అనంత నుంచి పవన్ ఏం ఆశించారో తెలుసా

pawan91513042592
Spread the love

సినిమాలలో సక్సెస్ లు కనిపించడం లేదు. అదే సమయంలో రాజకీయంగా సక్సెస్ అయ్యే అవకాశాలున్నా పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు భిన్నంగా సాగుతున్నారు. వరుసగా గడిచిన రెండు నెలలుగా పవన్ వ్యవహారం పొలిటికల్ గా ఆయన గ్రాఫ్ పడిపోవడానికి కారణంగా మారుతోంది. పాఠాలు నేర్చుకోకపోతే జనసేన క్రమేణా కష్టాల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. సైన్యం ఉన్నా వినియోగించుకోలేని జనసేనానిగా పవన్ నిలిచిపోతారని చెప్పక తప్పదు.

ఏపీలో చంద్రబాబుకి ప్రతికూలత తప్పేలా లేదు. అదేసమయంలో ప్రతిపక్షానికి రావాల్సినంత మైలేజీ దక్కడం లేదు. దానికి అనేక కారణాలు ఉండవచ్చు గానీ, మధ్యలో రాజకీయంగా నిలదొక్కుకోకవడానికి పవన్ కి ఇవన్నీ సానుకూల పరిణామాలే. కానీ సొమ్ము చేసుకునే సత్తా లేకపోవడంతో ఆయన చతికిలపడక తప్పదా అన్న సందేహాలు వేగంగా పెరుగుతున్నాయి. చివరకు పవన్ కళ్యాణ్ వీరాభిమానులు కూడా ఆయన చేష్టలతో రాజకీయంగా ఢీలా పడిపోతామేమోనన్న అభిప్రాయంతో కనిపిస్తున్నారు.

తొలుత జనసేన అనగానే జోష్ గా కనిపించిన వారు కూడా ఇప్పుడు కొంత సందిగ్ధంలో కనిపిస్తున్నారు. పవన్ ఛరిష్మాతో తమ పొలిటికల్ కెరీర్ ప్రారంభిద్దామని అనుకున్న యువత కూడా సంశయం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణా పర్యటనలో కేసీఆర్ ని కీర్తించడం ద్వారా చాలామందిని నిరుత్సాహపరిచిన పీకే, ఆ తర్వాత అనంతపురంలో ఏకంగా టీడీపీ ఆఫీసులో అడుగుపెట్టడం ద్వారా విస్మయపరిచారు. టీడీపీ పెద్దలతో వరుస భేటీలు నిర్వహించి నిరాశపరిచారు. పాలకపక్షాలతో రాసుకు పూసుకు తిరిగితే ప్రజలను ఏరకంగా సంత్రుప్తిపరచగలమనే ప్రశ్న అభిమానుల నుంచి వస్తోంది.

అయితే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నారన్నది ఖాయం. అది చాంద్ బాషా కదిరికి ఎసరు పెడుతున్నారా…ప్రభాకర్ చౌదరి అనంతపురం సీటుని ఆయన స్వాహా చేస్తున్నారా అన్నది స్పష్టం కాలేదు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న సమయంలో వివిధ నేతల సహకారం ఆశించి ఆయన తన యాత్రను సాగించినట్టు అనుమానిస్తున్నారు. గతంలో చిరంజీవికి ప్రజల్లో ఆదరణ కనిపించినా, నేతల రాజకీయాలతో చివరకు పాలకొల్లులో పరాజయం పాలయ్యారు. అలాంటి చెంపదెబ్బ నేపథ్యంలో ఈసారి తనకు ఆ పరిస్థితి రాకూడదని పవన్ భావిస్తున్నారు. అదే సమయంలో తాను రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారంలో ఉండాల్సిన అవసరం ఉండడంతో, అనంతలో తనకు అందరి సహకారం అవసరమని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల జగన్ పాదయాత్ర పుణ్యంగా ప్రతిపక్షం ఫుల్ జోష్ లో ఉందని జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారే అంగీకరిస్తున్న తరుణంలో పరిస్థితులను చక్కదిద్దుకోవడం కోసమే పవన్ ఇలాంటి పనిచేసి ఉంటారని, కానీ రాష్ట్రమంతా పార్టీ ప్రయోజనాలను పణంగా పెట్టేశారని పలువురు భావిస్తున్నారు. మొత్తంగా ఏదో సాధిస్తారని ఆశిస్తే చివరకు జనసేన దిశానిర్ధేశం లేని సందిగ్ధ స్థితిలో చివరకు టీడీపీకి ఉపగ్రహంగా మారిపోయినట్టుగా అంచనాలు పెరుగుతున్నాయి.


Related News

tdp mps meeting

టీడీపీలో రాజ్య‌స‌భ లొల్లి…

Spread the loveఏపీలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌తో వ‌చ్చే రాజ్య‌స‌భ ఎన్నిక‌లు ఆస‌క్తిగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం మూడు సీట్లు ఖాళీRead More

bjp

బీజేపీ ఎదురుదాడి ఫ‌లిస్తుందా…?

Spread the loveఏపీలో క‌మ‌ల‌నాధులు తీవ్రంగా క‌ల‌వ‌ర‌ప‌డుతున్నారు. నాలుగేళ్ల క్రితం క‌ళ‌క‌ళ‌లాడిన క్యాంప్ ఇప్పుడు తీవ్రంగా క‌ల‌త చెందుతోంది. అస‌లుRead More

 • జ‌గ‌న్ వ్యూహాత్మ‌క అడుగులు..
 • గేరు మార్చిన జగన్
 • మో’ఢీ’ అంటున్న బాబు…ఏం జరగబోతోంది?
 • పవన్ పథకం పారుతుందా..
 • మోడీ ముందు మోకరిల్లిన తెలుగు ఎంపీలు
 • జగన్ ఇరుక్కుంటున్నట్టే
 • బాబుకి బూమరాంగ్ అయ్యింది…!
 • బాబు వద్దంటుంటే..జగన్ కావాలంటున్నారు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *