Main Menu

బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!

Spread the love

కాంగ్రెస్ తో వ్య‌తిరేక‌త‌తో పుట్టిన పార్టీ టీడీపీ. కానీ మూడు ద‌శాబ్దాల ప‌రిస్థితులు అలానే ఉండాల‌ని లేదు. ఎన్టీఆర్ కాలం నాటి రాజ‌కీయాలు నారా లోకేష్ రోజుల్లో సాగ‌డం క‌ష్టం. అందుకే రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌నే నానుడిని టీడీపీ మ‌రోసారి నిజం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే తెలుగుదేశం పార్టీ త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ ని కౌగ‌లించుకునే అవ‌కాశాలున్నాయ‌నే అంచ‌నాలు పెరుగుతున్నాయి. మారుతున్న ప‌రిస్థితుల్లో జాతీయ స్థాయిలో బ‌ల‌మైన ప‌క్షం త‌న‌కు తోడుగా ఉండాల‌ని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు. మోడీ ని ఢీకొట్టాల‌ని నిర్ణ‌యించుకున్న త‌ర్వాత ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ తో చేతులు క‌ల‌పాల్సిన అనివార్య స్థితి చంద్ర‌బాబుకి ఏర్ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అడుగులు ప‌డుతున్నాయి. కొద్దిరోజులు క్రితం కాంగ్రెస్ తో క‌లిసి టీడీపీ పార్ల‌మెంట్ ముందు ఆందోళ‌న‌లో పాల్గొంది. తాజాగా టీడీపీ కీల‌క‌నేత‌లు కాంగ్రెస్ పెద్ద‌ల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

అన్నింటికీ మించి క‌న్న‌డ గ‌డ్డ మీద జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి కోసం టీడీపీ రంగంలో దిగింది. క‌మ‌లానికి షాక్ ఇవ్వ‌డానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ఉప‌యోగించుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా టీడీపీ పావులు క‌దుపుతోంది. తాజాగా కే ఈ కృష్ణ‌మూర్తి నేరుగా ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. కొంద‌రు తెలుగు నేత‌ల‌తో బెంగ‌ళూరులో స‌మావేశం నిర్వ‌హించారు. బీజేపీని ఓడించాల‌ని పిలుపునిచ్చారు. త‌ద్వారా ఏపీ డిప్యూటీ సీఎం రంగంలో దిగి బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం ద్వారా కాంగ్రెస్ కి స‌హ‌క‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. త‌ద్వారా కాంగ్రెస్ తో చేతులు క‌ల‌ప‌డానికి టీడీపీకి స‌మ‌యం ద‌గ్గ‌ర‌కొచ్చిన‌ట్టు భావిస్తున్నారు.

కేసీఆర్ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌క‌ట‌న రాగానే చివ‌ర‌కు మ‌మ‌తా బెన‌ర్జీ వంటి వారు కూడా చ‌ర్చ‌ల వ‌ర‌కూ వ‌చ్చిన‌ప్ప‌టికీ సాటి తెలుగు రాష్ట్ర సీఎంగా చంద్ర‌బాబు మాత్రం కేసీఆర్ కి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించ‌లేదు. పైగా క‌నీసం ఆయ‌న‌తో చ‌ర్చ‌ల‌కు కూడా సిద్ధం కాలేదు. దానికి ప్ర‌ధాన కార‌ణం తెలంగాణాలో కేసీఆర్ కి కాంగ్రెస్ ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి కావ‌డంతో ఆయ‌న‌కు సోనియా, రాహుల్ తో సాన్నిహిత్యం స‌మ‌స్య‌గా చెప్ప‌వ‌చ్చు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబుకి అలాంటి ప‌రిస్థితి లేదు. పైగా తెలంగాణాలో టీఆర్ఎస్ క‌న్నా కాంగ్రెస్ తో క‌ల‌వ‌డం ఆయ‌న‌కు కొంత సానుకూలాంశం అవుతుంది. ఏపీలో కూడా కాంగ్రెస్ ద్వారా రెండు మూడు శాతం ఓట్లు త‌న‌కు తోడ‌వుతాయ‌నే అంచ‌నాలో చంద్ర‌బాబు ఉన్నారు. దానికి త‌గ్గ‌ట్టుగానే కాంగ్రెస్ ని మించి బీజేపీ మోసం చేసింద‌నే ప్ర‌చారం ఉధృతంగా సాగించ‌డం ద్వారా బీజేపీ మీద వ్య‌తిరేక‌త పెంచ‌డ‌మే కాకుండా, కాంగ్రెస్ ప‌ట్ల చ‌ల్లార్చే ప్ర‌య‌త్నం సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో గాంధీ స‌మాధి వ‌ద్ద ఖ‌ద్ద‌రు టోపీల‌తో టీడీపీ ఎంపీల నిర‌స‌న చూసిన త‌ర్వాత ఈ బంధం బ‌ల‌ప‌డ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌ద‌నే అంచ‌నాలు పెరుగుతుండ‌డం విశేషం. ఏమ‌యినా ఏపీ రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. కాంగ్రెస్, టీడీపీ క‌ల‌యిక దేశ రాజ‌కీయాల్లో కూడా కీల‌క ముల‌పు అని చెప్ప‌వ‌చ్చు.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *