కేసీఆర్ తో కేశవ్: కలచివేత ఎవరికి?

kcr kesav
Spread the love

తెలుగుదేశం రాజకీయాల్లో తాజా పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా అటు జనసేనతోనూ, ఇటు టీఆర్ఎస్ తో నూ సంబంధాలపై చంద్రబాబు వైఖరితో నేతలు సతమతం అవుతున్నారు. జనాల్లో తాము పలుచన అవుతున్నామని బేజారెత్తుతున్నారు. తాజాగా పితాని సత్యాన్నారాయణను జనసేన విషయంలోనూ, పయ్యావుల కేశవ్ ని కేసీఆర్ విషయంలో చంద్రబాబు తప్పుబట్టినట్టు వచ్చిన వార్తలతో టీడీపీ నేతల్లో అలజడి కనిపిస్తోంది.

కేసీఆర్‌ పర్యటన సందర్భంగా తన వైఖరిని చంద్రబాబు తప్పుబట్టడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్‌ మనస్తాపానికి గురయ్యారు. జరిగిన సంఘటనల్లో తన తప్పేమీ లేదని, అధినేతకు సరైన సమాచారం అందకపోవడం వల్లే తనను తప్పుబట్టే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ’పరిటాల కుటుంబంలో పెళ్లికి నేనూ ఒక అతిథిలా వచ్చాను. మధ్యలో కేసీఆర్‌ కనిపిస్తే మర్యాదపూర్వకంగా ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయాను. ఆయనే తనతో వచ్చిన ఒక పోలీస్‌ అధికారిని నా వద్దకు పంపి పిలిపించారు. పిలిచినప్పుడు వెళ్లకపోతే బాగుండదని వెళ్లాను. అక్కడ చాలా మంది ఉండడంతో ఆయన నా చేయి పట్టుకుని పక్కకు తీసుకెళ్లి విడిగా కూర్చోపెట్టి మాట్లాడారు. నా అంతట నేనుగా వెళ్లి ఆయనతో ఏకాంత భేటీ జరపలేదు. సమాచార లోపం వల్ల నేను మాట పడాల్సి వచ్చింది’ అని ఆయన వారితో అన్నారు.

అంటే తప్పు లేకుండానే తన పరువు తీసేలా చంద్రబాబు మాట్లాడడం పట్ల కేశవ్ కలత చెందుతున్నట్టు కనిపిస్తోంది. పైగా హీరోలమనుకుంటే జీరోలను చేస్తానని హెచ్చరించడం కూడా మరింత ఆగ్రహానికి కారణంగా ఉందని తెలుస్తోంది. ఈ పరిణామాలు ఆపార్టీకి టీ కప్పులో తుఫానే అయినప్పటికీ ఆసక్తిదాయకంగా మాత్రం ఉన్నాయనడంలో సందేహం లేదు.


Related News

DMjD9f8VQAATMr7

అయినా..బాబు మారలేదు

Spread the loveమనిషి మారలేదు..అతని తనివి తీరలేదు అంటూ సినిమా దర్శకుడు రాసిన పాటను ఇక్కడ గుర్తు చేసుకుంటే చంద్రబాబుRead More

chandrababu-ravanth-reddy-647x450

బాబు ఖాతాలో మరో వికెట్ అంతే…!

Spread the loveతెలంగాణా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సొంత గూటిని వదిలి కాంగ్రెస్ పంచన చేరుతుండడం సంచలనంRead More

 • కేసీఆర్ వ్యూహం..బాబు జాతీయ హోదా గల్లంతు
 • వైసీపీ వ్యూహానికి బుట్టా బలి..
 • చంద్రబాబుకి ఓ ఇంటాయన లేఖ
 • మోడీకి మరో షాక్, దేశద్రోహులకు గ్రీన్ సిగ్నల్
 • కేసీఆర్ తో కేశవ్: కలచివేత ఎవరికి?
 • అమిత్ షా అవినీతికి ఆధారాలివిగో…
 • పవన్ కల్యాణ్ పొజిషన్ ఏంటి?
 • ఇదే మాట మరొకరు అనుంటే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *