Main Menu

కారు పార్టీలో క‌ల‌వ‌రం రేపుతున్న స‌ర్వే

Spread the love

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆస‌క్తిగా మారాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై వాటి ప్ర‌భావం ఉంటుంద‌ని తేల‌డంతో అంద‌రి దృష్టి తెలంగాణా వైపు మ‌ళ్లింది. అదే స‌మ‌యంలో స‌ర్వేల వైపు అంద‌రి చూపు మ‌ళ్లింది. ఇప్ప‌టికే జాతీయ సంస్థ‌ల స‌ర్వేల ప్ర‌కారం అటు టీఆర్ఎస్, ఇటు మ‌హా కూట‌మికి స‌మాన‌వ‌కాశాలు క‌నిపిస్తుండ‌డం మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇక తాజాగా ఆంధ్రా ఆక్టోప‌స్ గా భావించే మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తాజాగా వెల్ల‌డించిన స‌ర్వే మ‌రింత సంచ‌ల‌నంగా మారింది. ఈ సారి ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ల‌కు విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని తేలిన‌ట్టు లగ‌డ‌పాటి స్ప‌ష్టం చేశారు. దాంతో అధికార పార్టీ మీద తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. ఏకంగా 8 నుంచి 10 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని లగడపాటి జోస్యం చెప్పడం విశేషం. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో శివకుమార్ రెడ్డి గెలుస్తారని, ఆదిలాబాద్ జిల్లా బోధ్‌లో అనిల్ జాదవ్ గెలుస్తారని లగడపాటి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ రెండు సీట్ల‌లోనూ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను బ‌రిలో దింపింది. అయిన‌ప్ప‌టికీ రెండు స్థానాలు కోల్పుతున్న‌ట్టు ల‌గ‌డ‌పాటి జోస్యం చెప్ప‌డం ఆస‌క్తిగా మారింది. అంతేగాకుండా తెలంగాణ ప్రజలు ప్రలోభాలకు తలొగ్గడం లేదని, ఈ సారి ఎన్నికల్లో ప్రజలు అధిక మంది రెబెల్స్‌కు పట్టం కట్టడం విశేష‌మ‌ని మాజీ ఎంపీ లగడపాటి వ్యాఖ్యానించారు.

ల‌గ‌డ‌పాటి స‌ర్వేతో పాటు గోనే ప్ర‌కాశ‌రావు వంటి సీనియ‌ర్ నేత‌లు కూడా టీఆర్ఎస్ కి గ‌డ్డు ప‌రిస్థితి ఉంద‌ని తేల్చేశారు. క‌నీసం 40 స్థానాల‌కు కూడా కేసీఆర్ పార్టీ చేరుకోద‌ని జోస్యం చెప్పారు. ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ తాను ప్ర‌స్తుతం మంచిర్యాల‌లో ఉన్నానంటూ చెప్పిన గోనె ప్ర‌కాశ రావు ప‌రిస్థితి ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను చాటుతోంద‌ని తేల్చేశారు. మ‌రో కీల‌క స‌ర్వే బృందం స‌మాచారం కూడా అదే చాటుతోంది. దాంతో కేసీఆర్ అండ్ కో తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని తేలుతోంది. ఈ ప‌రిణామాలు ఇప్పుడు కారు పార్టీ శిబిరంలో క‌ల‌క‌లం రేపుతున్నాయి.






Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *