Main Menu

సుంద‌ర‌య్య వార‌సుడికి ‘జ‌న‌’ హార‌తులు

Spread the love

ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు ప్రధాన పార్టీలు ముఖాముఖి తలపడటం ఆన‌వాయితీ. కానీ జనసేన ,సిపిఎం,సిపిఐ,బీఎస్పీ,కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండ‌డంతో సీన్ మారిపోయింది. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా ఉంది నియోజకవర్గాన్ని సిపిఎం కు కేటాయించారు.ఉండిలో బలమైన “జనసైన్యం” ఉన్నది.వామపక్షాలకు నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాల్లో జరిగిన ప్రజా పోరాటాల ఫలితంగా బలమైన పునాదే ఉన్నది.

ఒక్కసారిగా ఉండి రాజకీయాలు త్రిముఖ పోరుని త‌ల‌పిస్తున్నాయి. ఇప్పటివరకు టీడీపీ,వైసీపీలు ఎవరో ఒకరు గెలుస్తారని అంచనా ఉండేది. జనసేన,వామపక్షాలు,బీఎస్పీ కూటమి తో ఈ ప‌రిణామాలు త‌ల‌కిందుల‌య్యాయి. అయితే “నువ్వు లేదంటే నేనే” అనే పరిస్థితులు మారిపోయాయు . కూటమి అభ్య‌ర్థిగా “నిజాయతి పరుడు గా గుర్తింపు ఉన్న‌ ప్రజా ఉద్య‌మాల నేత‌, మోగల్లు గ్రామానికి చెందిన బి.బలరాం ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బ‌రిలో దిగారు.

ఉండి తాజా మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు ప్రస్తుతం నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీచేస్తున్నారు.దీనితో క్రొత్త అభ్యర్థిని టీడీపీ రంగం లోకి దించింది .శివరామరాజు సమీప బంధువు అయినా కలవపూడి చెందిన మంతెన రామరాజు అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.నియోజకవర్గ ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తి కావటం మైనస్ పాయింట్ గా ఉన్నది.వైసీపీ తరపున యండగండి సొసైటీ బ్యాంకు అధ్యక్షుడిగా ఉన్న పీవీఎల్ నరసింహ రాజు పోటీచేస్తున్నారు .ఎన్నికల సందర్భంలో తప్ప పెద్దగా ప్రజల్లో తిరిగిన చరిత్ర ఈ నాయకుడికి లేదు.సహజంగా వైసీపీ,టీడీపీ కి ఉండే అనుచరగణం మాత్రమే వీరిరువురి బలం తప్ప వ్యక్తిగతంగా ప్రజా సంభందాలు కొనసాగించే లక్షణం లేని వ్యక్తులను ఆ రెండు పార్టీలు రంగంలోకి దింపాయి.

టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థిత్వాలు ఖ‌రారు కావ‌డానికి స‌మ‌యంలో తీసుకోగా, ఫిబ్ర‌వ‌రి నాటికే .కూటమి తరపున పోటీ చేస్తున్న బలరాం ప్ర‌చారం ప్రారంభించారు. మంచి వ్య‌క్తిగా బ‌లరాంకు ప్ర‌జ‌ల్లో ఉన్న ముద్ర‌తో సీట్ల సర్దుబాటులో జనసేన కు ఉండిలో పోటీ చేసే అవకాశం లేకపోయినా జనసేన కేడర్ ఏమాత్రం నిరుత్సాహం పడలేదు. సరికదా మరింత ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటూ బలరాం గెలుపును తమ భుజాలపై వేసుకుని పనిచేస్తుండటం విశేషం అని చెప్పవచ్చు . బ‌లరాం గత 42ఏళ్లుగా విద్యార్థి నాయకుడిగా,యువజన ,వ్యవసాయ,కార్మిక ,ఉద్యోగ,సామాజిక సంఘాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ నిస్వార్ధ పరుడుగా సమాజంలో గుర్తింపు పొంది ఉన్నారు.సిపిఎం వ్యవస్థాపకుల్లో అగ్రగణ్యుడు అయిన పుచ్చలపల్లి సుందరయ్య స్పూర్తితో పనిచేస్తూ ఆయన వారసత్వాన్ని ఈరోజుల్లో కూడా కొనసాగిస్తుండటం ఆశ్చర్యం కలిగించక మానదు.

బలరాం తన వ్యక్తిగత జీవితాన్ని సైతం సమాజ సేవకోసమే త్యాగం చేశారనే చెప్పాలి. పిల్లను సైతం వద్దనుకుని సమాజమే తన పెద్దకుటుంబం అనుకోని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. పెళ్ళికి ముందుగానే బలరాం ఈనిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తిని సైతం సగభాగాన్ని ఉద్యమ పార్టీకి విరాళంగా అందించటం ద్వారా తాను సమాజంలో ప్రజల శ్రేయస్సుకోసం పరితపిస్తారో అర్ధం చేసుకోవచ్చు, సాధారణ జీవితం గడపటం, కలుపుగోలుతనం వంటి అంశాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి ఇటువంటి ప్రత్యేక నేపథ్యం వున్నా వ్యక్తి కావడంతో కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జనసేన సైన్యం మ‌రింత బాధ్య‌త‌గా కృషి చేస్తోంది. గ్రామగ్రామాన ఇంటింటికి వెళ్ళి బలరాం వ్యక్తిత్వం ఆదర్శం కోసం వివరిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. అభ్యర్థి బలరాం సైతం ప్రణాళికా బద్దంగా నియోజకవర్గంలో అన్ని గ్రామాలను సందర్శిస్తూ ముందుకుసాగుతున్నారు. బలరాం కోసం తెలుసుకున్న మహిళలు, పెద్దలు, యువతీ యువకులు ఎదురెళ్లి స్వాగతం పలుకుతున్నారు

ఉండి రాజకీయాలలో పెనుమార్పు కనిపిస్తుంది. ప్రజలముందు ప్రత్యామ్నాయం కనిపించటంతో ప్రధాన పార్టీలకు భయం పట్టుకున్నది జనసేనకు వున్నబలమైన పునాది, సిపిఎం ప్రజా ఉద్యమాల బలం తోడు కావడంతో విజయంవైపు శరవేగంగా దూసుకుపోతున్నారు. జనసైనికులు స్వచ్చందంగా బలరాం ప్రచారంలో పాల్గొంటూ బలరాం గెలిస్తే తాము గెలిచినట్లేనని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సైతం బలరాంను గెలిపించాలని ప్రచారానికి రానుండటంతో విజయం నల్లేరుపై నడకేనని అనిపిస్తుంది. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో రాము సూర్యారావు, ఇళ్ళ వెంకటేశ్వరరావు వంటి సామాన్యులు, ఉపాధ్యాయ నేతలకు పట్టంకట్టిన తీరుగానే ఉండిలో బలరాంను గెలిపిస్తారాని ప్రజలు చర్చించుకుంటున్నారు.


Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *