పీకే రిపోర్ట్స్ తో జగన్ కి ఝలక్

pk jagan
Spread the love

వరుస పరిణామాల తర్వాత కూడా వైఎస్ జగన్ పాఠాలు నేర్చుకుంటున్నట్టు కనిపించడం లేదు. కీలకనేతలను కూడా చేజార్చుకునే పరిస్థితిని చేేజేతులా కొనితెచ్చుకుంటున్నాడు. పార్టీలో ఎమ్మెల్యే జారిపోతున్న వేళ, నాయకుడిని నమ్ముకున్న వాళ్లు అనివార్యంగా చంద్రబాబుతో చేతులు కలపాల్సి రావడం ఆయన వైపల్యంగానే భావిస్తున్నారు.

వైసీపీని అన్నిరకాలుగా దెబ్బకొట్టడానికి చంద్రబాబు రకరకాల స్కెచ్ వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే జగన్ నిర్ణయాలు కూడా బాబు ఆశలకు తగ్గ్టటుగా కనిపిస్తోంది. తాజాగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఉదంతం దానికి ఉదాహరణ. ఈశ్వరి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. సభలోనూ, బయటా కూడా బలంగా నిలబడ్డారు. అనేక ఆటంకాలు ఎదురయినా ముందుకు సాగారు. ఒకరిద్దరు మహిళా ఎమ్మెల్యేలు చేజారినా ఈశ్వరి చలించలేదు. అలాంటిదిప్పుడు అనివార్యంగా ఆమె పార్టీని వీడాల్సి రావడం వైసీపీలో పరిణామాలకు అద్దంపడుతోంది. చివరకి ప్పుడు విశాఖ మన్యంలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోవడంతో మన్యంలో ఆ పార్టీ ఖాళీ కావాల్సి వస్తోంది.

వాస్తవానికి ఇప్పటికిప్పుడు కంభం రవిబాబు లాంటి వారికి పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈశ్వరి గట్టిగా పట్టుబడుతున్నప్పుడు కొంత ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది. కానీ పార్టీలో కొందరి మాటలకే ప్రాధాన్యం ఇస్తూ, జగన్ మీద నమ్మకంతో సాగుతున్న వారికి తగిన గుర్తింపు దక్కుతున్న దాఖలాలు కనిపించడం లేదని ఈశ్వరి వాపోతున్న దానికి తగ్గట్టుా నిర్ణయాలుండడం విశేషంగా మారింది. బొత్సా సత్తిబాబు సూచనలతో పాటు ప్రశాంత్ కిషోర్ బ్రుందం సలహాలతో జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని తెలుస్తోంది. కానీ వాస్తవంగా పీకే బ్రుందం నిర్ణయాలు అనేక చోట్ల పార్టీ కార్యకర్తల అభిప్రాయాలకు భిన్నంగా ఉంంటున్నాయన్న వాస్తవం జగన్ గ్రహిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కొద్దిరోజుల క్రితం రాజమహేంద్రవరంలో కందుల దుర్గేష్ విషయంలో కూడా పీకే చెప్పడంతో జగన్ తీసుకున్న నిర్ణయం బూమరాంగ్ అయ్యింది. చివరకు దుర్గేష్ తిరగబడడంతో నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చింది. తాజాగా పాడేరులో అదే పరిస్థితి దాపురించింది. ఇవన్నీ క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకున్న , జగన్ వెంట నడిచిన వారిని ఇబ్బంది పెట్టే పరిణామాలుగా మారుతున్నాయి. ఇప్పటికైనా గ్రహించకపోతే వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవనే చెప్పవచ్చు.


Related News

janasena pawan kalyan

ఒక్కరోజుకే మరచిపోతే ఎలా పవన్?

Spread the loveనాలుగు రోజుల పర్యటన కోసం ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, మధ్యాంధ్ర ప్రాంతాల్లో పర్యటనలు పూర్తి చేసుకుని దక్షిణాంధ్రRead More

pawna kalyan

పవన్ లక్ష్యం అదేనా..?

Spread the loveజనసేన అధినేత పవన్ కల్యాణ్ హఠాత్తుగా తెరమీదకు వచ్చి ఆశ్చర్యం కలిగించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఆయనRead More

 • రెంటికీ చెడ్డ రేవడిలా చంద్రబాబు
 • బాబుకి వ్రతం చెడ్డా ఫలితం దక్కుతుందా..?
 • కొత్త కాక పుట్టించిన చంద్రబాబు
 • చేతులెత్తేసిన చంద్రబాబు..
 • జగన్ ఫోటోలపై క్లారిటీ వచ్చింది…
 • మొక్కుబడి తంతుగా ఏపీ అసెంబ్లీ
 • జగన్ కి డిప్యూటీ సీఎం మీద అంత ప్రేమ ఎందుకో?
 • పీకే రిపోర్ట్స్ తో జగన్ కి ఝలక్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *