Main Menu

టీడీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు..!?

Spread the love

చంద్ర‌బాబుకి చిక్కులు తప్పేలా లేవు. ఓవైపు తెలంగాణాలో ఫ‌లితాలు ఏమేర‌కు సానుకూలంగా ఉంటాయ‌న్న‌ది సందేహాస్ప‌దంగా క‌నిపిస్తోంది. స‌రిగ్గా అదే స‌మ‌యంలో సొంత రాష్ట్రం ఆంద్ర‌ప్ర‌దేశ్ లో కూడా చిక్కులు త‌ప్ప‌వా అన్న సందేహాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో కొంద‌రు ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అంతేగాకుండా ఓ అంత‌ర్గ‌త ర‌హ‌స్య స‌మావేశం కూడా నిర్వ‌హించారు. దానికి 15 మంది వ‌ర‌కూ ఎమ్మెల్యేలు హాజ‌ర‌యిన‌ట్టు స‌మాచారం. విజ‌య‌వాడ‌లోని ఓ ప్రైవేట్ హాటల్ లో జ‌రిగిన స‌మావేశంలో ప‌లువురు సీనియ‌ర్లు కూడా పాల్గొన్న‌ట్టు తెలుస్తోంది.

త‌మ‌ను అనుమానిస్తూ, అవ‌మానిస్తున్న‌ట్టుగా ప‌రిస్థితులున్నాయ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. చుట్టూ నిఘా పెట్టి, చివ‌ర‌కు సెక్యూరిటీ ద్వారా కూడా స‌మాచారాన్ని సేక‌రిస్తున్న తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాలు, గుంటూరు, ఉత్త‌రాంధ్ర వాసుల్లో ఎక్కువ మంది మీద ఇలాంటి ప్ర‌య‌త్నం టీడీపీ అధిష్టానం చేస్తోంద‌ని వారు భావిస్తున్నారు. ఓవైపు జ‌న‌సేన‌, మ‌రోవైపు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నార‌ని ప్ర‌చారం సాగుతున్న వారి చుట్టూ వ‌ల‌యాన్ని ఏర్పాటు చేసి వారు చేజారిపోకుండా చూసుకునేందుకు చంద్ర‌బాబు,లోకేష్ చేస్తున్న ప్ర‌య‌త్నం ఎమ్మెల్యేల ఆగ్ర‌హానికి కార‌ణం అవుతోంద‌ని భావిస్తున్నారు.

చివ‌ర‌కు తెలంగాణా ఎన్నిక‌ల్లో కూడా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కూడా స‌మావేశంలో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో కొంద‌రు సిట్టింగుల‌ను ప‌క్క‌న పెట్టేందుకు టీడీపీ అధిష్టానం క‌స‌ర‌త్తులు చేస్తోంద‌నే ప్ర‌చారం ఇలాంటి అసంతృప్తుల‌కు అవ‌కాశం ఇస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఆర్టీజీఎస్ స‌ర్వేల పేరుతో అధిష్టానం త‌మ‌ను కించ‌ప‌రుస్తోంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. టార్గెట్ లో ఉన్న ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో మాత్ర‌మే ఇలాంటి స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు. స్వ‌తంత్ర్య‌త లేకుండా పోయింద‌ని, అధిష్టానం చెప్పుచేత‌ల్లో మిగిలిపోవాల్సి వ‌స్తోంద‌ని వాపోతున్నారు. ఈ నేప‌థ్యంలో వారి కొంద‌రు తిరుగుబాటు చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని స‌మాచారం.

తెలంగాణా ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకునేందుకు కొంద‌రు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. డిసెంబ‌ర్ 11 త‌ర్వాత ఏపీలో కూడా ప‌రిణామాలు వేగంగా మారిపోయే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా. మ‌హా కూట‌మి గెలిస్తే కొంత స‌ర్థుకుపోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తార‌ని , దానికి భిన్నంగా కేసీఆర్ మ‌ళ్లీ ప‌గ్గాలు చేప‌డితే తెలుగుదేశం నేత‌లు తెగించే అవ‌కాశాలున్నాయ‌ని భావిస్తున్నారు. ఏమ‌యినా తెలంగాణా ఎన్నిక‌ల ప‌లితాలు ఏపీలో కూడా టీడీపీ భ‌విత‌వ్యాన్ని నిర్ణ‌యించే అవ‌కాశం స్ప‌ష్టంగా ఉంది.


Related News

జ‌న‌సేన‌కు ఏమ‌య్యింది..?

Spread the love10Sharesఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. నోటిఫికేష‌న్ తో సంబంధం లేకుండానే పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మునిగిపోయాయి. జ‌న‌సేన కూడాRead More

చంద్ర‌బాబు సీనియారిటీపై మోడీ సెటైర్లు

Spread the love54Sharesఏపీ బీజేపీ శాఖ నిర్మించిన ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌సంగించారు. అక్ష‌ర‌క్ర‌మంలో, అన్నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *