Main Menu

జ‌న‌సేనాని త‌న గోతిని తానే త‌వ్వుకున్న‌ట్టు!

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్య మార్పులు ఖాయం అన‌డంలో అనుమానం లేదు. అందుకు నిద‌ర్శ‌నంగానే తాజా ప‌రిణామాలున్నాయి. ముఖ్యంగా గ‌డిచిన కొన్ని నెల‌లుగా ఉప్పూ నిప్పులా ఉన్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ మ‌ధ్య మ‌ళ్లీ స్నేహం చిగురించింద‌నే సంకేతాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతున్నాయి. టీడీపీ, జ‌న‌సేన పొత్తు పొడుస్తోంద‌నే వార్త‌లు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజా వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా క‌నిపిస్తోంది. జ‌గ‌న్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల ప‌ట్ల విశ్వ‌స‌నీయ‌త ఏమేర‌క‌న్న‌ది ప‌క్క‌న పెడితే జ‌నంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌వ‌హారం ప‌ట్ల అనుమానాలు అందుకు ఊత‌మిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్టీ ఆవిర్భావ వేడుక‌ల సంద‌ర్భంగా చేసిన విమ‌ర్శ‌ల‌తో జ‌న‌సేన ద‌శ‌దిశా మార్చేశారు. అప్ప‌టి వ‌ర‌కూ స్త‌బ్దుగా ఉన్న పార్టీలో జోష్ నింపారు. యువ‌తలో ఉత్సాహం క‌ల్పించారు. దాంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు ఎత్తిచూప‌డంలో జ‌న‌సైనికులు రెట్టించిన ఉత్సాహంతో సాగారు. ఇక ప్ర‌జా పోరాటయాత్ర‌ల‌తో క్షేత్ర‌స్థాయిలో ప‌వ‌న్ కూడా ప‌బ్లిక్ మీటింగ్స్ సంద‌ర్భంగా మ‌రింత ప్రోత్సాహాన్నిచ్చారు. నారా లోకేష్ మీద గురిపెట్టి చేసిన విమ‌ర్శ‌లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టిన తీరుతో ప‌వ‌న్ కి ఆద‌ర‌ణ ల‌భించింది. దాంతో జ‌న‌సేన కూడా బ‌ల‌మైన శ‌క్తిగా ముందుకు వ‌స్తుంద‌నే అభిప్రాయం రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌కు క‌లిగింది.

ఈలోగా అనూహ్యంగా ప‌వ‌న్ స్వ‌రం స‌వ‌రించుకున్నారు. జ‌గ‌న్, బాబు మీద ఏక‌కాలంలో గురిపెట్టిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత క్ర‌మంగా బాబుని మ‌ర‌చిపోయారు. పాల‌క‌ప‌క్షాన్ని వ‌దిలి, ప్ర‌తిప‌క్షం మీద విమ‌ర్శ‌లు చేయ‌డానికే ప‌రిమితం అయ్యారు. ఇది ప‌లు సందేహాల‌కు తావిచ్చింది. ఇక చివ‌ర‌కు రెండు నెల‌లుగా ఆయ‌న ప్ర‌జా జీవితానికే దూర‌మ‌య్యారు. ఆఫీసులో స‌మీక్ష‌లు, అభ్య‌ర్థుల‌కు ప‌రీక్ష‌లు త‌ప్ప జ‌న‌సేన‌ని జ‌నంలోకి తీసుకెళ్ల‌డంలో ప‌వ‌న్ ఫెయిలయ్యార‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ముఖ్యంగా ప‌వ‌న్ అమెరికా ప‌ర్య‌ట‌న త‌ర్వాత వ‌చ్చిన ఈ మార్పులే ఇప్పుడు మ‌రిన్ని అనుమానాల‌కు దోహ‌ద‌ప‌డుతున్నాయి.

ఇక చివ‌ర‌కు చంద్ర‌బాబుతో మ‌ళ్లీ రాజ‌కీయ స‌ఖ్య‌త‌కు జ‌న‌సేనాని సంకేతాలు ఇస్తున్నార‌నే క‌థ‌నాల‌కు ఈ ప‌రిస్థితి ఊత‌మిస్తోంది. అటు టీడీపీ అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఇటు వైసీపీ కొత్త నేత‌ల‌ను చేర్చుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ జ‌న‌సేన అధినేత మాత్రం చివ‌ర‌కు త‌న ప‌ర్యట‌న తేదీల‌ను కూడా మార్చుకుంటూ రాజ‌కీయ సందిగ్ధ‌లో ఉన్నార‌నే అభిప్రాయాల‌ను క‌లిగిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో టీడీపీతో మ‌ళ్లీ క‌ల‌వ‌డం, ఈసారి పోటీకి కూడా కొన్ని స్థానాలు కోరుతున్నార‌నే క‌థ‌నాలు రావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు. అదే జ‌రిగితే ప‌వ‌న్ త‌న పొలిటిక‌ల్ భ‌వితవ్యాన్ని పూర్తిగా పాత‌రేసుకున్న‌ట్టే అవుతుంది. ముఖ్యంగా ప్ర‌జా వ్య‌తిరేక ఓట్ల చీలిక త‌గ్గి వైసీపీకి అద‌న‌పు బ‌లం అవుతుందో లేదో అన్న‌ది ప‌క్క‌న పెడితే ప‌వ‌న్ క్రెడిబులిటీ, చివ‌ర‌కు ఉండ‌వ‌ల్లి వంటి వారు అన్న‌ట్టుగా అధికార పార్టీతో క‌లిస్తే ఆయ‌న‌తో ఎమోష‌న‌ల్ గా జ‌త‌గ‌ట్టిన వారు దూర‌మ‌య్యే ప‌రిస్థితి దాపురిస్తుంది. మాట మీద నిల‌బ‌డే నాయ‌కుడు కాద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల‌కు క‌లిగితే ఆయ‌న మాట‌ను ఖాత‌రు చేసే ప‌రిస్థితి కూడా ఉండ‌దు. కాబ‌ట్టి ముందుకా వెనక్కా అన్న‌ది ప‌వ‌న్ చేతుల్లోనే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Related News

టీడీపీలో అస్ప‌ష్ట‌త‌: కొలిక్కిరాని క‌స‌ర‌త్తులు

Spread the love8Sharesతెలుగుదేశం పార్టీకి కొత్త త‌ల‌నొప్పులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఎంపీ ల విష‌యంలో అధికార పార్టీ అవ‌స్థ‌లు ప‌డుతోంది.Read More

నాన్న బాట‌లోనే జ‌గ‌న్!

Spread the love294Sharesవైఎస్ జ‌గ‌న్ కొత్త పంథాలో సాగారు. తండ్రి వైఎస్సార్ ని అనుస‌రించారు. అభ్య‌ర్థుల విష‌యంలో వైసీపీ జాబితాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *