Main Menu

ముద్రగడకి పరీక్షగా మారిన కాకినాడ

mudragada-and-wife
Spread the love

నంద్యాల ఎన్నికలు ముగిశాయి. కౌంటింగ్ కి కౌంట్ డౌన్ స్టార్టయ్యింది. అంచనాలు, జోస్యాలకు తోడు బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. అదే సమయంలో ఇప్పుడు అందరి ద్రుష్టి కాకినాడ వైపు మళ్లింది. రాయలసీమ ఓటర్ల మనోగతం నంద్యాల వెల్లడిస్తే, కీలకమైన కోస్తా ప్రజల అభిప్రాయం కాకినాడలో బయటపడుతుందని భావిస్తున్నారు. అందులోనూ గోదావరి జిల్లాల్లో జరుగుుతన్న ఎన్నికలు కావడంతో స్థానిక ఎన్నికలే అయినప్పటికీ అందరిలో ఆసక్తిని రాజేస్తున్నాయి. అయితే ఇప్పుడు కాకినాడ ఎన్నికలు అందరికన్నా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాబానికి కీలకంగా మారాయి. కాపులు కీలకంగా ఉన్న ప్రాంతంలో, అందులోనూ ఒకనాడు ముద్రగడ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇప్పుడు ముద్రగడ పాత్ర కీలకంగా మారింది.

వాస్తవానికి కాపుల రిజర్వేషన్ల అంశంలో చంద్రబాబు హామీ అమలుకోరుతూ ముద్రగడ ఉద్యమం సాగిస్తున్నారు. మూడేళ్లుగా ఆయన విశ్రమించక ఉద్యమిస్తున్నారు. ఆయన ఉద్యమం ఫలితంగానే చంద్రబాబు కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేయాల్సి వచ్చిందనడంలో సందేహం లేదు. కాపులకు వెయ్యి కోట్ల నిధుల విడుదల కూడా దానికి కొనసాగింపే. అయితే రిజర్వేషన్ల అంశంలో నియమించిన మంజునాథ కమిషన్ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కప్పదాటు వైఖరితో ఉంది. దాంతో ఇటీవల ముద్రగడ పాదయాత్రకు సన్నద్ధమయ్యారు. అమరావతికి నిరవధిక పాదయాత్రకు సన్నాహాలు చేసుకున్న ముద్రగడను గడిచిన నెలరోజులుగా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకుంటూనే ఉంది. భారీగా పోలీసులను మోహరించి ఆయన ఇంటి గేటు దాటి బయటకురాకుండా నిలువరిస్తోంది. అయినా ముద్రగడ విశ్రమించడం లేదు. నిత్యం తన ప్రయత్నం సాగిస్తూనే ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడలో కాపులతో నిర్వహించిన సభలో చంద్రబాబు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ రిజర్వేషన్లు లేకుండా కేవలం విద్య, ఉపాధి రంగంల్లో రిజర్వేషన్లు అమలుచేయబోతున్నారన్న సంకేతాలిచ్చారు. అయినా ఆ విషయంలో కూడా స్పష్టత రాలేదు. దాంతో కాపుల్లో టీడీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన కాకినాడ ఎన్నికల్లో కాపులు టీడీపీ ప్రత్యర్థులకు ఓటేసే అవకాశాలున్నాయని అంచనా. అదే ఇప్పుడు ముద్రగడ భవిష్యత్తుని నిర్ణయించబోతోంది. కాపుల ఓట్ల మూలంగా టీడీపీ ఓటమి పాలయితే ముద్రగడ ప్రాధాన్యం పెరుగుతుంది. ఆయన ఉద్యమానికి బలం చేకూరుతుంది. చంద్రబాబు కూడా కాపు రిజర్వేషన్ల అంశంలో మరింత తొందరపడాల్సి వస్తుంది.

దానికి భిన్నంగా కాకినాడలో టీడీపీ విజయం సాధిస్తే కాపుల అంశం మరింత నాన్చుడు ఖాయమని చెప్పవచ్చు. రిజర్వేషన్ల అంశంలో తేల్చకపోయినా కాపులు తమవైపే ఉన్నారన్న ధీమా పాలకపార్టీలో వస్తుందన్న చర్చ సాగుతోంది. అందుకే ఇప్పుడు ముద్రగడ అనుచరులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాపుల ఉద్యమం విజయవంతం కావాలంటే చంద్రబాబుకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని ముద్రగడ కీలక అనుచరులు ప్రచారం చేస్తున్నారు. కాకినాడ ఫలితాలు చంద్రబాబుకి అనుకూలంగా వస్తే కాపులను మరింత అణచివేయడం ఖాయమని అనుమానిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల ఫలితాలు కాపుల భవిష్యత్తును నిర్థేశించే అవకాశం ఉన్నందున ముద్రగడ ప్రభావం ఏమేరకన్న చర్చ కూడా మొదలయ్యింది. టీడీపీ కూడా కాపు నేతలను పక్కన పెట్టి ప్రత్తిపాటి పుల్లారావు కి కాకినాడ ఎన్నికల బాధ్యత అప్పగించడం కూడా ఆసక్తిదాయకమే

ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబ సభ్యులందరినీ అవమానించడం, కాపుల మీద పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం వంటి చర్యలకు దిగిన చంద్రబాబుకి బుద్ధి చెప్పడం ఖాయమని కాపు జేఏసీ ప్రతినిధులు చెబుతున్నారు. దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకున్నామంటున్నారు. మరి కాపులు ఆశించినట్టు జరుగుతుందా..లేక బాబు వ్యూహాలు ఫలిస్తాయా చూడాలి.


Related News

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the love13Sharesఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

narendra-modi-chandrababu-ys-jagan-pawan-kalyan-671-1521125657

మోడీతో మేలు ఎవ‌రికి? కీడు ఎవ‌రికి?

Spread the love6Sharesఅనూహ్య నిర్ణ‌యాల‌కు పెట్టింది పేరు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఆఖ‌రికి దేశాన్నంతా అతలాకుత‌లం చేసేని నోట్ల ర‌ద్దుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *