Main Menu

జ‌న‌సేన‌లో పెను మార్పులు

Spread the love

జ‌న‌సేన రూటు మార్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌ల‌కు భిన్నంగా సాగుతోంది. కొత్త నీరుతో చ‌రిత్ర సృష్టించాల్సిన పార్టీ కొత్త సీసాలో పాత‌సారాను త‌ల‌పిస్తోందా అన్న సందేహాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా మార్చి 14 ఆవిర్భావ దినోత్స‌వ స‌భ నేప‌థ్యంలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అందుకు త‌గ్గ‌ట్టుగా ఉన్నాయి. తాజాగా పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీసుకున్న నిర్ణ‌యం అందులో భాగ‌మేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. జ‌నసేన పార్టీ సమన్వయకర్తగా మాదాసు గంగాధరాన్ని ప్ర‌క‌టించారు. ఆయ‌న సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్ లో ప‌నిచేసిన విష‌యాన్ని ఇక్క‌డ గుర్తు చేసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ రాజ‌కీయాల్లో ఆరితీరిన వ్య‌క్తిని జ‌న‌సేన కోఆర్డినేట‌ర్ గా నియ‌మించ‌డం ద్వారా ప‌వ‌న్ ఎలాంటి సందేశం ఇవ్వ‌ద‌ల‌చుకున్నార‌నే విష‌యంలో సందిగ్ధం ఏర్ప‌డింది.

వాస్త‌వానికి జ‌న‌సేన పార్టీ గ‌తంలో ప్ర‌జారాజ్యంతో పోలిస్తే పూర్తిగా భిన్నం. అప్ప‌ట్లో చిరంజీవి పార్టీ పెట్ట‌క‌ముందే ప‌లువురు ఉద్దండులు ఆయ‌న క్యాంప్ లో చేరారు. శిక్ష‌ణా త‌ర‌గ‌తులు స‌హా వివిధ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత వారు ఒక్కొక్క‌రుగా చేజారిపోవ‌డంతో చిరంజీవికి చిక్కులు త‌ప్ప‌లేదు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం దానికి భిన్నం. ఆయ‌న కేవ‌లం త‌న మిత్రుల‌తో క‌లిసి పార్టీ ప్రారంభించారు. స‌న్నిహిత మిత్రుడినే పార్టీ లో త‌న‌కు చేదోడుగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత అత‌డు ఏమ‌య్యారో ఎవ‌రికీ తెలియ‌దు. కొద్దికాలం క్రితం మారిశెట్టి రాఘ‌వ‌య్య ను కోశాదికారిగా ప్ర‌క‌టించారు. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న కూడా పూర్తిగా పార్టీ వ్య‌వ‌హారాల్లో ఉన్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. వారిద్ద‌రూ ఫ్రెష్ పొలిటీషియ‌న్స్ కావ‌డం విశేషం.

కానీ ఇప్పుడు దానికి భిన్నంగా ఇత‌ర పార్టీల నేత‌ల‌ను పార్టీలో చేర్చుకోవ‌డం, పైగా వారికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం గ‌మ‌నిస్తుంటే త్వ‌ర‌లో మ‌రిన్ని చేరిక‌ల‌కు ప‌వ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే చాలామంది ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల నేత‌లు జ‌న‌సేన వైపు ఆశాభావంతో చూస్తున్నారు. అలాంటి వారంద‌రినీ ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తే చేర్చుకుంటారా లేదా అన్న సందేహం ఇన్నాళ్లుగా చాలామందిని వేధించింది. కానీ తాజాగా మాదాసు గంగాధ‌రం నియామ‌కం త‌ర్వాత అవ‌న్నీ మారిపోతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇత‌ర పార్టీల నేత‌ల‌కు కూడా జ‌న‌సేన ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న ప‌వ‌న్ ప‌లువురు సీనియ‌ర్ల‌ను త‌న పంచ‌న చేర్చుకోవ‌డానికి పావులు క‌దుపుతున్న‌ట్టు ఈ ప‌రిణామం రుజువు చేస్తోంది. దాంతో చాల‌మంది ఆశావాహుల పంట పండిన‌ట్టే భావించ‌వచ్చు. అయితే ఇత‌ర పార్టీల‌లో ఉన్న నేత‌ల‌ను త‌న వైపు తిప్పుకోవ‌డం వ‌ల్ల పవ‌న్ కి ఒన‌గూరే ప్ర‌యోజ‌నం ఎంత‌, క‌లిగే న‌ష్టం ఎంత అన్న‌ది మాత్రం ప్ర‌స్తుతానికి సందేహామే అని చెప్ప‌వ‌చ్చు.చేర్చుకున్న నాయ‌కుల‌ను బ‌ట్టి ఫ‌లితాలుంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.






Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the loveతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *