Main Menu

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the love

ఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది. కొద్దికాలం క్రితం వ‌ర‌కూ పూర్తిగా బీజేపీని టార్గెట్ చేయ‌డానికి టీడీపీ సిద్ధ‌ప‌డింది. మోడీని ల‌క్ష్యంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించింది. అయితే తీరా ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితి చూస్తే మోడీ మంత్రం ఫ‌లించేలా లేద‌ని టీడీపీ భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి ఏపీలో పునాది కూడా లేని బీజేపీని విమ‌ర్శించ‌డం ద్వారా బాగుప‌డ‌దామ‌ని చంద్ర‌బాబు భావిస్తే అంతకుమించిన అవివేకం ఉండ‌ద‌ని ఉండ‌వ‌ల్లి స‌హా ప‌లువురు నిపుణులు వ్యాఖ్యానించారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు మాత్రం త‌న‌దైన శైలిలో ముందుకు సాగారు. జ‌గ‌న్ మోడీ రెడ్డి అంటూ కూడా టీడీపీ వైపు నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అయితే తీరా ఎన్నిక‌ల సంగ్రామంలో మాత్రం మోడీ క‌న్నా కేసీఆర్ ని మిన్న‌గా చంద్ర‌బాబు చూస్తున్నారు. మోడీ ని విమ‌ర్శించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నం ఏమీ ఉండ‌ద‌ని గ్ర‌హించిన‌ట్టుగా క‌నిపిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఏపీలో జ‌రుగుతున్న ఎన్నిక‌లు వైసీపీకి త‌మ‌కు కాద‌ని, కేసీఆర్ కి టీడీపీకేన‌ని తేల్చేశారు. త‌ద్వారా కేసీఆర్ వ్య‌తిరేక‌త‌ను తెలంగాణా మీద వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకోవాల‌ని చూస్తున్నారు.

కానీ ప్ర‌స్తుతం ఏపీలో ఐదేళ్ల క్రితం నాటి ప‌రిస్థితి ఉందా లేదా అన్న‌ది సందేహంగానే చెప్ప‌వ‌చ్చు. కేసీఆర్ ని అమరావ‌తి శంకుస్థాప‌న‌కు ఆహ్వానించి, ఆ త‌ర్వాత అనంత‌లో పెళ్లి కార్య‌క్ర‌మంలో పెద్ద పీట వేసి, నేరుగా కేసీఆర్ యాగానికి చంద్ర‌బాబు హాజ‌ర‌య్యి. ఆఖ‌రికి హ‌రికృష్ణ శ‌వం సాక్షిగా పొత్తు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టుగా చెప్పుకున్న నేప‌థ్యంలో కేసీఆర్ మీద కోపం ప్ర‌ద‌ర్శించ‌డం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల్లో ఉన్న ఆగ్ర‌హం చ‌ల్లార్చేందుకు చేస్తున్న య‌త్నం ఫ‌లించే అవ‌కాశాలు ఏమాత్ర‌మ‌న్న‌ది వేచి చూడాల్సిన అంశ‌మే.

ఓవైపు తెలంగాణాలో పోటీ కి సిద్ధంగా లేమ‌ని చెప్పేసిన టీడీపీ, ఏపీలో మాత్రం కేసీఆర్ తో త‌ల‌ప‌డుతున్న‌ట్టు చెప్పుకోవ‌డం విస్మ‌య‌క‌ర‌మే అవుతుంది. ఏమ‌యినా చంద్ర‌బాబు త‌న రూటు మార్చుకున్న దానికి త‌గ్గ‌ట్టుగానే చిన‌బాబు కూడా ఏపీ నుంచి పోర్టులు కూడా తెలంగాణాకు తీసుకుపోతారంటూ చేసిన వ్యాఖ్య ఉంది. వివ‌రించ‌డంలో వైఫ‌ల్యం చివ‌ర‌కు లోకేశ్ ని అభాసుపాలుజేసి ఉండ‌వ‌చ్చు గానీ ఆయ‌న ఉద్దేశం మాత్రం కేసీఆర్ మీద గురిపెట్టి జ‌గ‌న్ ని బ‌ద్నాం చేసే య‌త్న‌మేన‌న్న‌ది సుస్ఫ‌ష్టం. ఆశించిన మేర‌కు ల‌క్ష్యం నెర‌వేరుతుందా లేదా అన్న‌ది ప్ర‌స్తుతానికి సందేహాస్ప్దం.


Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *