Main Menu

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తం కన్నా భిన్నంగా ఈసారి స‌ర్వేలు, ఇత‌ర ఏర్పాట్లు షురూ చేశారు. మూడు నెల‌ల ముందే ప‌లువురికి క్లారిటీ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇప్ప‌టికే కోఆర్డినేట‌ర్ల వ్య‌వ‌హారంలో మార్పులు చేసుకుంటూ జ‌గ‌న్ ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో టీడీపీ అధినేత కూడా తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. ప‌లువురు సిట్టింగుల‌కు ఈసారి చెక్ పెట్టే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న వారిని ఈసారి ఎన్నిక‌ల్లో ఛాన్స్ లేద‌ని చెప్పేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది. అందులో కొంద‌రిని త‌ప్పించి, వారి స్థానంలో అదే కుటుంబానికి చెందిన వారిని నిల‌బెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అలాంటి వారిలో జిల్లాల వారీగా జాబితా ఇలా ఉంటుంద‌ని టీడీపీ నేత‌ల్లో ప్ర‌చారం సాగుతోంది. చివ‌రి క్ష‌ణంలో ర‌క‌ర‌కాల స‌మీక‌ర‌ణాల‌తో వారిలో కొంద‌రికి అవ‌కాశం క‌ల్పించ‌వ‌చ్చ‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ హిట్ లిస్టులో ఉన్న వారి పేర్లు మాత్రం ఆస‌క్తిరేపుతున్నాయి. ఆ జాబితా ఇలా ఉండ‌వ‌చ్చ‌ని తాజాగా అందుతున్న స‌మాచారం.

శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్ల‌కు గానూ టీడీపీ 7 గెల‌వ‌గా వైసీపీ నుంచి పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే వ‌చ్చి కండువా క‌ప్పుకున్నారు. దాంతో సిట్టింగులు 8మందిలో ఇద్ద‌రిని ప‌క్క‌న పెట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. గౌతు శ్యామ‌సుంద‌ర్ శివాజీ పేరు ఖాయ‌మ‌య్యింది. ఆయ‌న స్థానంలో అదే కుటుంబం నుంచి కూతురు గానీ అల్లుడు పోటీ చేసే యోచ‌న‌లో ఉన్నారు. అదే స‌మ‌యంలో న‌ర‌స‌న్న‌పేట ఎమ్మెల్యే బ‌గ్గు ర‌మ‌ణ‌మూర్తిని కూడా త‌ప్పించే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో 9 సీట్ల‌కు గానూ టీడీపీ 6 సీట్లు గెల‌వ‌గా బొబ్బిలి ఎమ్మెల్యే సుజ‌య‌కృష్ణ రంగారావు కూడా పార్టీ ఫిరాయించి ఏకంగా అమాత్యుడు కాగ‌లిగారు. దాంతో ఏడుగురు సిట్టింగుల‌కు గానూ నెల్లిమ‌ర్ల, చీపురుప‌ల్లిలో సిట్టింగుల మార్పు ఖాయమ‌య్యింది. నెల్లిమ‌ర్ల‌లో ప‌తివాడ నారాయ‌ణ స్వామి రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్న త‌రుణంలో ఆయ‌న స్థానంలో టీడీపీలో కొన‌సాగితే గంటా శ్రీనివాస‌రావు పోటీ చేసే అవ‌కాశం ఉంది. ఇక చీపురుప‌ల్లిలో మాజీ మంత్రి మృణాళిని స్థానంలో మాజీ ఎమ్మెల్యే గ‌ద్దెబాబురావుని బ‌రిలో దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక విశాఖ జిల్లాలో 15 సీట్లకు గానూ వైసీపీ 3 చోట్ల గెల‌వ‌గా ఇద్ద‌రు పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. కాగా సిట్టింగుల‌లో ఇద్ద‌రిని మార్చ‌డం ఖాయం అని చెబుతున్నారు. అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు, పాయ‌క‌రావు పేట ఎమ్మెల్యే అనిత పేర్లు వినిపిస్తున్నాయి. అనిత‌ను కొన‌సాగించాల్సి వ‌స్తే మ‌రో సిట్టింగుకి సెగ త‌ప్ప‌ద‌ని స‌మాచారం . ఆజాబితాలో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి పేరు కూడా ఉండ‌డం విశేషం. ఇక పెం దుర్తి ఎమ్మెల్యే బండారు స‌త్య‌న్నారాయ‌ణ మూర్తి స్థానంలో వార‌సుల‌ను రంగంలో దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలో 19 స్థానాల‌కు గానూ టీడీపీ నుంచి గెలిచిన 13, ఫిరాయింపులు ముగ్గురుతో క‌లిసి 16మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వంత‌ల రాజేశ్వ‌రి, వ‌రుపుల సుబ్బారావుకి ఈసారి చంద్ర‌బాబు సారీ చెప్ప‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వారిద్ద‌రితో పాటుగా పి గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యేకి కూడా హ్యాండివ్వ‌బోతున్నారు. అదే స‌మ‌యంలో రాజోలు ఎమ్మెల్యే గొల్ల‌ప‌ల్లి సూర్యారావు విష‌యం కూడా ఢోలాయ‌మానంలో క‌నిపిస్తోంది.

ప‌శ్చి మ‌గోదావ‌రిలో టీడీపికి 14మంది ఎమ్మెల్యేలుండ‌గా వారిలో మాజీ మంత్రి పీతల సుజాత‌కు ఈసారి చింత‌ల‌పూడి స్థానం ద‌క్కే అవ‌కాశాలు లేవు. ఇక న‌ర్సాపురం ఎమ్మెల్యే బండారు మాధ‌వ‌రావు నాయుడు, భీమ‌వ‌రం ఎమ్మెల్యే పుల‌వ‌ర్తి ఆంజ‌నేయుల‌లో ఒక‌రిని త‌ప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. నిడ‌ద‌వోలులో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు స్థానంలో ఆయ‌న సోద‌రుడిని బ‌రిలో దింపే యోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం.

ఇక కృష్ణా జిల్లాలో టీడీపీకి పామ‌ర్రు , విజ‌య‌వాడ వెస్ట్ పిరాయింపు ఎమ్మెల్యేల‌తో క‌లుపుకుని 11 మంది ఉన్నారు. వారిలో ఇద్ద‌రిని దాదాపుగా ప‌క్క‌న పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. పెడ‌న ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు స్థానంలో వార‌సుల‌కు అవ‌కాశం ఇచ్చే యోచ‌న‌లో క‌నిపిస్తున్నారు. నందిగామ ఎమ్మెల్యే సౌమ్య తో పాటు పామ‌ర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి క‌ల్ప‌న ని కూడా ప‌క్క‌న పెట్టడం ఖాయంగా చెబుతున్నారు.

గుంటూరు జిల్లాలో కూడా టీడీపీకి 12మంది ఎమ్మెల్యేలున్నారు. ఈసారి ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే రావుల కిషోర్ మార్పు ఖ‌రార‌య్యింది. ఆయ‌న‌తో పాటుగా పెద‌కూర‌పాడు కొమ్మాల‌పాటి శ్రీధ‌ర్ , రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్ర‌సాద్ ల ప‌రిస్థితి కూడా ఊగిస‌లాట‌గా మారింది. ఈ ఇద్ద‌రిని ఒక‌రిని తొల‌గించ‌డం ఖాయం అని భావిస్తున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో ఫిరాయింపులు ముగ్గురితో క‌లుపుకుని టీడీపీకి 10మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో ముగ్గురి ప‌రిస్థితి ఢోలాయ‌మానంలో ప‌డింది. కొండెపి జీబీవీ స్వామిని మార్చ‌డం అనివార్యం అని చెబుతున్నారు. క‌నిగిరి ఎమ్మెల్యే క‌దిరి బాబూరావుకి కూడా సీటు క‌ష్ట‌మేన‌ని స‌మాచారం. ఇక గిద్ద‌లూరు, కందుకూరు ఫిరాయింపుల వ్య‌వ‌హారం కూడా క‌ష్టంగానే క‌నిపిస్తోంది. మొత్తంగా జిల్లాలో ముగ్గురిని మార్చ‌డం ఖాయం అని భావిస్తున్నారు.

నెల్లూరు జిల్లాలోప్ర‌స్తుతం టీడీపీకి న‌లుగురు ఎమ్మెల్యేలుండ‌గా వారిలో కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి, గూడురు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్థానంలో కొత్త వారికి చోటు ఖాయంగా క‌నిపిస్తోంది.

రాయ‌ల‌సీమ లిస్ట్ కోసం నెక్ట్స్ పోస్ట్ క్లిక్ చేయండి..!






Related News

చంద్ర‌బాబు జూన్ 8 మీద ఎందుకు గురిపెట్టారు?

Spread the loveచంద్ర‌బాబు తీవ్ర స‌మ‌స్య‌ల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆయ‌న రాజ‌కీయంగా అత్యంత సంక్లిష్ట స్థితిని ఎదుర్కొంటున్నారు. వాస్త‌వానికి ఎన్నిక‌లRead More

జ‌న‌సేన ఆశ‌ల‌న్నీ అక్క‌డే..!

Spread the loveఎన్నిక‌లు ముగిశాయి. కానీ ఫ‌లితాల కోసం సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌ప్ప‌క‌పోవ‌డంతో ర‌క‌ర‌కాల అంచ‌నాలు ముందుకొస్తున్నాయి. అయితే సాధార‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *