రజనీకాంత్ రాణిస్తాడా?

RAJANI
Spread the love

ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా మారింది తలైవా అభిమానులకు. రాజకీయ ఆరంగేట్రం గురించి ఊరించి ఊరించి..అనేక మార్లు ఉసూరుమనిపించిన రజనీకాంత్ ఎట్టకేలకు సొంత పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. భ్రష్టుపట్టిన రాజకీయాలను సరిదిద్దడానికి పోరాడకపోతే పిరికివాడనుకుంటారని చెబుతున్న రజనీ రణరంగంలో దిగడానికి సిద్ధమయ్యారు. కేవలం మీడియాకే భయపడతానని చెప్పిన రజనీకాంత్ దేశంలో దిగజారిన పరిస్థితులను చక్కదిద్దుతానని చెప్పుకొచ్చారు. తనకు కార్యకర్తలు కాకుండా కార్యదీక్షకులు కావాలని చెప్పిన దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దమని ప్రకటించి తమిళనాడు రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు.

నిజానికి రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం 1996లోనే జరగాలి. అప్పట్లో ప్రదాని పీవీ నరసింహరావుతో చర్చించిన తర్వాత తమిళనాడు సీఎం అభ్యర్థిగా రజనీకాంత్ ని ఖాయం చేశారు. కానీ ఆయన హఠాత్తుగా మనసు మార్చుకున్నారు. దాంతో ఆయన రాక రెండు దశాబ్దాలు ఆలశ్యమయ్యింది. ఇక ఇప్పుడు తమిళనాడులో జయలలిత మరణం తర్వాత పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. అధికార అన్నాడీఎంకేలో ముఖ్యమంత్రికి పట్టులేదు. పన్నీరు సెల్వాన్ని విశ్వసించే వాళ్లే లేరు. దాంతో దినకరన్ వర్గం బలపడుతున్నట్టు కనిపిస్తోంది. శశికళకు ఆదరణ మొదలవుతోంది. ఆర్కే నగర్ ఉఫ ఎన్నికల్లో సాధించిన అఖండ మెజార్టీ అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇక డీఎంకేలో సైతం అళగిరి ని అదుపు చేసినా స్టాలిన్ సారద్యం మీద పూర్తిస్థాయి విశ్వాసం క్యాడర్ లో ఏమేరకున్నదన్నది సందేహంగా కనిపిస్తోంది. దాంతో నేటికీ కరుణానిధినే ఆ పార్టీ ముందు పెడుతోంది. చివరకు ఆర్కే నగర్ లో డిపాజిట్ కోల్పోయే పరిస్థితి రావడంతో డీఎంకే శ్రేణులు కొంత ఢీలా పడ్డాయి. దాంతో అటు అధికార, ఇటు విపక్షాలలో సారధ్య సమస్య ఉన్నట్టు కనిపిస్తోంది. అందులోనూ నాయకులను చూసి ఓట్లు వేసి, ఏకపక్ష తీర్పులతో ముందుకు సాగే తమిళులకు గుర్తింపు ఉన్న నాయకుడు లేకపోతే పెద్దగా రుచించదు. దాంతో సంక్షోభ సమయంలో తానేంటో నిరూపించుకోవాలని రజనీకాంత్ ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది.

అయితే రజనీకాంత్ పూర్తిగా మోడీ డైరెక్షన్ లో సాగుతున్నారనే ప్రచారం తమిళనాడు ప్రజల్లో మొదలయ్యింది. ఇప్పటికే నోటా కన్నా తక్కువ ఓట్లతో బీజేపీని ఓడించి కసిని చాటుకున్న తమిళులకు రజనీ ఈ విషయంలో స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. లేకుంటే బీజేపీ బంటుగా ప్రత్యర్థులు చేసే ప్రచారానికి ఆయన తగిన రీతిలో వ్యవహరించలేకపోతే దెబ్బతినక తప్పదు. అదే సమయంలో కమల్ హాసన్ కూడా తెరంగేట్రం చేస్తే దాని ప్రభావం కూడా రజనీ మీద ఉంటుంది. సమకాలీకులైన ఇద్దరు పెద్ద స్టార్లు పొలిటికల్ ఫైట్ చేస్తే అది రజనీ పార్టీ ఆశలకు గండికొడుతుందనడంలో సందేహం లేదు. ఇంకా అనేకనేక సందిగ్ధాల మధ్య రజనీ మరో చిరంజీవిగా మారిపోతారా లేక పొలిటిక్స్ లోనూ సూపర్ స్టార్ లా చెలరేగుతారా అన్నది చూడాలి.


Related News

1515322707_mahesh-kathi-poonam-kaur-pawan-kalyan

కత్తి కథతో ఇరకాటంలో కాటమరాయుడు

Spread the loveఓ సినిమా క్రిటిక్ విమర్శలకు పవన్ ఫ్యాన్స్ స్పందించిన తీరు చివరకు చినికి చినికి గాలివానలా మారింది.Read More

andhra_pradesh_ysrcp_tdp_bjp1478362766

కాంగ్రెస్ తో చేతులు కలిపి మోడీకి షాకిచ్చిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం పార్టీ షాకిచ్చింది. మోడీకి గట్టి ఝలక్ ఇచ్చింది. దాంతో కమలదళం కుతకుతలాడుతోంది. కాంగ్రెస్ తో చేతులుRead More

 • మళ్లీ పాత నినాదం అందుకుంటున్న టీడీపీ
 • జగన్ జీవితంలో కీలకంగా మారబోతున్న ఏడాది
 • రజనీకాంత్ రాణిస్తాడా?
 • వైసీపీ విఫలమవుతోంది..
 • బాబుకి బ్రేకప్ చెప్పాలనే తపనలో బీజేపీ
 • బాబు ఆశలపై గుజరాత్ ఎఫెక్ట్
 • బాబుపై కేటీఆర్: వెల్ కమ్ కాంబినేషన్
 • బాబుని మారిస్తేనే మోడీ కరుణ!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *