అయినప్పటికీ ఎన్నికల కమిషన్ ని కూడా ఖాతరు చేయని ఆయన తత్వం బోధపడుతుంది. అలాంటి మోడీ తో ఇప్పుడు చంద్రబాబుకి బాగా చెడిపోయింది. చివరకు మొఖం చూపించడానికి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడానికి అంగీకరించని స్థాయిలో సాగుతోంది.

ఏపీ సీఎం చంద్రబాబుకి అడిగినా అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది వాస్తవానికి మోడీ, చంద్రబాబు కలిసి మూడున్నరేళ్ల క్రితం ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంది. టీడీపీ నేతలు మోడీ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు. కానీ మోడీ మాత్రం చంద్రబాబుని సహిస్తున్నట్టు కనిపించడం లేదు. గతంలో గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో సీఎం మోడీ మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో పీఎం మోడీ కక్ష తీర్చుకుంటున్నారనే వారు కూడా లేకపోలేదు. కానీ ఇటీవల ఏపీలో మోడీ ప్రభుత్వం ఇస్తున్న నిధులను చంద్రబాబు ఘనతగా ప్రచారం చేసుకోవడం మోడీకి మంట పుట్టించిందనే వాదన బలంగా ఉంది.

ప్రచారం విషయంలో చంద్రబాబుతో మోడీ ఏమాత్రం తీసిపోరు. ఇద్దరూ ప్రచారం ఆధారంగానే కాలం గడిపేసే నేతలు.అ లాంటి ఇద్దరూ పోటాపోటీ ప్రచారం కారణంగానే చివరకు చంద్రబాబుకి పెద్ద తలనొప్పిగా మారిందనే వాదన వినిపిస్తోంది. చివరకు అదే ఏపీకి తలనొప్పిగా మారిందనే వారు కూడా లేకపోలేదు. ఉదాహరణకు చంద్రన్న బీమా విషయంలో కేంద్రం ఇస్తున్న నిధులతో చంద్రబాబు పేరు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం మోడీకి తీవ్ర ఆగ్రహం కలిగించినట్టు సమాచారం. ఆ విషయం తెలుసుకుని మోడీ ఫోటో కూడా కలిపి ఇప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అంటున్నారు.

ఎన్డీయే హయంలో చక్రం తిప్పినానని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు హస్తిన వెళ్లి రాజ్ నాధ్ ని, అరుణ్ జైట్లీని, తాజాగా గడ్కరీని కలిసి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానమంత్రి తో తన గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా బాబుకి లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు, మోడీ మధ్య వైరం ఏ స్థాయిలో ఉన్నప్పుడు ఇక ఏపీలో అభివ్రుద్ధి అందని ద్రాక్షేనని అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం మోడీ సహకరించరు కాబట్టి, ఏపీకి కేంద్రం సహకారం అందించాలంటే సీఎంగా చంద్రబాబు విషయంలో ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సిందేనని ఢిల్లీలోని కొందరు వ్యాఖ్యానించే పరిస్థితి వచ్చేసింది. హస్తినలో మోడీ సర్కార్ ని ఏపీ ప్రజలు ఏమీ చేయలేరు కాబట్టి, ఏపీలో చంద్రబాబు ని మార్చుకుంటేనే ఉపయోగం అంటూ ప్రముఖ విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించిన తీరు విశేషంగా మారుతోంది.


Related News

రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..!

Spread the loveవంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం ఆసక్తిగా మారుతోంది. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుRead More

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *