Main Menu

మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు

Spread the love

పార్లమెంట్ లో ఏపీ ఎంపీల వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. మంచి నాటక ప్రదర్శనను తలపిస్తోంది. ఎవరి పాత్రలు వారు పోషించడంపైనే ద్రుష్టి పెట్టారు. అంతా పక్కా స్కెచ్ ప్రకారం, ముందుకు అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే సాగుతున్నట్టు కనిపిస్తోంది. అందులో తెలుగుదేశం ఎంపీలో నటనా చాతుర్యం ప్రదర్శిస్తుండగా, వైసీపీ ఎంపీలు కూడా తామేమీ తీసిపోమని చాటుతున్నారు. దాంతో ఏపీ ప్రజల ఆశలు ఈ నాటకాల దెబ్బకు తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ బడ్జెట్ లో ఏపీకి కొంత కేటాయింపుల విషయంలో న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం అయ్యింది. కానీ ఆశలన్నీ నీరుగార్చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ప్రస్ఫుటం అవుతోంది. చివరకు ఏపీ బంద్ కి లెఫ్ట్ పార్టీలు పిలుపునిచ్చే వరకూ వెళ్లింది. దాని ప్రభావంతో పార్లమెంట్ ముందు ఏపీ ఎంపీలు తమదైన శైలిలో వివిధ రూపాల్లో ప్రదర్శనలు సాగిస్తున్నారు. ఏడుగురు టీడీపీ ఎంపీలు ధర్నాలు చేస్తే, నలుగురు వైషీపీ ఎంపీలు కూడా ధర్నా చేసి ఆశ్చర్యపరిచారు.

టీడీపీ ఎంపీలు సభలో కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. మెడీ ఉండగా నిరసన తెలిపారు. కానీ అనూహ్యంగా సుజనా చౌదరిని పిలిచి మాట్లాడిన తర్వాత సీన్ మారిపోయింది. ఈనాడు కథనం ప్రకారం మోడీ 25 నిమిషాలు భేటీ కాగా, మంత్రి సుజనాతో కేవలం 5 నిమిషాలు మాత్రమే మోడీ మాట్లాడినట్టు ఆంధ్రజ్యోతి లెక్కలు వచ్చాయి. అయినా వాస్తవం కొంత సేపు మరచిపోతే తాజాగా మోడీ లోక్ సభలో ప్రకటన చేయడానికి సిద్దమయిన నేపథ్యంలో తెలుగుదేశం ఎంపీలంతా సైలెంట్ అయిపోయారు. దానికి కారణం మోడీ గట్టిగా ఇచ్చిన వార్నింగ్ కారణమనే వాదనలున్నాయి. అదే సమయంలో వైసీపీ నేతలు కూడా వాకౌట్ చేసి మోడీకి ఎటువంటి ఆటంకం లేకుండా అడ్డు తొలగించినట్టు కనిపిస్తోంది.

మోడీ ప్రకటనలో ఏపీకి ఏదో న్యాయం జరుగుతుందని ఆశిస్తే..దానికి భిన్నంగా ఆయన కాంగ్రెస్ మీద వేలెత్తి పలాయనవాదం అవలంభించారు. ఒక్క సమస్యను కూడా ప్రస్తావించకుండానే ప్రజల ఆశలను పూర్తిగా తుంచేశారు. దాంతో కనీసం నిలదీయడానికి, న్యాయం అడగడానికి ఒక్క నాయకుడయినా ముందుకొస్తారని ఆశిస్తే, టీడీపీ సైలెంట్, వైసీపీ వాకౌట్ మంత్రం జపించడంతో ఏపీకి తీరని అన్యాయం జరిగింది. దాంతో ఏపీ ప్రధాన పక్షాలు మోడీ ముందు మోకరిల్లాయనే వాదన వినిపిస్తోంది.


Related News

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగాRead More

లేటెస్ట్ స‌ర్వే: పెరిగిన జ‌గ‌న్ గ్రాఫ్

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో విప‌క్ష హ‌వా పెరుగుతోంది. గ‌త రెండు మూడు నెల‌ల్లో కూడా జ‌గ‌న్ కి ఆద‌ర‌ణRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *