బాబుని పున‌రాలోచ‌న‌లో ప‌డేసిన వైసీపీ

ys jagan
Spread the love

వైసీపీ కార్య‌క్రమం ఏపీ సీఎం ని పునరాలోచ‌న‌లో ప‌డేసింది. తాజాగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల్లో కీల‌క స‌మ‌యంలో వైసీపీ చేప‌ట్టిన ఆందోళ‌న టీడీపీ నేత దృష్టిలో ప‌డింది. ప్ర‌త్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్త‌గా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు వైసీపీ పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని క‌లెక్ట‌ర్ ఆఫీసుల ముందు ఆపార్టీ శ్రేణులు తీవ్ర‌స్థాయిలో నిర‌స‌న‌లు తెలిపారు. అయితే ప్ర‌భుత్వం ముంద‌స్తు సూచ‌న‌ల‌తో పోలీసుల‌ను క‌ట్ట‌డి చేసింది. క‌లెక్ట‌ర్ కార్యాల‌యాలు ముట్ట‌డించిన‌ప్ప‌టికీ ఎక్క‌డా అడ్డుకున్న దాఖ‌లాలు లేవు. అరెస్టులు లేవు. ఒక‌వేళ పోలీసులు సంయ‌మ‌నం పాటించ‌క‌పోతే ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త మ‌రింత పెరుగుతుంద‌ని భావించిన ప్ర‌భుత్వం ముందుచూపుతోనే పోలీసుల‌ను నియంత్రించింద‌ని భావిస్తున్నారు.

అదే స‌మ‌యంలో జిల్లా క‌లెక్ట‌రేట్ల వ‌ద్ద‌కు త‌ర‌లివ‌స్తున్న వారి సంఖ్య‌పై ఎప్పటిక‌ప్పుడు ఇంటిలిజెన్స్ నివేదిక‌ల‌ను సీఎం చంద్ర‌బాబు పరిశీలించిన‌ట్టు చెబుతున్నారు. గ‌తం క‌న్నా భిన్నంగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం క‌నిపించింద‌ని ఉన్న‌త స్థాయి ఇంటిలిజెన్స్ అధికారి వ‌ర‌కూ ఆఫ్ ది రికార్డ్ లో చేసిన వ్యాఖ్య సారాంశం స‌ర్కారు దృష్టికి వెళ్లి ఉంటుంద‌ని చెబుతున్నారు. త‌ద్వారా వైసీపీ పిలుపున‌కు విశేష స్పంద‌న ల‌భించింద‌ని పాల‌క ప‌క్ష పెద్ద‌ల్లోనే చ‌ర్చ సాగుతోంది. గ‌తానికి మించి యువ‌త పాల్గొన‌డం, ఆందోళ‌న‌లో భాగ‌స్వాముల‌యిన వారంద‌రిలో ఉత్సాహం క‌నిపించ‌డం కొత్త ప‌రిణామంగా అంచ‌నా వేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో సెంటిమెంట్ తో కూడిన అంశంపై కార్య‌క్ర‌మం ద్వారా జ‌గ‌న్ ఓ అడుగు వేశార‌ని చెబుతున్నారు. అది వైసీపీకి సానుకూలాంశంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని టీడీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్న త‌రుణంలో విరుగుడుగా ఏదో చేయాల‌నే ఆలోచ‌న‌కు చంద్ర‌బాబు వ‌చ్చార‌ని స‌మాచారం.

దాంతో ఈ వ్య‌వ‌హారంలో చంద్ర‌బాబు నేరుగా క‌న్నా జ‌న‌సేన రూపంలో స్పందించేలా ఓ ప‌థ‌కం సిద్ధం చేయ‌బోతున్నార‌న్న ప్ర‌చారం సాగుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఫోటో షూట్ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. త్వ‌ర‌లో ప్ర‌త్యేక హోదాకి సంబంధించి జ‌న‌సేన ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నారు. త‌ద్వారా జ‌గ‌న్ జంత‌ర్ మంత‌ర్ ధ‌ర్నాకి పిలుపునిచ్చిన నేప‌థ్యంలో కొంద‌రి దృష్టినైనా మ‌ళ్లించే య‌త్నం చేయాల‌న్న అభిప్రాయానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఢిల్లీలో ప‌రిణామాలు చూసి యాక్ష‌న్ ప్రారంభించాల‌ని చంద్ర‌బాబు ఆశించినప్ప‌టికీ, తాజాగా జిల్లా కేంద్రాల్లో ధ‌ర్నాల తర్వాత పున‌రాలోచ‌న చేసి కొత్త ప‌థ‌కం సిద్దం చేస్తున్నార‌ని భావిస్తున్నారు. ఏమ‌యినా ఢిల్లీ నేత‌ల‌ను క‌దిలించాల్సిన ప్ర‌త్యేక హోదా నినాదంతో ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబులో క‌ద‌లిక‌ను ఖాయం చేసింద‌ని చెబుతున్నారు.


Related News

mammootty-759

టాలీవుడ్ లో వైఎస్ జ‌గ‌న్ యాత్ర‌..!

Spread the loveటాలీవుడ్ లో కూడా పొలిటిక‌ల్ హీట్ రాజుకుంటోంది. ఇప్ప‌టికే టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ రెడీ అవుతోంది.Read More

Faridabad - Prime Minister Narendra Modi during a workshop for the newly elected MPs at Suraj Kund in Faridabad on Saturday, 28 June 2014. (Photo by ARIJIT SEN . DNA)

బీజేపీకి విశ్వాసం లేదా?

Spread the loveఅవిశ్వాసం చుట్టూ ఏపీ రాజ‌కీయాలు తిరుగుతున్నాయి. అన్ని పార్టీలు దాని మీద దృష్టి కేంద్రీక‌రించాయి. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టినRead More

 • మోడీ, జ‌గ‌న్ కి మ‌ధ్య‌వ‌ర్తిత్వం అత‌డే…!
 • జ‌న‌సేన రూటు ఎటు?
 • టీడీపీ పోస్ట్ మార్ట‌మ్..!
 • జ‌న‌సైనికుల్లో జోష్ నింపిన ప‌వ‌న్!
 • ఫిరాయింపులపై చర్యలుంటాయా?
 • జ‌న‌సేన‌లో పెను మార్పులు
 • బాబు ఎత్తుగ‌డ బూమ‌రాంగ్ అవుతోందా…?
 • వైసీపీ కి లైన్ క్లియ‌ర్ చేసిన చంద్ర‌బాబు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *