Main Menu

వైసీపీ కి లైన్ క్లియ‌ర్ చేసిన చంద్ర‌బాబు

MLC-polls-turned-into-a-proxy-war’-between-Chandrababu-Jagan-in-Kadapa
Spread the love

వైసీపీకి లైన్ క్లియ‌ర్ అయ్యింది. రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో విప‌క్షానికి సీటు క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. మూడు సీట్లకు జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మూడో స్థానం మీద క‌న్నేసిన చంద్ర‌బాబు ఆశ‌ల‌కు బీజేపీ గండికొట్టేసింది. కీల‌క‌మైన నలుగురు ఎమ్మెల్యేల ఓట్ల‌తో బీజేపీ ప్ర‌స్తుతం డిసైడ్ ఫ్యాక్ట‌ర్ అవుతోంది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిణామాల్లో ఆపార్టీ చంద్ర‌బాబుకి అండ‌గా నిలిచే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దాంతో టీడీపీ మూడో సీటు ఆశ వ‌దులుకుంది. ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌తో రంగంలో దిగాల‌ని దాదాపు నిర్ణ‌యించుకుంది. అన‌వ‌స‌రంగా ప్ర‌యోగాల‌కు వెళ్లి చేతులు కాల్చుకోవ‌డం క‌న్నా త‌మ సొంత బ‌లంతో రెండు సీట్లు ధీమాగా గెలుచుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని టీడీపీ అధినేత భావిస్తున్న‌ట్టు తాజా స‌మాచారం. దాంతో అవ‌స‌ర‌మైతే క్యాంప్ నిర్వహించాల‌ని భావించిన విప‌క్షానికి ఇది ఊర‌ట‌గానే భావించాలి.

వాస్త‌వానికి అసెంబ్లీలో బ‌లాబ‌లాల ప్ర‌కారం వైసీపీకి మూడో సీటు మీద ఎటువంటి అనుమానం లేదు. కానీ ఫిరాయింపుల‌తో పాటు, మ‌రికొంద‌రని ప్ర‌లోభ‌పెట్ట‌యినా మూడో సీటు కైవ‌సం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆశించారు. కానీ అనూహ్యంగా ప్ర‌త్యేక హోదా హెడ్ లైన్స్ లోకి రావ‌డంతో చంద్ర‌బాబు ఇరుక్కోవాల్సి వ‌చ్చింది. సంజీవిని కాద‌ని చెప్పిన నాయ‌కుడే మ‌ళ్లీ హోదా కోసం నిల‌బ‌డాల్సి వ‌చ్చింది. త‌ద్వారా జ‌గ‌న్ ఎజెండాకి చంద్ర‌బాబు ఫిక్స్ అయ్యార‌ని ప‌లువురు భావించే ప‌రిస్థితి వ‌చ్చింది. అదే స‌మ‌యంలో బీజేపీతో త‌గాదా తీవ్ర‌మ‌య్యింది. తాడో పేడో అంటూ సంకేతాలు నేప‌థ్యంలో వారి బంధం ఎట్ట‌కేల‌కు బీట‌లు వారుతోంది. ఈ నేప‌థ్యంలో మూడు సీట్లు తామే కైవ‌సం చేసుకోవాల‌ని భావించిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం మ‌న‌సు మార్చుకున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇక టీడీపీ రెండు స్థానాల‌కు మాత్ర‌మే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయాల‌న్న నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఏకగ్రీవం అవుతాయి. రాజ‌కీయ స‌మీర‌ణాలు కొంత వ‌ర‌కూ చ‌ల్లార‌తాయి. అదే స‌మ‌యంలో అభ్యర్థుల విష‌యంలో వైసీపీ అధికారికంగా ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డికి పెద్ద‌ల స‌భ‌లో బెర్త్ క‌న్ఫ‌ర్మ్ కాబోతోంద‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

cbn

కోరి క‌ష్టాలు కొనితెచ్చుకోవ‌ద్దు బాబూ..!

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి అనూహ్యంగా స్పందిస్తున్నారు. ఓ వైపు ఆయ‌న్ని వీరుడూ, శూరుడూ అంటూ ఓ వ‌ర్గం మీడియాRead More

ysrcp-party-flag-647x450

వైసీపీ సిట్టింగుల‌లో గెలిచేదెవ‌రు?

Spread the loveఎన్నిక‌ల వాతావ‌ర‌ణం స‌మీపిస్తోంది. మ‌రోసారి ముంద‌స్తు చ‌ర్చ మొద‌లుకావ‌డంతో అంద‌రి దృష్టి నియోజ‌క‌వ‌ర్గాల మీద ప‌డుతోంది. తాజాగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *