టీడీపీ అక్కడ కన్నేసింది..

chandrababu-naidu-650_650x400_41433788794
Spread the love

ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ పావులు కదుపుతోంది. మరోసారి పాగా వేయాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని నియోజకవర్గాలను మూడు కేటగిరీలుగా విడదీసి పథక రచన చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా మొత్తం 175 స్థానాలను మూడు కేటగిరీలుగా విడదీశారు. అందులో కీలక నియోజకవర్గాలుగా 47 స్థానాలను గుర్తించారు. టీడీపీకి అవి కంచుకోటలుగా భావిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల ఫలితాలను విశ్లేషించిన తర్వాత టీడీపీ థింక్ ట్యాంక్ వాటిని నిర్ణయించింది. ఆ తర్వాత వరుసలో గడిచిన ఎన్నికల్లో 5వేల తేడాతో ఓటమి పాలయిన నియోజకవర్గాల జాబితా తయారు చేశారు. వాటికితోడుగా గడిచిన ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసిన స్థానాలను కూడా చేర్చారు. మొత్తంగా వాటి సంఖ్య సుమారు 40వరకూ ఉన్నట్టు చెబుతున్నారు. వీటిని ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలుగా పేర్కొంటున్నారు. ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలని నిర్ణయించారు. ఆతర్వాత మిగిలిన సీట్లను విడదీసి ప్రాంతీయంగా రాయలసీమ ఎక్కువగా ఉండడంతో గ్రేటర్ సీమ మీద కేంద్రీకరించాలని నిర్ణయించారు.

ఇక టీడీపీ కంచుకోటలుగా బావిస్తున్నా జాబితా ఇలా ఉంది. వాటిలో ఆపార్టీ విజయపరంపర వివరాలు ఇవిగో

1 తెలుగుదేశం పార్టీ పెట్టినదగ్గరనుంచి ఓడిపోని నియోజక వర్గాలు -2
1 ) కుప్పం
2 ) హిందూపురం

2 తెలుగు దేశం పార్టీ 7 సార్లు గెలిచినా నియోజకవర్గాలు 16

1 ) ఇచ్ఛాపురం ( 1983 , 85 ,89 ,94 , 99 ,2009 , 2014 గెలుపు )
2 ) పలాస ( సోంపేట ) ( 2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
3 ) నెల్లిమర్ల ( భోగాపురం )( 2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
4 ) విజయనగరం (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
5 ) శృంగవరపు కోట (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
6 ) పాయకురావు పేట (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
7 ) కొవ్వూరు ( 1999 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
8 ) ఆచంట (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
9 ) నర్సాపురం (2009 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
10 ) ఉండి (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
11 ) గోపాల పురం (2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
12 నందిగామ ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
13 పొన్నూరు ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
14 శ్రీ కళహస్తి ( 2004 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
15 పెనుగొండ ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )
16 పతి కొండా ( 1989 తప్ప అన్ని ఎన్నికలు గెలుపు )

3 ) తెలుగుదేశం పార్టీ 6 సార్లు గెలిచినా నియోజకవర్గాలు -29

1 టెక్కలి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
2 శ్రీకాకుళం ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
3 ఎచ్చెర్ల ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
4 భీమిలి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
5 చోడవరం ( 1989 ,1999 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
6 మాడుగుల ( 2004 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
7 అనకాపల్లి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
8 నర్సీపట్నం ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
9 రంప చోడవరం ( 2009 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
10 తుని ( 2009 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
11 పాలకొల్లు ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
12 తణుకు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
13 తాడేపల్లిగూడెం ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
14 ఉంగుటూరు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
15 దెందులూరు ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
16 చింతలపూడి ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
17 గన్నవరం ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
18 గుడివాడ ( 1989 , 2014 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
19 అవనిగడ్డ ( 1999 ,2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
20 మైలవరం ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
21 జగ్గయ్య పేట ( 1999 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
22 పెనమలూరు ( కంకిపాడు ) ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
23 వినుకొండ ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
24 ప్రత్తిపాడు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
25 కోవూరు ( 1989 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
26 సత్యవేడు ( 1999 , 2004 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
27 ధర్మ వరం ( 1999 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
28 కళ్యాణ్ దుర్గ్ ( 1989 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )
29 ఎమ్మినగూరు ( 2004 , 2009 తప్ప మిగిలిన 6 సార్లు గెలుపు )

1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలవని నియోజకవర్గం పులివెందుల మాత్రమే …….






Related News

chandrababu naidu - PTI_1

తెగే వరకూ లాగితే చిరిగిపోతుంది బాబూ..!

Spread the loveకొన్ని వ్యవహారాలు అంతే. కక్కాలేక మింగాలేకా అన్నట్టుగా ఉంటాయి. తాజాగా టీటీడీ వివాదం కూడా అంతే. చంద్రబాబుRead More

tdp-bjp-fg647x450

బీజేపీకి ఒక నీతి, టీడీపీ, వైసీపీ మరో రీతి..

Spread the loveకర్ణాటకలో ఆశ్చర్యకర పరిణామాల నుంచి ఇంకా చాలామంది పూర్తిగా కోలుకోలేదు. అనూహ్యంగా బీజేపీ ప్రభుత్వం మూణ్ణాళ్లకే మూటRead More

 • బీజేపీ చారిత్రక తప్పిదం…!
 • చంద్రబాబు వెనకడుగు
 • బాబుకి మంట పెడుతున్న బీజేపీ
 • చంద్రబాబుకి శిక్ష తప్పదా..?
 • అవకాశాలు చేజార్చుకుంటున్న జగన్
 • అయోమయమా..అవగాహనా లోపమా?
 • చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?
 • ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *