Main Menu

నువ్వా నేనా? అంటున్న బాబు, జ‌గ‌న్!

Spread the love

ప్ర‌జ‌ల అభిప్రాయాల‌ను మ‌ల‌చాలంటే ముందు మీడియాను త‌మ చెప్పు చేతల్లో ఉంచుకోవ‌డం అవ‌స‌ర‌మ‌ని పాల‌కులు భావిస్తున్నారు. అందుకే గ‌డిచిన కొన్నేళ్ల‌లో మీడియాకు ఎన‌లేని ప్రాధాన్య‌త పెరిగింది. దానికి త‌గ్గ‌ట్టుగానే మీడియాను నియంత్రించ‌డానికి నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. న‌యానో..భ‌యానో త‌మ దారికి తెచ్చుకోవ‌డానికి శ్ర‌మిస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియాను భ‌య‌పెట్టి, ప్రింట్ మీడియాను ప్ర‌లోభ‌పెట్టి దారికి తెచ్చుకోగ‌లిగినా సోష‌ల్ మీడియా మాత్రం చెవిలో జోరీగ‌లా మారింది. బాబు విధానాల వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌డుతోంది.

దాంతో ఇప్పుడు ప్ర‌భుత్వ పెద్ద‌ల దృష్టి సోష‌ల్ మీడియా మీద ప‌డింది. ఏపీలో చంద్ర‌బాబు ఓ అడుగు ముందుకేశారు. చెప్పిన‌ట్టుగానే సోష‌ల్ మీడియాను క‌ట్ట‌డి చేసే య‌త్నంలో ఉన్నారు. ఇంటూరి ర‌వికిర‌ణ్ అరెస్ట్ తోనైనా అంతా సైలెంట్ అవుతార‌ని ఆశిస్తే దానికి భిన్నంగా ఫ‌లితాలు ఉండ‌డంతో ఇప్పుడు ఇప్పాల ర‌వీంద్ర వ‌ర‌కూ వ్య‌వ‌హారం న‌డిపించారు. చివ‌ర‌కు మార్కేండ‌య క‌ట్జూ వంటి వాళ్లు మండిప‌డ‌డంతో వ్య‌వ‌హారం జాతీయ స్థాయికి చేరిన‌ట్ట‌య్యింది. దాంతో టీడీపీ పెద్ద‌ల‌కు మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది. టీడీపీ ప్ర‌భుత్వాన్ని భ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేయ‌డంతో క‌ల‌వ‌రం మొద‌య్యింది.

సుదీర్ఘ విరామం త‌ర్వాత మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చిన ప‌రకాల ప్ర‌భాక‌ర్ ఏం చెప్పిన‌ప్ప‌టికీ, ఏపీ హోం మంత్రి వార్నింగ్ ఇచ్చేశారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పోస్టులు ఇష్టారాజ్యంగా పెడితే స‌హించ‌మంటూ చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో తొలుత మండ‌లిని కించ‌ప‌రిచార‌ని, ఆత‌ర్వాత అనిత‌ను ఏదో అన్నార‌ని చెప్పిన టీడీపీ పెద్ద‌లే ఇప్పుడు ఈ కేసుల‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని అంగీక‌రించారు. ఇష్ట‌మొచ్చిన‌ట్టు పోస్టులు పెడితే ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోదు క‌దా అంటూ వ్యాఖ్యానించడం ద్వారా ఈ కేసులున్నీ ప్ర‌భుత్వ‌మే పెట్టిస్తుంద‌నే విష‌యాన్ని ప‌ర‌కాల‌, రాజ‌ప్ప అంగీక‌రించారు.

అయితే ఈ కేసుల త‌ర్వాత సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వ్య‌తిరేక‌త త‌గ్గుతుంద‌ని బావించ‌డం టీడీపీ పెద్ద‌ల అవివేకానికి అద్దంప‌డుతోంది. గ‌డిచిన మూడు నాలుగు రోజులుగా చూసినా మ‌రింత ప‌గ‌డ్భందీగా, మ‌రింత ప‌క్కాగా, విధానాల వైఫ‌ల్యాన్ని ఎండ‌గ‌ట్ట‌డానికి నెటిజ‌న్లు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా వైసీపీ సోష‌ల్ మీడియా విభాగంలో కూడా మార్పులు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. వాస్త‌వానికి సోష‌ల్ మీడియాలో టీడీపీ మీద వైసీపీకి సంపూర్ణ ఆధిక్యం క‌నిపిస్తోంది. దానికి చెక్ పెట్ట‌డానికి టీడీపీ వేసిన అడుగులకు త‌గ్గ‌ట్టుగా వైసీపీ బృందాలు అడ్డ‌గోలుగా వ్య‌వ‌హరించి చిక్కుల్లో ప‌డ్డాయి. చివ‌ర‌కిప్పుడు ప‌రిస్థితులు గ‌మ‌నించిన త‌ర్వాత కొంత వ్యూహం మార్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ప‌ద్ధ‌తిగా విమ‌ర్శ‌లు చేసి ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో సోష‌ల్ మీడియాలో పెత్త‌నం కోసం ఇరు పార్టీలు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కొత్త పుంత‌లు తొక్కుతున్నాయి.


Related News

బాబుని కేసీఆర్ మాత్ర‌మే కాపాడాలి..!

Spread the love8Sharesఏపీలో తెలుగుదేశం రూటు మార్చింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే టీడీపీ అధినేత‌తో పాటు పార్టీ శ్రేణుల ధోర‌ణి మారుతోంది.Read More

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *