Main Menu

పవన్ పథకం పారుతుందా..

Spread the love

ఏపీ రాజకీయాల్లో జనసేన వ్యవహారాలు నిత్యం ఆసక్తిగానే ఉంటాయి. అసలు ఆపార్టీ తీరే విభిన్నంగా ఉంటుంది. ఇప్పటికీ ఏకవ్యక్తి పార్టీగానే కనిపిస్తోంది. నిర్మాణం మాట పక్కన పెడితే నేటికీ కమిటీలు, కార్యకర్తలు కనిపించడం లేదు. పరీక్షలు పెట్టి ఎంపిక చేసిన వాళ్లకు కూడా భవితవ్యం బోధపడడం లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరోసారి ప్రత్యేక హోెదా డిమాండ్ ముందుకు తెచ్చారు. సొంత పార్టీ నిర్మాణం విషయంలో నాన్చుతున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా వివిధ పార్టీలు, నాయకులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దానికి తగ్గట్టుగా లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో మంతనాలకు సిద్ధమవుతున్నారు.

వాస్తవానికి ఏపీలో వివిధ పక్షాలు ప్రస్తుతం ఆందోళనలో ఉన్నాయి. అలాంటి సమయంలో అందరినీ కలిపి ఒక తాటి మీదకు తీసుకురావడం అత్యంత అవసరం అని చాలామంది భావిస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఆ పనిచేస్తారా అన్నది సందేహం. దానికి కారణం కూడా లేకపోలేదు నేటికీ పవన్ కళ్యాణ్ టీడీపీతో దోస్తీ సాగిస్తున్నారు. పైగా వీలయిన అన్ని సందర్భాల్లో చంద్రబాబుని అభినందిస్తున్నారు. అలాంటి చంద్రబాబు కారణంగానే ఏపీకి కనీస హక్కులు కూడా రావడం లేదన్నది చాలామంది అభిప్రాయం. చివరకు బీజేపీ నేతలు కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు. అలాంటి సమయంలో చంద్రబాబు సన్నిహితుడిగా ఉండి పవన్ కల్యాణ్ ఏపీ ప్రజలు సాగిస్తున్న సమరానికి నాయకత్వం వహిస్తారా అనే అనుమానం తలెత్తక మానదు.

పైగా పార్టీ ఓటమి చవిచూడగానే రద్దు చేసుకుని, మళ్లీ పురుగు పోసిన జేపీ లాంటి వారికి ప్రజల్లో ఆదరణ ఇటీవల బాగా తగ్గింది. ఉండవల్లి వంటి వారి వాదనకు జేపీకి పొంతనే లేదు. ఉదాహరణకు పోలవరం ముందుకు సాగడం లేదని ఉండవల్లి అంటుంటే, అది బాగా జరుగుతుందని కితాబులిచ్చిన ఘనత జేపీది. అలాంటి విభన్న మనస్తత్వాల వ్యక్తులను కలుపుకుని ఏకతాటి మీద తీసుకువస్తారని, అంత సామర్థ్యం జనసేనానికి ఉందా అంటే సమాధానం కష్టమే. అంతేగాకుండా సరిగ్గా బంద్ కి కొన్ని గంటల ముందు పవన్ జేఏసీ నినాదంతో ముందుకు రావడం వెనుక ప్రత్యేక పథకం ఉండి ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఏపీలో ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని పక్కదారి పట్టించే ఆలోచన ఉందా అంటున్న వాళ్లు కూడా లేకపోలేదు. దానికి తగ్గట్టుగా పవన్ కూడా ప్రజలంతా రోడ్డు మీద ఆందోళన చేస్తుంటే ఓ పార్టీ నేతగా ఆయన మాత్రం హైదరాబాద్ లో సేద తీరుతుండడం విశేషం. గతంలో రిపబ్లిక్ డే నాడు విశాఖలో ఇచ్చిన ఉద్యమం సందర్భంగా కూడా ఆయన అదే పనిచేశారు. ఇప్పుడు కూడా ప్రజలు బంద్ పాటిస్తుంటే కేవలం ప్రకటనల్లో మద్ధతిచ్చిన జనసేనాని దానికి దూరంగా ఉండడం విస్మయకరంగా మారింది. మొత్తంగా ఏపీలో జనసేన పథక రచన ఫలిస్తుందో లేదో చూడాలి.


Related News

ప్రశ్నార్థ‌కంగా ప‌వ‌న్ ప‌య‌నం?

Spread the loveరాజ‌కీయాలు శాశ్వ‌తం కాదు. రాజ‌కీయాల్లో శ‌త్రువులు, మిత్రులు కూడా శాశ్వ‌తంగా ఉండ‌రు. కానీ గ‌త ఏడాది మార్చిలోRead More

ష‌ర్మిళ మ‌ళ్లీ ఎందుకు బ‌య‌ట‌కొచ్చారు

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సోద‌రి మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చారు. ఈసారి త‌న వ్య‌క్తిత్వం మీద జ‌రుగుతున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *