Main Menu

మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?

Spread the love

తెలుగుదేశం తెగిస్తుందా…ఇంకా వేచి చూస్తుందా. ఆ పార్టీ ఎంపీలు సహనం చచ్చిపోయిందంటున్నారు. బీజేపీని ఇక భరించలేమంటున్నారు. పార్లమెంట్ లో తమను ఖాతరు చేయని పార్టీని పట్టుకుని వేలాడలేమంటున్నారు. కానీ అధినేత అభిప్రాయం భిన్నంగా ఉంది. దాంతో బీజేపీ, టీడీపీ బంధం ఢోలాయమానంలో కొనసాగుతోంది. ఏపీ మంత్రులు కూడా తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని వదిలించుకుంటామని తెగేసి చెబుతున్నా టీడీపీ అధ్యక్షుడు మాత్రం దుబాయ్ లో ఉండడంతో వ్యవహారం ఆసక్తిగా మారుతోంది.

ఏపీలో ప్రజలు మంచి కాకమీద ఉన్నారు. తాజాగా బంద్ తో ఇది ప్రస్ఫుటం అయ్యింది. ఈ బంద్ నిర్వహణకు చంద్రబాబు సర్కారు చేదోడు ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం విశేషంగా స్పందించారనడంలో సందేహం లేదు. అయితే బీజేపీ మాత్రం ఇది పూర్తిగా చంద్రబాబు తమ మీద వేసిన స్కెచ్ గా భావిస్తోంది. బీజేపీని, మోడీని బద్నాం చేయడానికి బాబు వ్యూహం పన్నిన విషయాన్ని గ్రహించింది. దాంతో ఎదురుదాడికే రెడీ అవుతోంది. చివరకు మోడీ స్పీచ్ తర్వాత, జైట్లీ కూడా పాతపాటే పాడడం వెనుక అసలు ఉద్దేశం అదేనని భావిస్తున్నారు.

ఈ క్షణంలో బీజేపీ ప్రభుత్వం స్పందిస్తే బాబు తన ఘనతగా చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని భావిస్తోంది. దాంతో చంద్రబాబు వ్యూహాలకు ప్రతివ్యూహాలతో సాగుతోంది. మధ్యలో ఏపీ ఆశల మీద నీళ్లు జల్లుతున్నట్టు స్పష్టం అవుతోంది. చివరకు జనం ఆకాంక్షలు నెరవేరే మార్గం కనిపించడం లేదు. అదే సమయంలో రాజకీయంగా పై చేయి సాధించడానికి ఇరుపార్టీలు పై చేయి సాధించడానికి ఆడుతున్న గేమ్ లో కీలకమలుపు ఖాయమని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంలో కొందరు బీజేపీ ఎంపీలు కొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. సుజనా చౌదరి వ్యవహరాన్ని జాప్యం చేయాలని చూస్తున్నప్పటికీ కొందరు సహించడం లేదు. కానీ చివరకు చంద్రబాబు కూడా సుజనా మాటలకే మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనాగా భావిస్తున్నారు.

దాంతో టీడీపీ ఇప్పటికిప్పుడు తమను వీడిపోలేదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఆ లెక్కలతోనే పార్లమెంట్ లో జరుగుతున్న తంతుని పూర్తిగా వారి అవసరాల కోసం సాగుతున్న వ్యవహారంగానే భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి మాత్రం మొండిచేయి తప్పదని తేలుతోంది. అదే సమయంలో 9వతేదీతో ముగియబోతున్న పార్లమెంట్ తొలి దశ బడ్జెట్ సెషన్ లో 184 కింద పార్లమెంట్ లో ఓటింగ్ జరిగితే మాత్రం అది కీలకాంశం కాబోతోంది. టీడీపీ సహా వివిధ పార్టీలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారబోతోంది. ఈ లోగా చంద్రబాబు ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్నది చూడాలి.


Related News

చంద్ర‌బాబు ముంద‌స్తు స‌న్నాహాలు

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణ ముంచుకొస్తోంది. అన్ని పార్టీలు స‌న్నాహాల్లో క‌నిపిస్తున్నాయి. తెలంగాణాలో ఏకంగా అసెంబ్లీ ర‌ద్దు అయ్యే అవ‌కాశాలున్నాయంటూRead More

టీడీపీకి చిక్కులు తప్పవా..?

Spread the loveఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీకి అవస్థలు పెరగడమే తప్ప తగ్గే అవకాశాలు లేవు. ముఖ్యంగా గడిచిన ఎన్నికల్లోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *