కాకినాడలో కొత్త సంకేతం: టీడీపీలో గుబులు

cbn
Spread the love

ఎంతో ఆసక్తి రేపిన రెండు ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. టీడీపీ శ్రేణుల విశ్వాసం రెట్టింపయ్యింది. ఆరునూరయినా మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన అభిమానులు, తెలుగుతమ్ముళ్లు బలంగా నమ్మడానికి నంద్యాల దోహదం పడింది. కాకినాడ మరింత ఊతమిచ్చింది. నంద్యాల అసెంబ్లీలో సీటులో 1999 తర్వాత తెలుగుదేశం జెండా ఎగురగా, కాకినాడలో 1987 తర్వాత తొలిసారిగా పసుపు జెండా విజయగర్వంతో కనిపిస్తోంది. వరుసగా రెండు విజయాలతో టీడీపీ శ్రేణుల్లో ధీమా పెరిగింది. కానీ అదే క్రమంలో ఓ కీలకాంశం పార్టీలో గుబులు రేకెత్తిస్తోంది.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో అత్యంత స్పష్టంగా కనిపించిన అంశం ప్రజావ్యతిరేకత. మూడున్నరేళ్ల ప్రభుత్వ విధానాలతో పాజిటివ్ ఓట్ వచ్చిందని పైకి చెబుతున్నప్పటికీ లోలోన మాత్రం పాలక పార్టీలో గుబులు కనిపిస్తోంది. మేకపోతు గాంభీర్యమే తప్ప అసలు వాస్తవం గమనిస్తే పాలకపక్షం వైపల్యాలు ప్రజలను తీవ్ర అసంత్రుప్తికి గురిచేస్తున్నాయి. దానిని అధిగమించడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫలించలేదు. దాంతో చివరకు ధన ప్రవాహం, అధికార పార్టీగా ఉన్న అవకాశాలు కలిసి తేలికగా విజయం సాధించినప్పటికీ అసలు అసంత్రుప్తి మాత్రం ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఉదాహరణకు కాకినాడలో సిటీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుడు ఓటమి పాలయ్యారు. అది కూడా తీవ్రమైన వ్యతిరేకత మూలంగా భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం విశేషం. వాస్తవానికి రెండు స్థానాలకు ఇద్దరు తనయులను రంగంలో దింపి ఏకంగా డిప్యూటీ మేయర్ సీటు కోసం ఎమ్మెల్యే కొండబాబు ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తే ఖంగుతినక తప్పలేదు.

ఎమ్మెల్యే కొడుకు మాత్రమే కాకుండా మరింత మంది సిట్టింగ్ లు కూడా ఓటమి పాలయ్యారు. గత పాలకపక్షంలో పనిచేసినవాళ్లు పరాజయం పాలయ్యారు. పార్టీలతో సంబంధం లేకుండా కొత్త వారినే జనం ఆదరించారు. అదే ఇప్పుడు చంద్రబాబు అండ్ కో లో కొత్త ఆలోచనలకు కారణమవుతోంది. గడిచిన మూడున్నరేళ్ల పాలనలో ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యేల పనితీరు కూడా ప్రజలను నిరాశకు గురిచేస్తోంది. ఆ విషయాన్ని చంద్రబాబు సర్వేలు కూడా చెబుతున్నాయి. చాలా సందర్భాల్లో ఎమ్మెల్యేలకు పాస్ మార్కులు కూడా రావడం లేదంటూ ఆయన మండిపడ్డారు. సీఎం కష్టపడుతున్నా ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలతో అన్యాయం జరుగుతోందనే వాదన వినిపిస్తోంది.

ఈ క్రమంలో సిట్టింగ్ ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబుకి పెద్ద ప్రశ్న కాబోతోంది. పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో సీటు, లేకుంటే సర్వే ఆధారంగా తప్పదు వేటు అని ఆయన పదే పదే చెబుతున్నారు. కానీ సీటు ఇవ్వకుండా సిట్టింగ్ ని పక్కన పెడితే రెబల్ గా మారుతారనడంలో సందేహం లేదు. చిన్న కార్పోరేటర్ ఎన్నికల్లోనే టీడీపీ కూటమిలో రెబల్స్ చిచ్చు పెట్టారు. అలాంటిది ఎమ్మెల్యే సీటుకి ఎసరుపెడితే చాలామంది సహించే అవకాశం ఉండదు. అలాంటప్పుడు టీడీపీకి పెద్ద తలనొప్పి ఎదురవుతుందనడంలో సందేహం లేదు. కాబట్టి అలాంటి పరిస్థితికి ఇప్పటి కాకినడ ఎన్నికలు ఓ సంకేతంగా ఉన్న సమయంలో తెలుగుదేశం ఎలా ఎదుర్కొంటున్నది కీలకాంశం కాబోతోంది.« (Previous News)Related News

Paripoornananda

రాజకీయ పరిపూర్ణం..!

Spread the love18Sharesతెలుగులో ఇప్పుడు కంచ ఐలయ్య, పరిపూర్ణానంద ఈ రెండు పేర్లే ప్రదానంగా వినిపిస్తున్నాయి. దానికి కారణం వీళ్లిద్దరూRead More

jagan

వైసీపీ చక్కదిద్దుకోలేకపోతే చిక్కులే..!

Spread the love2Sharesఏపీ రాజకీయాల్లో నంద్యాలకు ముందు..ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయింది. నంద్యాల ఫలితాల ప్రభావంతో కాకినాడలో ఉన్న బలాన్నిRead More

 • డొల్ల జగన్ అనుకుంటే..బాబు గూట్లో ఉందట..
 • బాబుకి ఆ ఇద్దరిలో ఒక్కరే..!
 • పవన్ కల్యాణ్ గుడ్ బై
 • చంద్ర‌బాబుకి నో అంటున్న రాజ‌మౌళి
 • టీడీపీ అక్కడ కన్నేసింది..
 • జనసేన మీద నాగబాబు స్పందన
 • కాకినాడలో కొత్త సంకేతం: టీడీపీలో గుబులు
 • బాబూ..మీ మాటలు గానీ..!!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *