Main Menu

బాబు అలా- ఎంపీలు ఇలా

Spread the love

ఏపీ రాజ‌కీయాల వేడి హ‌స్తిన‌లో మ‌రోసారి ప్ర‌స్ఫుటం కాబోతోంది. రెండో విడ‌త బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా పార్ల‌మెంట్ లో హోదా వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారింది. ప్ర‌త్యేక హోదా ద‌క్కిందా లేదా అన్న దానిని ప‌క్క‌న పెడితే ఏ రాజ‌కీయ పార్టీ ఎలా వ్య‌వ‌హ‌రించిందన్న‌దే ఇప్పుడు కీల‌కం కాబోతోంది. ఏపీకి చెందిన రెండు ప్ర‌ధాన పార్టీల మీద అంద‌రి దృష్టి ఉంటుంద‌నే విష‌యంలో సందేహం లేదు కాబ‌ట్టి, ఎంపీలంతా దానికి త‌గ్గ‌ట్టుగా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. గ‌తంలో కాంగ్రెస్ ఎంపీల విష‌యంలో ప్ర‌జ‌ల్లో క‌లిగిన అభిప్రాయాలు ఆఖ‌రికి చాలామంది రాజ‌కీయ జీవితాల‌కు ఆటంకంగా మారిన నేప‌థ్యంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆలోచిస్తున్నారు.

కానీ చంద్ర‌బాబు తీరు మాత్రం భిన్నంగా ఉంద‌ని తెలుస్తోంది. తాజాగా విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ఎంపీల భేటీ విష‌యంలో ప‌లువురు నాయ‌కులు దూకుడు ప్ర‌ద‌ర్శించాల‌ని కోరిన‌ట్టు స‌మాచారం. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటేనే త‌మ‌కు మ‌నుగడ ఉంటుంద‌ని, ప్ర‌జ‌ల్లో విస్తృతంగా చ‌ర్చ సాగుతున్న స‌మ‌యంలో తాము స‌క్ర‌మంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే సంకేతాలు వెళ్ల‌డం ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డ‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ వంటి వారు కూడా ఎంపీల మీద గురిపెట్టి విమ‌ర్శ‌లు సాగిస్తున్న నేప‌థ్యంలో త‌మ భ‌విష్య‌త్తుకి ఢోకా లేకుండా చూసుకోవాల‌ని భావిస్తున్నారు.

అయినా టీడీపీ అధినేత మాత్రం బీజేపీ విష‌యంలో సామ‌ర‌స్య ధోర‌ణి ఉత్త‌మ‌మ‌నే ఆలోచ‌న‌తో ఉన్న‌ట్టు ఓ ఎంపీ వ్యాఖ్యానించ‌డం విశేషంగా మారింది. తామంతా ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో గ‌ట్టిగా పోరాడాల‌ని భావిస్తున్న‌ప్ప‌టికీ బాబు మాత్రం బీజేపీతో చ‌ర్చ‌ల పేరిట స‌మ‌స్య‌ను దాట‌వేసే ధోర‌ణిలో ఉన్నార‌ని వాపోతున్నారు. అది ఆఖ‌రికి ఎంపీల పీట‌కింద‌కు ప్ర‌జాగ్ర‌హం పోటెత్తే ప్ర‌మాదాన్ని తీసుకొస్తోంద‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే బీజేపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్ పేరుతో చ‌ర్చ‌ల ప్ర‌హ‌స‌నానికి శ్రీకారం చుట్టిన చంద్ర‌బాబు చివ‌ర‌కు పార్ల‌మెంట్ లో అవిశ్వాసం తీర్మానం, రాజీనామా వంటి వాటి జోలికి పోకుండానే ముగించేసే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం తాజా భేటీ త‌ర్వాత టీడీపీ ఎంపీల‌లోనే రావ‌డం విశేషంగా మారింది. చంద్ర‌బాబు త‌న అవ‌స‌రాల రీత్యా కేంద్రంతో మెత్త‌గా వ్య‌వ‌హ‌రిస్తే చివ‌ర‌కు తాము మునిగిపోతామ‌నే అభిప్రాయం ఎంపీల‌లో రావ‌డం విశేషంగా భావింవ‌చ్చు.






Related News

రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..!

Spread the loveవంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం ఆసక్తిగా మారుతోంది. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుRead More

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *