పవన్ కల్యాణ్ పొజిషన్ ఏంటి?

chandrababu pawan
Spread the love

రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఉండాలని కోరుకోవడం అవివేకం అవుతుంది. అందుకే జనసేనాని కూడా తన మిత్ర బ్రుందం విషయంలో ఆచితూచి ఆడుగులేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకుంటే అసలుకే ఎసరు తెచ్చేలా ఉంది టీడీపీ తీరు. జనసేనను ముప్పేట దాడితో కట్టడి చేయడానికి తెలుగుదేశం ఇప్పటికే స్కెచ్ వేసింది. ఓవైపు స్పెషల్ ఫ్లైట్ లో పిలిచి పవన్ కల్యాణ్ తో విందు రాజకీయాలు నడుపుతారు. అదే సమయంలో అసలు పవన్ కల్యాణ్ ఎవరు అని అడుగుతారు. ఓవైపు జనసేన మా మిత్రపక్షమే అంటారు..ఆ వెంటనే అసలు జనసేన ఎక్కడుందని ప్రశ్నిస్తారు. తద్వారా రాజకీయంగా జనసేన గందరగోళంలోకి నెట్టబడాలని చంద్రబాబు వ్యూహంగా భావిస్తున్నారు. తద్వాారా అయితే తమ వెంట నడవాలి..లేకుంటే పార్టీలో సందిగ్ధం పెంచాలన్నట్టుగా టీడీపీ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

ముఖ్యంగా ఇటీవల జనసేన అధికారికంగా జారీ చేసిన ట్వీట్ ఈ రెండు పార్టీల మధ్య దూరం పెంచిందని భావిస్తున్నారు. 175 స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించడం ద్వారా తెలుగుదేశం శిబిరంలో పవన్ కల్యాణ్ కుంపటి రాజేశారు. అదే జరిగితే టీడీపీ ఆశలు ఆవిరవుతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు వరకూ ఉన్న ప్రాంతాల్లో పవన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఆ మేరకు టీడీపీకి తీరని నష్టం కలుగుతుంది. దానిని నివారించడంలో భాగంగా పవన్ ను బద్నాం చేసే పనిలో టీడీపీ పడినట్టు కనిపిస్తోంది.

పితాని సత్యాన్నారాయణ, అశోక్ గజపతిరాజు వంటి వారి స్పందన యధాలాపంగా వచ్చింది మాత్రం కాదు. దాని వెనుక రాజకీయ వ్యూహం స్పష్టం. అదే తమ చేజారి పోకుండా పవన్ ని కట్టడి చేసే పన్నాగంలా మారిందని అంచనా వేస్తున్నారు. అదే నిజమయితే పీకే పరిస్థితి ఏమవుతుందనే చర్చ మొదలయ్యింది. చంద్రబాబు ఎత్తులను పవన్ కల్యాణ్ అధిగమిస్తారా..ఆయన అంచనాలకు తగ్గట్టుగా 175 సీట్లకు పోటీ చేయాలన్న ఆలోచన అమలు చేస్తారా..లేక ట్వీట్ మాదిరిగానే నిర్ణయం కూడా ఉపసంహరించుకుంటారా అన్నది చూడాలి.


Related News

9173_ysrcp-3

వైసీపీది వాపా?..బ‌ల‌మా??

Spread the loveవైసీపీలో ఊహించ‌ని ప‌రిణామాలు సాగుతున్నాయి. కొత్త ఊపు క‌నిపిస్తోంది. హోదా ఉద్య‌మం, బాబు యూ ట‌ర్న్ వ్య‌వ‌హారంRead More

chandrababu

ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!

Spread the loveఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం హీటు రాజేస్తోంది. అన్ని పార్టీలు అదే డిమాండ్ తో సాగాల్సినRead More

 • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
 • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
 • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
 • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
 • పవన్ కి పరిష్కారం అతడే..
 • ఆ ఇద్ద‌రూ త‌ప్ప..అంద‌రితోనూ అంటున్న టీడీపీ
 • పవన్ సీన్ మార్చేస్తారా…?
 • చంద్ర‌బాబుపై సంచ‌ల‌నాస్త్రం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *