చంద్రబాబుకి సానుకూలమేనా?

chandrababu cbn
Spread the love

ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ నేతలు ఇక తిరుగులేదంటున్నారు. తమ తడాఖా చాటామంటున్నారు. ప్రజలంతా తమనే ఆశీర్వదించాలంటున్నారు. సెమీ ఫైనల్ సత్తా చాటామంటున్నారు. ఇక ఫైనల్స్ లో కూడా తమకు పోటీ ఉండదంటున్నారు. వైసీపీలో చాలామంది నేతలు తమవైపు వచ్చేస్తారని అంచనా వేస్తున్నారు. అంతేకాదు అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా జగన్ మీద దాడి చేసి ప్రతిపక్షనేతను ప్రజల్లో పలుచన చేయడమే పనిగా పెట్టుకున్నారు. అంతేగాకుండా మిత్రపక్ష నేతలను కూడా వదలడం లేదు. తద్వారా 2019లో కూడా చంద్రబాబుకి పోటీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సైకిల్ జోరు ఆగదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే వాస్తవానికి నంద్యాల పరిస్థితి గమనించిన తర్వాత టీడీపీకి అంత సానుకూలత ఉందా అన్నది ఆలోచించాలి. నంద్యాల వైసీపీ సీటు అయినా ఇప్పుడు టీడీపీ చేజిక్కించుకోవడం విశేషమే. బలమైన ప్రయత్నాలు చేయడం, చివరకు విపక్ష నేత దాదాపుగా పక్షం రోజులు అక్కడే మకాం వేసినా భారీ మెజార్టీతో గెలవడం టీడీపీకి శుభసూచికం. పార్టీ శ్రేణులను నైతికంగా మంచి ఉత్తేజాన్ని నింపే విజయం. కానీ ఈ విజయం వెనుక టీడీపీ శ్రమ గమనిస్తే ఎంతగా ఆపసోపాలు పడిందో అర్థమవుతోంది. ఎన్ని ఎత్తులతో చంద్రబాబు ఈ విజయాన్ని సొంతం చేసుకున్నారో గమనిస్తే అధికార పార్టీ అవస్థలు అర్థమవుతాయి. సానుభూతితో సునాయాసంగా గెలవాల్సిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి టీడీపీ ఎంత కష్టపడిందో తెలుసుకుంటే నంద్యాల విజయం వెనుక మతలబు అర్థమవుతుంది

చంద్రబాబు మొత్తం మూడుసార్లు నంద్యాలలో పర్యటించారు. స్వయంగా ఉప ఎన్నికల బాధ్యతను తీసుకుని నిత్యం అమరావతి నుంచి సమన్వయం చేయడమే కాకుండా చివరి దశలో ప్రచారం బాధ్యత తీసుకున్నారు. ఆయన వియ్యంకుడు బాలయ్య కూడా ప్రచారం సాగించారు. వారితో పాటుగా క్యాబినెట్ లోని ప్రతీ మంత్రి గడిచిన నెల రోజుల్లో ఒక్కసారయినా నంద్యాలను దర్శించి వచ్చారు. లోకేష్ కూడా నోటిఫికేషన్ రాకముందు కర్నూలు, నంద్యాలలో పర్యటనలు చేశారు. కానీ ఆ తర్వాత ఆయన తెరవెనక్కి వెళ్లిపోయారు. ఇక దాదాపుగా డజను మంది మంత్రులయితే అక్కడే తిష్టవేశారు. నలగురుదైగురు మంత్రులు పూర్తిగా నంద్యాల చుట్టూ తిరిగారు. పోలింగ్ నాడు కూడా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అనుభవాలున్నాయి. అలా మొత్తంగా క్యాబినెట్ అంతా కేంద్రీకరించి, వేల కోట్ల రూపాయలతో నంద్యాలను తీర్చిదిద్దుతున్నామన్న ప్రచారం సాగించి, వాటితో పాటుగా వంద కోట్ల వరకూ ప్రలోభాలు, పంపిణీలకు ఉపయోగించి నంద్యాలను చేజిక్కించుకోవాల్సిన పరిస్థితి టీడీపీకి వచ్చింది.

ఏపీలో ప్రభుత్వం పట్ల ఉన్న ప్రజావ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉండడంతోనే చంద్రబాబు ఇలాంటి అసాధారణ రీతిలో ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. అంతగా అప్రమత్తమయితే తప్ప నంద్యాలను అందుకోలేకపోవడం టీడీపీ అసలు నైజాన్ని చాటుతోంది. అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు గానీ వాస్తవం మాత్రం దానికి భిన్నంగా ఉందనడంలో సందేహం లేదు. ఒక్క సీటు కాబట్టి, అందరూ కలిసి పట్టుబట్టారు. అదే సమయంలో అన్నిచోట్లా ఎన్నికలయితే ఎవరి గోల వారిదే అన్నట్టుగా మారుతుంది. అలాంటి సమయంలో ఎవరు నియోజకవర్గాన్ని వారే కాపాడుకోవడంలో నిమగ్నమవుతారు. అప్పుడు ఇంతటి జిమ్మిక్కులకు అవకాశం ఉండదు. అదే సమయంలో సానుభూతి కూడా తోడవుతోంది. తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలనే మాటలకు ఆస్కారం లేదు. అమరావతి, పోలవరం వంటి అంశాలే ముందుకొస్తాయి. అవన్నీ అరకొరగా కనిపిస్తే ప్రజలను సంత్రుప్తి పరచడం కష్టసాధ్యం అవుతుంది. ఎలా గట్టెక్కగలరన్నదే ప్రశ్న. అందుకే నంద్యాల విజయం వాపు మాత్రమే తప్ప బలం కాదని టీడీపీ ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.

అందుకే ప్రస్తుతానికి కేక్ లు కట్ చేసి విజయోత్సవాలు చేసుకున్నప్పటికీ ముందున్న సవాళ్లు గమనిస్తే టీడీపీ నేతలకు కలవరం కలగక మానదు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడకపోతే ఆ తర్వాత చేతులు కాలినా ఆశ్చర్యం లేదు.


Related News

bjp congress

బీజేపీకి మరో దెబ్బ

Spread the loveగుజరాత్ ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న బీజేపీకి మరో సమస్య ముందుకొచ్చింది అది కూడా ఇప్పటికే సామాజికరంగంలోRead More

jagan11509963809

జగన్ యాత్రలో కొత్త మలుపు…!

Spread the loveఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు పాదయాత్ర చేయడం ఆనవాయితీగా మారింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే దానిని చంద్రబాబుRead More

 • మరో రాజకీయ పార్టీ ఆలోచనలో ముద్రగడ
 • జగన్ లో ఎందుకీ మార్పు..?
 • చంద్రబాబు సామర్థ్యం మరచిపోయిన సమాజం..
 • చంద్రబాబుని ఆదర్శంగా తీసుకున్న జగన్
 • బాబు ఎత్తులు జగన్ పై ఎత్తులు
 • జగన్ అక్కడ గురిపెట్టాడు..
 • జగన్ తప్పు చేసినట్టేనా?
 • నియోజకవర్గాల పెంపు: నయా డ్రామా..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *