Main Menu

టీడీపీ ఏం చెప్పుకోవాలి…?

Spread the love

ఏపీలో దాదాపుగా ఎన్నిక‌ల కోలాహ‌లం మొద‌ల‌య్యినట్టే చెప్ప‌వ‌చ్చు. షెడ్యూల్ కి ఏడాది ముందు నుంచే పార్టీల‌న్నీ త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రి ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటారు..ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అదే స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద ఆయుధంగా మారుతోంది. పాల‌క టీడీపీ కూడా ఉద్య‌మంలోకి వ‌చ్చినా క్రెడిట్ మాత్రం విప‌క్షాల‌కే ద‌క్కుతోంది. పాచిపోయిన ల‌డ్డూలంటూ కామెంట్స్ చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి, ఆమ‌ర‌ణ‌దీక్ష కూడా చేసి, యువ‌భేరీల‌తో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న ఎజెండా ప్ర‌త్యేక హోదానేన‌ని తేల్చిచెప్పిన జ‌గ‌న్ కి ప్ర‌జ‌ల్లో మార్కులు ప‌డుతున్నాయి. అది చంద్ర‌బాబుకి, టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌డం లేదు. మీడియా స‌హాయంతో ఎంత‌గా ప్ర‌చారం చేసినా ఫ‌లితం ద‌క్క‌డం లేద‌ని టీడీపీ శ్రేణులే భావిస్తున్నాయి. చివ‌ర‌కు అధినేత దీక్ష ఏమేర‌కు ప్ర‌భావితం చేస్తుందో చెప్ప‌లేని సందిగ్ధంలో క‌నిపిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్న వేళ ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పి రంగంలో దిగాల‌న్న‌ది అర్థం కాని విష‌యంగా మారిపోయింది. అందుకు ప్ర‌ధాన కార‌ణం అమ‌రావ‌తి. అదే పెద్ద ఆయుధంగా చంద్ర‌బాబు భావించారు. క‌నీసం 2019 నాటికి కొన్ని భ‌వంతుల‌యినా చూపించి, పూర్తి చేయాలంటే మ‌రోసారి బాబుకే అవ‌కాశం ఇవ్వాల‌నే అనుభ‌వం అస్త్రాన్ని సంధిస్తార‌ని చాలామంది అంచ‌నా వేశారు. కానీ తీరా చూస్తే అందులో టీడీపీ స‌ర్కారు తీవ్రంగా విఫ‌ల‌మ‌య్యింద‌నే చెప్ప‌వ‌చ్చు.కేవ‌లం తాత్కాలిక భ‌వ‌నాలు త‌ప్ప‌, రాజ‌ధాని ఆన‌వాళ్లే లేవు. అది అంద‌రినీ నిరాశ‌ప‌రుస్తోంది. రెండేళ్ల క్రితం శంకుస్థాప‌న చేసిన‌ప్ప‌టికీ రెండ‌డుగులు కూడా వేయ‌లేక‌పోవ‌డం అసంతృప్తికి కార‌ణంగా ఉంది. సింగ‌పూర్, జ‌పాన్, లండ‌న్ అంటూ ఆఖ‌రికి రాజ‌మౌళి లాంటి వారిని కూడా రంగంలో దింపినా ఉప‌యోగం లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. తాజాగా అవినీతి ఆరోప‌ణ‌లు, రియ‌ల్ ఎస్టేట్ దందాలంటూ సీనియ‌ర్ ఐఏఎస్ లు, ఒక‌ప్పుడు స‌ర్కారులో కీల‌క భాగ‌స్వాములు ఐవైఆర్ కృష్ణారావు, అజ‌య్ క‌ల్లాం వంటి వారు ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డంతో అస‌లుకే ఎస‌రు వ‌స్తోంది. భ్ర‌మ‌రావ‌తి అంటూ ప‌లువురు భావించే ద‌శ‌కు చేరింది.

మ‌రోవైపు పోల‌వ‌రం కూడా చంద్ర‌బాబు ఎన్నిమార్లు రాసిపెట్టుకో మ‌ని చెప్పినా…చివ‌ర‌కు అది నిరాశ‌గా మారింది. నిర్వాసితుల‌కు పునరావాసం చెల్లించే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ప్రాజెక్ట్ గురించి ఎంత ప్ర‌చారం చేసినా ప‌ని పూర్త‌య్యే అవ‌కాశం లేదు. వ‌చ్చే ఏడాది జూన్ లో నీళ్లిస్తామ‌ని చెప్పిన హామీల‌కు నీళ్లొద‌ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. త‌ద్వారా పోల‌వ‌రం కూడా బాబు ఆశ‌ల‌కు గండికొట్టేసింది. ఇక ప‌ట్టిసీమ ప్ర‌చారం కాగ్ రిపోర్ట్ తో క‌ల‌వ‌రంగా మారింది. సీబీఐ విచార‌ణ‌కు సిద్ధ‌ప‌డుతుంద‌నే వాద‌న నిజ‌మ‌యితే మ‌రిన్ని చిక్కులు తెస్తుంది. కీల‌క ప్రాజెక్టుల‌న్నీ బాబు తీరుతో పేల‌వంగా మారిపోవ‌డం టీడీపీకి పెద్ద మైన‌స్ గా చెప్ప‌వ‌చ్చు. మిగిలిన విష‌యాల్లో ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులంటూ చేసిన ప్ర‌చారం కూడా పూర్తిగా ఢొల్ల అని, ఎన్ని యాత్ర‌లు చేసినా ప్ర‌జాధ‌నం వృధా త‌ప్ప ప‌నికొచ్చే ప‌రిస్థితి లేద‌ని ప‌లువురు భావిస్తున్నారు. బాబు వ‌స్తే జాబు వ‌స్తుంద‌న్న‌ది నినాదంగా మిగిలింది. నిరుద్యోగ భృతి అమ‌లుకావ‌డం లేదు. రుణ‌మాఫీ పేల‌వ‌మ‌ని తేలిపోయింది. అనుభ‌వం, స‌మ‌ర్ధ‌త వంటి అంశాల‌లో చంద్ర‌బాబు గురించి ఎంత‌గా ప్ర‌చారం చేసినా అవి ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. ఇక పెన్ష‌న్లు పెంపు, ఇత‌ర సంక్షేమ కార్య‌క్ర‌మాల గురించి ఎంతగా ప్ర‌చారం చేసినా ఓట్లు తెచ్చే అంశాలుగా క‌నిపించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలోనే బాబు గ్రాఫ్ ఇటీవ‌ల అమాంతంగా ప‌డిపోతోంది. దానిని నిల‌బెట్ట‌డానికి టీడీపీ, మీడియా వ‌ర్గాల స‌హ‌కారం ఉన్నా ఏమీ చేయలేని స్థితికి దిగ‌జారింది. ఇది మ‌రింతగా కుచించుకుపోవ‌డ‌మే త‌ప్ప‌, బాబుకి క‌లిసొచ్చే అంశాలు కాన‌రాక‌పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య. ఇలాంటి స్థితిలో టీడీపీ ఏం చెప్పి జ‌నాల్లోకి వెళ్లాల‌న్న‌ది అర్థం కాని సంక‌ట స్థితికి చేరుతున్న‌ట్టు చెప్ప‌వ‌చ్చు.


Related News

జ‌న‌సేన‌కు ఏమ‌య్యింది..?

Spread the loveఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. నోటిఫికేష‌న్ తో సంబంధం లేకుండానే పార్టీల‌న్నీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో మునిగిపోయాయి. జ‌న‌సేన కూడాRead More

చంద్ర‌బాబు సీనియారిటీపై మోడీ సెటైర్లు

Spread the loveఏపీ బీజేపీ శాఖ నిర్మించిన ప్ర‌జా చైత‌న్య స‌భ‌లో ప్ర‌ధాన మంత్రి మోడీ ప్ర‌సంగించారు. అక్ష‌ర‌క్ర‌మంలో, అన్నిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *