Main Menu

కొరివితో త‌ల‌గోక్కోవ‌డం..వ‌ర్మ‌తో వివాదానికి దిగ‌డం ఒక్క‌టే..

Spread the love

అవునా..అంటే అవున‌నే అనిపిస్తోంది. తెలుగుదేశం నేత‌ల తీరు చూస్తుంటే దానికి త‌గ్గ‌ట్టుగానే ఉంది. గ‌తంలో చేసిన త‌ప్పిదాల‌ను ఆపార్టీ పున‌రావృతం చేస్తోంది. ఇటీవ‌లే జ‌గ‌న్ కోడిక‌త్తి విష‌యంలో టీడీపీ నేత‌లు ఓవ‌రాక్ష‌న్ కి పోయి చేతులు కాల్చుకున్నారు. సైలెంట్ గా ఉంటే స‌రిపోయేదానికి చివ‌ర‌కు విజ‌య‌మ్మ‌ను కూడా సీన్ లోకి లాగి చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు స‌రిగ్గా అలాంటి ప్ర‌య‌త్న‌మే టీడీపీ క్యాంప్ లో జ‌రుగుతోంది. నిత్యం ఏదో వివాదంతో వార్త‌ల్లో ఉండ‌డం ద్వారా త‌న సినిమాల‌ను సొమ్ము చేసుకుంటున్న వ‌ర్మ‌తో టీడీపీ నేత‌లు త‌ల‌ప‌డుతున్నారు. ఇది మ‌రింత ర‌చ్చ‌కు దారితీసే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. గ‌తంలో వ‌ర్మ‌తో త‌గాదాకి దిగిన జ‌న‌సేన అధినేత వంటి వారు కూడా చివ‌ర‌కు మౌనంతోనే వ‌ర్మ‌ను మూయించ‌గ‌లిగారు. ఆ త‌ర్వాత వంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం కూడా అంతే అయ్యింది.

ఇప్పుడు టీడీపీ నేత‌లు వెన్నుపోటు సాంగ్ మీద పెడుతున్న కేసులు చిరిగి చాంతాండంత అయితే చివ‌ర‌కు టీడీపీకే న‌ష్టం వ‌స్తుంద‌నే అభిప్రాయం చాలామందిలో వినిపిస్తోంది. వ‌ర్మ‌కు పోయేదేమీ లేదు కాబ‌ట్టి టీడీపీకే చివ‌ర‌కు స‌మ‌స్య అవుతుంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. క‌ర్నూలులో టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుకి ప్ర‌తిఫ‌లంగా తాను కూడా పిర్యాదు చేయ‌బోతున్న‌ట్టు వ‌ర్మ ప్ర‌కటించ‌డం గ‌మ‌నిస్తే అత‌డు వెన‌క్కి త‌గ్గే వ్య‌క్తి కాద‌ని తేలిపోతుంది. దాంతో టీడీపీకి స‌మ‌స్య‌లు మిగ‌ల‌డం త‌ప్ప సాధించేదేమీ ఉండ‌ద‌నే చెప్ప‌డానికి చాలామంది సిద్ధ‌ప‌డుతున్నారు.






Related News

ప్రశ్నార్థ‌కంగా ప‌వ‌న్ ప‌య‌నం?

Spread the loveరాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాజ‌కీయాల్లో శ‌త్రువులు, మిత్రులు కూడా శాశ్వ‌తంగా ఉండ‌రు. కానీ గ‌త ఏడాది మార్చిలోRead More

ష‌ర్మిళ మ‌ళ్లీ ఎందుకు బ‌య‌ట‌కొచ్చారు

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి త‌న వ్య‌క్తిత్వం మీద జ‌రుగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *