Main Menu

ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?

Spread the love

ఆస‌క్తిక‌ర వార్ మొద‌ల‌య్యింది. అయితే ఈసారి ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కులు కాకుండా ఓ వైపు, మ‌రోవైపు జ‌న‌సేనాని ఉన్నారు. జ‌న‌సేనానికి ఉన్న ఫాలోయింగ్ చాలామందికి తెలియ‌న‌ది కాదు. అది బాగా తెలుసు కాబ‌ట్టే మీడియా కూడా ఆయ‌న‌కు విప‌రీత‌మైన ప్ర‌చారం క‌ల్పించేది. కానీ అదంతా కేవ‌లం చంద్ర‌బాబుతో సన్నిహితంగా ఉన్నంత వ‌ర‌కూ మాత్ర‌మేన‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి త్వ‌ర‌గానే అర్థ‌మ‌య్యింది. గ‌డిచిన నెల రోజులుగా సాగుతున్న ప్ర‌చారంతో ఆయ‌న పూర్తిగా తెగించిన‌ట్టుగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబుని విమ‌ర్శించ‌గానే త‌న ప‌ట్ల మీడియా ప్ర‌ద‌ర్శించే అస‌లు రూపం అర్థ‌మ‌యిన ఆయ‌న స‌హించ‌లేని స్థితికి చేరుకుంది. దాంతో టాలీవుడ్ లో త‌గాదా శ్రీరెడ్డితో మొద‌ల‌యిన‌ప్ప‌టికీ శ్రీనిరాజు వ‌ర‌కూ వ‌చ్చే సింది. అందులో ప‌వ‌న్ పుణ్యాన వ్య‌వ‌హారం ఇప్పుడు తీవ్ర‌రూపం దాల్చేసింది.

వాస్త‌వానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్లీన్ ఇమేజ్ ఉన్న నేత‌. కేవ‌లం మూడు పెళ్లిళ్లు చేసుకున్నార‌నే వ్య‌క్తిగ‌త విమ‌ర్శ త‌ప్ప‌, సామాజిక అంశాల‌లో ఆయ‌న మీద వేలెత్తి చూపించే అవ‌కాశం లేదు. కానీ చంద్రబాబుని స‌మ‌ర్థించ‌డం, అనేక స‌మ‌స్య‌ల్లో వేలు పెట్టి వదిలేయ‌డం, ఆవేశంతో స్పందించినా..ఆ త‌ర్వాత చ‌ల్లారిపోవ‌డం వంటి అనేక కార‌ణాల‌తో రాజకీయంగా ఆయ‌న ప్యాకేజీ క‌ళ్యాణ్ అనే విమ‌ర్శ‌ల‌ను సామాన్యుల సైతం విశ్వ‌సించే ప‌రిస్థితి వ‌చ్చేసింది. తాజాగా ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం పేర్కొన్న‌ట్టుగా బాబు విష‌యంలో ప‌వ‌న్ చేసిన పాపం..ఎన్ని న‌దుల్లో స్నానం చేసినా పోద‌నే వాద‌న కూడా ఉంది.

అదే స‌మ‌యంలో ప‌వ‌న్ మీడియా మీద యుద్ధం చేయ‌డానికి సన్న‌ద్ధం కావ‌డాన్ని చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఇన్నాళ్ల‌కు మీడియా విష‌యంలో నేరుగా గురిపెట్టిన ఓ బాధితుడిగా ఆయ‌న క‌నిపిస్తున్నారు. కేవ‌లం రాజ‌కీయంగా ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేయ‌డం కోసం ఏకంగా ప‌వ‌న్ త‌ల్లిని తెర‌మీద‌కు తీసుకురావ‌డాన్ని చాలామంది స‌హించ‌డం లేదు. అలాంటి స‌మ‌యంలో ఆయ‌న ప్రారంభించిన మీడియా పై యుద్ధానికి మంచి స్పంద‌నే వ‌చ్చింది. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద దానిని నిల‌బెట్ట‌డానికి త‌గ్గ‌ట్టుగా హూందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. ఆయ‌న వ్య‌క్తుల మీద గురిపెట్టి అస‌లు లోపాల‌ను వ‌దిలేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. శ్రీనిరాజు, ఓపెన్ హార్ ఆర్కే, రియ‌ల్ అజ్ఞాత‌వాసి ర‌వి ప్ర‌కాష్ అంటూ ప‌వ‌న్ చేస్తున్న కామెంట్స్ లో హూందాత‌నం లోపిస్తోంది. ఆద‌ర్శ‌నేత‌గా ఎద‌గాల్సిన స‌మ‌యంలో ఆయ‌న చ‌వ‌క‌బారు వ్యాఖ్య‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ప్ర‌ధానంగా ట్విట్ట‌ర్ లో ప‌వ‌న్ చేస్తున్న ట్వీట్లు తీవ్ర ప‌రిణామాల‌కు అవ‌కాశం ఇస్తున్నాయి. తాజాగా టీవీ9 య‌జ‌మాని శ్రీనిరాజు లీగ‌ల్ నోటీసులు కూడా ప‌వ‌న్ ట్వీట్ల‌ను ప్ర‌స్తావించ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ గ‌తంలో ర‌వి ప్ర‌కాష్ కాళ్లు మొక్కుతున్న ఓ వ్య‌క్తి వీడియో, ర‌వి ప్ర‌కాష్ భార్య ప్ర‌స్తావ‌న వంటి విష‌యాల‌ను తెర‌మీద‌కు తీసుకురావ‌డం ద్వారా ప‌వ‌న్ త‌న స్థాయిని తానే త‌గ్గించుకుంటున్నారా అన్న అభిప్రాయం క‌లుగుతోంది. టాలీవుడ్ స్టార్ గా ఆయ‌న చేసే కొన్ని చేష్టాలు జ‌నాల‌కు రుచిస్తాయి గానీ, రాజ‌కీయ పార్టీ అధినేత‌గా ఆయ‌న కొంత ప‌రిణ‌తితో వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే అభిమానుల‌ను అల‌రించ‌వ‌చ్చు గానీ, చాలామందిని సంతృప్తిప‌ర‌చ‌డం సాధ్యం కాదు. కాబ‌ట్టి ప‌వ‌న్ చేప‌ట్టిన పోరాటానికి ఉన్న ఆద‌ర‌ణ‌ను స‌క్ర‌మ‌మార్గంలో న‌డిపితే కొంత ఫ‌లితం రావ‌చ్చు. గానీ ఇలాంటి చర్య‌లు అవ‌కాశాల‌ను చేజార్చుకునేలా చేస్తాయ‌న్న‌ది గ్ర‌హించాలి.


Related News

ప్రశ్నార్థ‌కంగా ప‌వ‌న్ ప‌య‌నం?

Spread the loveరాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాజ‌కీయాల్లో శ‌త్రువులు, మిత్రులు కూడా శాశ్వ‌తంగా ఉండ‌రు. కానీ గ‌త ఏడాది మార్చిలోRead More

ష‌ర్మిళ మ‌ళ్లీ ఎందుకు బ‌య‌ట‌కొచ్చారు

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి త‌న వ్య‌క్తిత్వం మీద జ‌రుగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *