Main Menu

డొల్ల జగన్ అనుకుంటే..బాబు గూట్లో ఉందట..

Spread the love

ఆశ్చర్యమే అయినా తాజాగా అందరినీ నోరెళ్లబెట్టేలా చేస్తోందీ వ్యవహారం. దేశవ్యాప్తంగా చర్చ రేకెత్తించిన డొల్ల కంపెనీలు వ్యవహారంలో జగన్ గుట్టు రట్టవుతుందని టీడీపీ అనుకూల వర్గాలన్నీ ఆశించాయి. ఏకంగా రెండు పత్రికలయితే పెద్ద పెద్ద వార్తలే రాసేశాయి. డొల్ల కంపెనీల బండారం బయటపడబోతోంది..జగన్ వ్యవహారమంతా వెలుగులోకి వస్తుందని జోస్యం చెప్పాయి. కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. దాంతో ఒక్కసారిగా సదరు మీడియా సంస్థలన్నీ సైలెంట్ మోడ్ లోకి వెళ్లాల్సి వచ్చింది.

వాస్తవానికి జగన్ వ్యవహారమంతా డొల్ల కంపెనీల సాయంతోనేనన్నది చాలాకాలంగా టీడీపీ చేస్తున్న విమర్శ. ఆ వర్గ పత్రికలు రాస్తున్న విషయం. కానీ వాస్తవం దానికి భిన్నంగా ఉన్నట్టు తాజాగా అధికారిక ప్రకటన రుజువు చేసింది. డొల్ల కంపెనీల జాబితాలో దేశంలోని పలువురు ప్రముఖుల పేర్లు వినిపించాయి. అందులో మాజీ సీఎంలు, శశికళ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. తెలుగు నేతల విషయానికి వస్తే పలువురు టీడీపీ నేతల పేర్లు ఉన్నాయి. అందులో కేంద్రమంత్రి సుజనా చౌదరి, చంద్రబాబు సమీప బంధువు , స్టూడియో ఎన్ చానెల్ అధినేత నార్నే శ్రీనివాస్ , బాబుకి బాగా దోస్తులుగా మెలిగే రెడ్డి ల్యాబ్స్ అధినేతల పేర్లు ఉన్నాయి. అదే సమయంలో పలువురు బీజేపీ నేతల పేర్లు కూడా ఉన్నాయి. కానీ సర్కారు వారి జాబితాలో జగన్ పేరు వినిపించలేదు.

దాంతో ఇప్పుడు టీడీపీ వర్గాలకు మింగుడుపడని పరిణామంగా డొల్ల కంపెనీలు మారిపోయాయి. అధికార పార్టీ ప్రచారం పూర్తిగా ఢొల్లతనంతో కూడినదని స్పష్టమవుతోంది. జగన్ ని బద్నాం చేయడానికి చేసిన ప్రచారమేనని వైసీపీ నేతలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. అదే సమయంలో మీడియా కూడా జగన్ కంపెనీలు కనిపించకపోవడంతో దాదాపుగా డొల్ల వ్యవహారాన్ని దాచిపెట్టడానికి ప్రాధాన్యతనిస్తోంది. ఆ విషయంలో నోరుమెదపకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. విపక్ష నేత పేరు వినిపించి ఉంటే చర్చోపర్చలు సాగించాలని సిద్ధపడిన వాళ్లకు సీన్ రివర్స్ కావడం గొంతులో వెలక్కాయపడ్డట్టయ్యింది. జగన్ సూట్ కేసు కంపెనీల వివరాలు వెల్లడవుతాయని ఆశిస్తే బాబు గూట్లో మిత్రులు, బంధువుల బండారం బయటపడడంతో ఆ వర్గీయులకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.


Related News

రాధా ముందు నుయ్యి..వెనుక గొయ్యి..!

Spread the love17Sharesవంగ‌వీటి రాధా వ్య‌వ‌హారం ఆసక్తిగా మారుతోంది. వైసీపీలో ఆయ‌న కొన‌సాగుతారా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మూడుRead More

చంద్ర‌బాబు షాకివ్వ‌బోతున్న ఎమ్మెల్యేల జాబితా ఇదే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్నిక‌ల వేడి క్రమంగా రాజుకుంటోంది. అన్ని పార్టీలు అభ్య‌ర్థుల విష‌యంలో క‌స‌ర‌త్తులు ప్రారంభించారు. గ‌తంRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *