ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!

chandrababu
Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం హీటు రాజేస్తోంది. అన్ని పార్టీలు అదే డిమాండ్ తో సాగాల్సిన స్థితి వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు హోదాని రాజ‌కీయంగా నిల‌బెట్టుకోవ‌డంలో ఛాంపియ‌న్ ఎవ‌ర‌న్న‌దే ప్ర‌శ్న‌. అయితే తాజాగా ఏపీ బంద్ స‌క్సెస్ అయిన తీరు గ‌మ‌నిస్తే అధికార తెలుగుదేశం పార్టీ ఒంట‌రిగా మిగిలిన‌ట్టు క‌నిపిస్తోంది. ఏపీలో బీజేపీ ప్ర‌భావం అంతంత‌మాత్ర‌మే. వాస్త‌వానికి సింగిల్ గా ఎన్నిక‌ల‌కు వెళితే సింగిల్ సీటు కూడా సొంతంగా గెల‌వ‌డం ఆపార్టీకి క‌ష్ట‌మే. దానిని ఆపార్టీ నేత పైడికొండ‌ల మాణిక్యాల‌రావు కూడా అంగీక‌రించారు. తాము వెంట్రుక‌తో స‌మానం అని పేర్కొన్నారు. అయితే తాజాగా హోదా ఉద్య‌మం మాత్రం బీజేపీకి ఉన్న కొద్దిపాటి బ‌లం కోల్పోయే ప‌రిస్థితిని తీసుకొస్తే టీడీపీకి తీవ్ర న‌ష్టం చేకూర్చే ప్ర‌మాదం ఉంది. తాజాగా బంద్ దానికి సంకేతంగా భావించ‌వ‌చ్చు.

బంద్ కార‌ణంగా దాదాపు అన్ని ప‌క్షాలు ఏక‌మ‌య్యాయి. బీజేపీ, టీడీపీయేత‌ర పార్టీల‌న్నీ ఒకే తాటి మీద‌కు వ‌చ్చాయి. ఒకే నినాదం వినిపించాయి.హోదా ఉద్య‌మంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన విశేష స్పంద‌న‌తో హుషారుగా క‌నిపించాయి. ముఖ్యంగా రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో ఇది రెండో బంద్ కావ‌డం విశేషం. అయినా ప్ర‌జ‌లు మాత్రం పార్టీల‌కు స్వ‌శ్ఛందంగా స‌హ‌క‌రించారు. కొన్ని చోట్ల స‌ర్కారు ఆటంకాలు క‌ల్పించిన‌ప్ప‌టికీ జ‌నం మాత్రం హోదా కోసం ఉద్య‌మించారు. త‌ద్వారా పాల‌క‌ప‌క్షాల‌కు కొంత క‌ల‌వ‌రం పెంచారు. ఇప్ప‌టికే ఈ ఉద్య‌మంలో వెనుక‌బ‌డి ఉన్నామ‌ని భావిస్తున్న టీడీపీకి ఈ వ్య‌వ‌హారం కొంత త‌ల‌నొప్పిగా త‌యార‌య్యింది. విప‌క్షాల బంద్ కి ప్ర‌జ‌లు పెద్ద‌స్థాయిలో స్పందించి స‌క్సెస్ చేయ‌డంతో స‌త‌మ‌తం అవుతోంది.

దాంతో టీడీపీ కూడా ఆందోళ‌న ఉధృతం చేయాల‌ని నిర్ణ‌యించింది. అందులో భాగంగానే తాజాగా నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో దీక్ష‌ల‌తో పాటు రేప‌టి నుంచి నిత్యం కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. దాంతో టీడీపీ ఒంట‌రిగా మారిపోతున్న త‌రుణంలో ఈ స‌మ‌స్య నుంచి తేరుకునే మార్గాలు అన్వేషిస్తోంది. ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చూడాలి.


Related News

cbn

చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?

Spread the love2Sharesఅనుమానం వ‌స్తోంది. ఆయ‌న వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీసీఎంRead More

Pawan-kalyan-targets-Tv-channales

ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?

Spread the loveఆస‌క్తిక‌ర వార్ మొద‌ల‌య్యింది. అయితే ఈసారి ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కులు కాకుండా ఓ వైపు, మ‌రోవైపు జ‌న‌సేనానిRead More

 • రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం
 • వైసీపీది వాపా?..బ‌ల‌మా??
 • ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!
 • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
 • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
 • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
 • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
 • పవన్ కి పరిష్కారం అతడే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *