పవన్ సీన్ మార్చేస్తారా…?

janasena pawan
Spread the love

జనసేన అధినేత రంగంలోకి వస్తున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో ఇప్పటి వరకూ చర్చలు, సమావేశాలు, నిజనిర్థారణలు, ట్వీట్లతో సరిపెట్టిన పవన్ కళ్యాణ్ ఇక ప్రజల్లోకి అడుగుపెట్టే తరుణం ఆసన్నమయినట్టు కనిపిస్తోంది. హోదా ఉద్యమాన్ని కొత్త దిశగా మళ్లించడానికి సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆవిర్భావదినోత్సవం సందర్భంగా చంద్రబాబు సర్కారు మీద నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్, అదే సమయంలో ఏపీ హక్కుల కోసం ఎందాకైనా తెగిస్తానని చెప్పారు. వామపక్షాలతో చర్చించి రంగంలో దిగుతానని వెల్లడించారు. అవసరమైతే ఆమరణదీక్షకు కూడా వెనుకాడేది లేదని తేల్చేశారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డెక్కే అవకాశాలున్నాయని పలువురు భావిస్తున్నారు.

నాలుగేళ్లుగా సాగుతున్న హోదా ఉద్యమం రెండు నెలలుగా కొత్త మలుపు తిరిగింది. ఫిబ్రవరంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత జరిగిన రాష్ట్ర బంద్ కి అనూహ్య మద్దతు లభించడంతో అన్ని పార్టీలు అటు మళ్లాయి. లెఫ్ట్ పార్టీలు బంద్ కి పిలుపునిస్తే అన్ని పార్టీలు తోడయ్యాయి. చివరకు తెలుగుదేశం హోదా అవసరం లేదని చెప్పి కూడా మాట మార్చి, హోదా కోసం పోరుకి సిద్ధపడుతోంది. ఇక మిగిలినపక్షాలు కూడా అదే నినాదం అందుకోవడంతో ఏపీలో ప్రత్యేక హోదా నినాదం మారుమ్రోగుతోంది. బీజేపీ మినహా అన్ని పార్టీలు, అన్ని సంఘాలు హోదా కోసం సమరానికి సై అంటున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలకు కూడా సిద్ధమయ్యారు. ఆమరణదీక్ష చేస్తామని కూడా చెబుతున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా రోడ్డెక్కితే మాత్రం రాష్ట్రంలో హీటు మరింత పెరగడం ఖాయం. దీక్ష కాకపోయినా కనీసం నిరసనలకు సిద్ధపడినా అది పెద్ద ఉద్యమంగా రూపుదాలుస్తుంది. దాంతో సర్కారుకి పెద్ద సమస్య అవుతుంది. పవన్ వెంట తరలివచ్చే కార్యకర్తలతో ఉద్యమం నూతన జవసత్వాలు అందుకుంటుంది.

దాంతో ఇప్పుడు అందరి కన్ను పవన్ నిర్ణయం మీద పడింది. విజయవాడ కేంద్రంగా వామపక్ష నేతలతో పవన్ చర్చలు జరపబోతున్నారు. అదే సమయంలో తన పార్టీని బలపరిచే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. వివిధ జిల్లాల్లో పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. కమిటీల ఏర్పాటు కోసం కసరత్తులు చేస్తున్నారు. అదే తరుణంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని ప్రభావం పెంచుకోవడానికి జనసేనానికి మంచి అవకాశం వచ్చిందని పరిశీలకులు భావిస్తున్నారు. దానిని ఏమేరకు వినియోగించుకుంటారన్నది పవన్ చేతుల్లోనే ఉంది. దూకుడు ప్రదర్శించి, ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా సాగితే మాత్రం హోదా గోదాలో పవన్ కి మంచి ఫలితాలు వస్తాయని అంచనాలేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే జనసేన అధినేత రాకతో ఏపీలో హోదా ఉద్యమ సీన్ ఏమేరకు మారుతుందన్నది ఆసక్తిగా తయారయ్యింది.


Related News

cbn

చంద్ర‌బాబు ఆందోళ‌న చెందుతున్నారా?

Spread the love2Sharesఅనుమానం వ‌స్తోంది. ఆయ‌న వ‌రుస‌గా జ‌రుగుతున్న ప‌రిణామాల‌తో తీవ్రంగా క‌ల‌త చెందుతున్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. తాజాగా ఏపీసీఎంRead More

Pawan-kalyan-targets-Tv-channales

ప‌వ‌న్ లో ప‌రిణ‌తి లేదా..?

Spread the loveఆస‌క్తిక‌ర వార్ మొద‌ల‌య్యింది. అయితే ఈసారి ఇద్ద‌రు రాజ‌కీయ నాయ‌కులు కాకుండా ఓ వైపు, మ‌రోవైపు జ‌న‌సేనానిRead More

 • రాజ‌కీయ రంగంలో టీవీ9 యాజ‌మాన్యం
 • వైసీపీది వాపా?..బ‌ల‌మా??
 • ఏపీలో ఒంట‌రిగా మిగిలిన టీడీపీ!
 • టీడీపీ ఏం చెప్పుకోవాలి…?
 • బాబు బ‌లం మీద దెబ్బ కొడుతున్నారు..
 • బాబు కొత్త బంధం: ఆపార్టీతో టీడీపీ పొత్తు!
 • జ‌గ‌న్ పార్టీలోకి జంపింగ్ లు షురూ!
 • పవన్ కి పరిష్కారం అతడే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *