చంద్ర‌బాబుపై సంచ‌ల‌నాస్త్రం

Vijay-Sai-Reddy-Controversi
Spread the love

వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశాన్ని ముంచేసిన వ్య‌క్తితో చంద్రబాబుకి చెలిమి ఉంద‌ని ఆరోపించారు. ఏకంగా బ్యాంకుల‌కు ఎగ‌నామం పెట్టిన విజ‌య్ మాల్యా నుంచి భారీగా చందాలు వ‌సూలు చేశార‌ని ఆరోపించారు. లండ‌న్ లో విజ‌య్ మాల్యాని క‌లిసి ముడుపులు తీసుకున్న చంద్ర‌బాబు అంటూ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం అవుతున్నాయి. గ‌డిచిన 2016 మార్చి నెల‌లో లండ‌న్ లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా విజ‌య్ మాల్యా నుంచి 150 కోట్లు ముడుపులు చంద్ర‌బాబు అందుకున్నార‌ని విజ‌యసాయి వాదిస్తున్నారు. దేశంలో ప్ర‌జ‌ల సంప‌దకు ఎగ‌నామం పెట్టేసి, ప‌లు కేసుల్లో ఇరుక్కున్న వ్య‌క్తి నుంచి చంద్ర‌బాబు చందాలు తీసుకున్నార‌నే వాద‌న తీవ్రంగా క‌ల‌క‌లం రేపుతోంది.

అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుపై ప్రివిలైజ్ నోటీసు కూడా ఇవ్వ‌డం మ‌రో విశేషం. ఏకంగా ఓ ముఖ్య‌మంత్రిపై రాజ్య‌స‌భ‌లో ప్రివిలైజ్ నోటీసు ఇవ్వ‌డం ఇదే తొలిసారి. అది కూడా చంద్ర‌బాబు మీద నోటీసుని వెంక‌య్య‌నాయుడికి ఇవ్వ‌డం మ‌రో సంచ‌ల‌నం. ఈ విష‌యంలో వెంక‌య్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. గ‌త‌వారం స‌భ‌లో ప్ర‌ధాని కాళ్ల‌కు వంగి న‌మ‌స్క‌రించారంటూ చంద్ర‌బాబు ఆరోపించారు. దానిమీద ఫుటేజీ విడుద‌ల కోరుతో విజ‌య‌సాయిరెడ్డి లేఖ రాశారు. తాజాగా అదే వ్య‌వ‌హారంలో ప్రివిలైజ్ నోటీసు సిద్ధం చేయ‌డం రాజకీయంగా ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది.

అది కూడా చంద్ర‌బాబు ఢిల్లీలో అడుగుపెడుతున్న త‌రుణంలో ఓ వైపు విజ‌య‌మాల్యా నుంచి ముడుపులు, మ‌రోవైపు ప్రివిలైజ్ నోటీసుల‌తో విజ‌యసాయి రెడ్డి బాంబు పేల్చార‌నే చెప్ప‌వ‌చ్చు. ఈ ప‌రిణామాలు చంద్ర‌బాబుని ఇర‌కాటంలోకి నెడ‌తాయా..లేక ఎదురుదాడితో గ‌ట్టెక్కుతారా అన్న‌ది చూడాలి.


Related News

cbn

చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?

Spread the love2Sharesఅనుమానం వ‌స్తోంది. ఆయ‌న వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీసీఎంRead More

Pawan-kalyan-targets-Tv-channales

ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?

Spread the loveఆస‌క్తిక‌ర వార్ మొద‌ల‌య్యింది. అయితే ఈసారి ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కులు కాకుండా ఓ వైపు, మ‌రోవైపు జ‌న‌సేనానిRead More

 • రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం
 • వైసీపీది వాపా?..బ‌ల‌మా??
 • ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!
 • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
 • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
 • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
 • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
 • పవన్ కి పరిష్కారం అతడే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *