కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి షాకిచ్చిన టీడీపీ

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766
Spread the love

తెలుగుదేశం పార్టీ షాకిచ్చింది. మోడీకి గట్టి ఝలక్ ఇచ్చింది. దాంతో కమలదళం కుతకుతలాడుతోంది. కాంగ్రెస్ తో చేతులు కలిపిన టీడీపీ తీరుతో తీవ్రంగా స్పందించే అవకాశాలున్నాయని సమాచారం. దాంతో ఈ పరిణామం హస్తినలో హీటు రాజేస్తోంది. ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలకు తెరలేపడం ఖాయంగా ఉంది. ట్రిపుల్ తలాక్ బిల్లు సాక్షిగా రాజ్యసభలో జరిగిన పరిణామాలతో టీడీపీకి తలాక్ చెప్పేయడానికి కూడా బీజేపీ వెనుకాడదనే వాదన మొదలయ్యింది.

తెలుగుదేశం పార్టీ నేరుగా కాంగ్రెస్ తో చేతులు కలిపడం సంచలనంగా మారింది. అది కూడా ఏకంగా పార్లమెంట్ లో కావడంతో చర్చనీయాంశంగా మారింది. మోడీ అభీష్టానికి భిన్నంగా విపక్షంతో చేతులు కలపడం ద్వారా మిత్రపక్షానికి ఝలక్ ఇచ్చిందనే చెప్పవచ్చు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న పార్టీ, ఏకంగా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ట్రిపుల్ తలాక్ బిల్లు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్న తరుణంలో టీడీపీ మాత్రం కాంగ్రెస్ చుట్టూ తిరగడానికి సిద్ధపడడం ఆశ్చర్యకర పరిణామంగా భావించాలి. ఇప్పటికే వివిధ పార్టీలు ఈ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారితో టీడీపీ గొంతు కలపవడం రాజకీయంగా దుమారం రేపే అవకాశం ఉంది.

ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమెదం కోసం మోడీ మాత్రం పట్టుదలగా కనిపిస్త్తున్నారు. ఇప్పటికే లోక్ సభలో ఆమోదం పొందిన బిల్లుని రాజ్యసభలో ఆమోదించుకోవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. అయితే కాంగ్రెస్ మాత్రం సెలక్ట్ కమిటీకి పంపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ సహా విపక్షాల పోరాటానికి తెలుగుదేశం మద్ధతివ్వడం మాత్రం మోడీకి మింగుడుపడే అవకాశం లేదు. రాజ్యసభలో టీడీపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ ఈ విషయం ప్రకటించారు. అంతేగాకుండా ఏకంగా కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ చదవిని విపక్ష సభ్యుల జాబితాలో సీఎం రమేష్, టీడీపీ నాయకుడి పేరుని ప్రస్తావించడం కూడా విశేషంగా మారింది. ఇప్పటికే ఇద్దరు మంత్రులు మోడీ క్యాబినెట్ లో ఉండగా, పెద్దల సభలో తెలుగుదేశం మాత్రం కాంగ్రెస్ చేతులు కలిపి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం విశేషంగా మారింది.

దాంతో ఈ పరిణామం ఏపీ రాజకీయాల మీద స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కీలక సమయంలో కాంగ్రెస్ తో చేతులు కలిపిన టీడీపీ తీరును బీజేపీ సహించదంటున్నారు. ఈలోగా చంద్రబాబు ఓ ప్రకటన చేసి వేడిచల్లార్చే ప్రయత్నం చేయవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. గతంలో అవిశ్వాస తీర్మానంలో దేవేందర్ గౌడ్ ఓట్ విషయంలో సభలో ఓ మాట చెప్పి, బయట మరోలా ప్రవర్తించిన అనుభవాన్ని ద్రుష్టిలో పెట్టుకుని చంద్రబాబు మరోసారి తన పాత అస్త్రాన్ని సిద్ధం చేస్తారని అంటున్నారు. మోడీకి ఆగ్రహం కలిగించకుండా వ్యవహారం ముగించాలని చూస్తారని భావిస్తున్నారు. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఈ పరిణామం అంత తేలికగా తీసుకునే అవకాశం లేదు. దాంతో కొత్త రాజకీయ పరిణామాలకు ఇదో బలమైన సంకేతంగా భావించాలి. కాంగ్రెస్ తో చేతులు కలిపిన టీడీపీ తీరు కొత్త దిశలో సాగుతుందనడంలో సందేహం లేదు.


Related News

9173_ysrcp-3

వైసీపీకి అది చేటు చేస్తుందా?

Spread the loveఏపీలో ప్ర‌తిప‌క్షం తీరు ఆశ్చ‌ర్యంగా క‌నిపిస్తోంది. పాల‌క‌ప‌క్షం మీద పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌నే ఆధారంగా చేసుకుని ఆపార్టీ సాగుతున్నRead More

mammootty-759

టాలీవుడ్ లో వైఎస్ జ‌గ‌న్ యాత్ర‌..!

Spread the loveటాలీవుడ్ లో కూడా పొలిటిక‌ల్ హీట్ రాజుకుంటోంది. ఇప్ప‌టికే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతోంది.Read More

 • బీజేపీకి విశ్వాసం లేదా?
 • మోడీ, జ‌గ‌న్ కి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అత‌డే…!
 • జ‌న‌సేన రూటు ఎటు?
 • టీడీపీ పోస్ట్ మార్ట‌మ్..!
 • జ‌న‌సైనికుల్లో జోష్ నింపిన ప‌వ‌న్!
 • ఫిరాయింపులపై చర్యలుంటాయా?
 • జ‌న‌సేన‌లో పెను మార్పులు
 • బాబు ఎత్తుగ‌డ బూమ‌రాంగ్ అవుతోందా…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *