Main Menu

ఫిరాయింపులపై చర్యలుంటాయా?

Spread the love

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఫిరాయింపుల మీద చర్యలుంటాయా అన్న సందేహం సర్వత్రా వినిపిస్తోంది. రెండేళ్లుగా సాగుతున్న వ్యవహారం ముగింపు పలికినట్టేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. వరుసగా అసెంబ్లీ సమావేశాలను విపక్షం బహిష్కరించడానికి మూలకారణమయిన ఫిరాయింపుల విషయంలో న్యాయస్థానం పట్టుదల పనిచేస్తుందా అన్న వాదన వినిపిస్తోంది.

అయితే ప్రస్తుతం కోర్ట్ కేవలం నోటీసులు జారీచేయడంతో 22మంది రెండు వారాల్లోగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. వాస్తవానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి 67మంది గెలిచారు. కానీ ఆ తర్వాత ఒక్కొక్కరుగా టీడీపీ తీర్థం పుచ్చుకుని ఫిరాయింపులుగా మారడంతో ప్రస్తుతం 44మంది మాత్రమే వైసీపీలో మిగిలారు. మిగిలిన 23 మంది ఫిరాయింపుల జాబితాలో ఉన్నారు. వారిలో నలుగురు ఏకంగా మంత్రి పదవులు కూడా అనుభవిస్తున్నారు. ఫిరాయించిన వారిలో భూమా నాగిరెడ్డి మరణంతో ప్రస్తుతం 22మంది మాత్రం ఫిరాయింపులుగా ఉన్నారు. వారందరికీ తాజాగా హైకోర్ట్ నోటీసులు జారీచేయడం చర్చకు కారణంగా ఉంది.

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ అటు తెలంగాణాలోనూ, ఇటు ఏపీలోనూ పాలకపక్షాలు ఫిరాయింపులకు అండగా నిలుస్తున్నాయి. దాంతో స్పీకర్లు సైలెంట్ అయిపోయారు. కానీ వైసీపీ మాత్రం వివిధ రూపాల్లో ఫిరాయింపుల మీద ఉద్యమం సాగిస్తోంది. అటు న్యాయపోరాటం, ఇటు అసెంబ్లీని బహిష్కరించడం ద్వారా చట్ట సభల్లో పోరాటం సాగిస్తోంది. అయితే చివరకు ఇప్పుడు కోర్ట్ కదలిక తీసుకురావడంతో టీడీపీ నాయకత్వం ఉలిక్కిపడింది. అసలే పరిస్థితులు సానుకూలంగా లేని సమయంలో ఫిరాయింపులు కొత్త తలనొప్పిగా మారినట్టు భావిస్తున్నారు. టీడీపీని మరిన్ని చిక్కుల్లో నెట్టే అంశంగా అంచనా వేస్తున్నారు.

అయితే కోర్ట్ ఆదేశాల తర్వాతైనా స్పీకర్ అందిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కానీ స్పీకర్ చర్యలు తీసుకుంటారనే దానిపై పలువురు పెదవి విరుస్తున్నారు. కానీ కోర్ట్ విషయంలో కూడా తాత్సార్యం చేసే రీతిలో టీడీపీ అధిష్టానం ఎత్తులు వేస్తుందనే అభిప్రాయం బలపడుతోంది.

పీక






Related News

బాబుకి కాలు అడ్డుపెడుతున్న కేసీఆర్!

Spread the loveతెలంగాణాలో వ‌ర‌సుగా రెండోసారి విజయం ద‌క్క‌డంతో కారు పార్టీ అధినేత ఉత్సాహం రెట్టింప‌య్యింది. ఎన్న‌డూ లేనంత జోష్Read More

మ‌రో మెగాబ్ర‌ద‌ర్ పొలిటిక‌ల్ ఎంట్రీ క్లియ‌ర్

Spread the loveమెగాస్టార్ చిరంజీవి సినిమా రంగంలో చ‌రిత్ర సృష్టించారు. ఆయ‌న్ని అనుస‌రిస్తూ ఇద్ద‌రు బ్ర‌ద‌ర్స్ టాలీవుడ్ లో ఎంట్రీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *